Home
News

యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టెలికాం దిగ్గజాలు, ఇకపై ఛార్జీలు ఉండవు

గత ఏడాది టెలికాం దిగ్గజాలకు పెద్ద పండగలాంటి వాతావరణమే కనిపించిందని చెప్పవచ్చు. పోటీలు పడి అన్నీ దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

గత ఏడాది టెలికాం దిగ్గజాలకు పెద్ద పండగలాంటి వాతావరణమే కనిపించిందని చెప్పవచ్చు. పోటీలు పడి అన్నీ దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే జియో రాకతో టెలికాం రంగం అనేక కుదుపులకు గురైన సంగతి అందరికీ తెలిసిందే.. నెలవారీ, మూడు నెలలు అలాగే రెండు నెలల ప్లాన్లతో వినియోగదారులు తమ పరిధి నుండి చేజారిపోకుండా కాపాడుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కస్టమర్లకు ఓ శుభవార్తను అందించాయి.

బీఎస్ఎన్ఎల్‌, వొడాఫోన్‌, ఐడియా నెట్‌వ‌ర్క్‌ల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్ల‌కు....

బీఎస్ఎన్ఎల్‌, వొడాఫోన్‌, ఐడియా నెట్‌వ‌ర్క్‌ల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్ల‌కు....

బీఎస్ఎన్ఎల్‌, వొడాఫోన్‌, ఐడియా నెట్‌వ‌ర్క్‌ల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్ల‌కు ఆయా కంపెనీలు ఓ శుభ‌వార్త‌ను మోసుకొచ్చాయి. ఇక‌పై ఈ నెట్‌వ‌ర్క్‌ల‌లో ఉన్న వినియోగ‌దారుల‌కు బ్లాక్ అవుట్ డేస్ ఉండ‌వని టెలికాం దిగ్గజాలు చెప్పాయి.

ఎస్ఎంఎస్‌ల‌కు కంపెనీలు చార్జీలు విధిస్తాయి....

ఎస్ఎంఎస్‌ల‌కు కంపెనీలు చార్జీలు విధిస్తాయి....

సాధార‌ణంగా పండుగ‌లు, ముఖ్య‌మైన రోజుల్లో వినియోగ‌దారులు పంపుకునే ఎస్ఎంఎస్‌ల‌కు కంపెనీలు చార్జీలు విధిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఎలాంటి స్పెష‌ల్ ప్యాక్స్‌ కాని ఎస్ఎంఎస్ ప్యాక్‌లు కాని ప‌నిచేయ‌వు. ఆ రోజుల్లో పంపుకునే ఎస్ఎంఎస్‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు చార్జిల‌ను విధిస్తూనే ఉన్నారు. అయితే జియో రాక‌తో ఇత‌ర టెలికాం నెట్‌వ‌ర్క్‌ల‌కు ఇప్పుడు పెద్ద స‌మ‌స్య ఎదురైంది.

జియో కంపెనీ బ్లాక్ అవుట్ డేల‌లోనూ....

జియో కంపెనీ బ్లాక్ అవుట్ డేల‌లోనూ....

జియో కంపెనీ బ్లాక్ అవుట్ డేల‌లోనూ ఎస్ఎంఎస్‌ల‌కు చార్జిలు విధించ‌డం లేదు. దీంతో బీఎస్ఎన్ఎల్‌, వొడాఫోన్‌, ఐడియాలు కూడా ఇప్పుడు జియో బాట ప‌ట్టాయి.

2019లో వ‌చ్చే ప్ర‌త్యేక రోజులు....

2019లో వ‌చ్చే ప్ర‌త్యేక రోజులు....

నేటి నుంచి మొద‌లుకొని 2019లో వ‌చ్చే ప్ర‌త్యేక రోజులు, పండుగ రోజుల్లో వినియోగ‌దారులు పంపుకునే ఎస్ఎంఎస్‌ల‌కు చార్జిలు విధించ‌బోమని, వారు య‌థావిధిగా త‌మ ఎస్ఎంఎస్ ప్యాక్‌ల‌ను వాడుకోవ‌చ్చ‌ని ఈ కంపెనీలు తెలిపాయి.

 

 

ఎయిర్‌టెల్ మాత్రం....

ఎయిర్‌టెల్ మాత్రం....

అంటే ఇక‌పై ఈ నెట్‌వ‌ర్క్‌ల‌లో బ్లాక్ అవుట్ డేస్ ఉండ‌వ‌న్న‌మాట‌. అయితే ఎయిర్‌టెల్ మాత్రం ఇంకా ఈ విషయంపై ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
After BSNL, Vodafone Idea Bids Goodbye to Blackout Days in 2019 more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X