Home
News

Vodafone Idea 5G వోడాఫోన్‌ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్.. 5G నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ ప్రారంభం..!

భారత టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మారుమూల ప్రాంతాలకు కూడా నెట్‌వర్క్‌ అందించే విధంగా సంస్థలు పనిచేస్తున్నాయి. దీంతోపాటు డేటా స్పీడ్‌ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ సంస్థలు 5G నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. BSNL ప్రస్తుతం 4G నెట్‌వర్క్‌ను అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. మే నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది. మరియు జూన్‌లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తామని చెబుతోంది.

అయితే మరో సంస్థ వోడాఫోన్‌ ఐడియా తన యూజర్‌లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 5G నెట్‌వర్క్‌ను ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు (Vodafone idea 5G Trails) తెలిపింది. ముంబయిలో ఈ ట్రయల్స్‌ చేస్తున్నట్లు తెలిపింది. అనేక మంది వోడాఫోన్ ఐడియా యూజర్లు తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.

Vodafone idea has begin 5G trials in mumbai

ముంబయిలో ఎంపిక చేసిన కస్టమర్‌లకు Vi 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రూ.299, అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌లపై అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చని.. Vi తన యూజర్లకు పంపిన మెసేజ్‌లో పేర్కొంది. దీనిపై అనేక మంది యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రయల్స్ విజయవంతం అయ్యాక.. దశలవారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ముంబయి తర్వాత ఢిల్లీ, బెంగళూరు, చంఢీగడ్‌, పాట్నా వంటి ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ లాంచ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. Vi 5G ట్రయల్స్ కు సంబంధించిన మెసేజ్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

వోడాఫోన్‌ ఐడియా రూ.299 రీఛార్జ్ ప్లాన్ (Vi Rs299 Recharge Plan) ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా ఈ ప్లాన్‌లో రోజువారీ 1GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రూ.349 రీఛార్జ్‌ ప్లాన్‌లో (Vi Rs349 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతి రోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వినియోగించుకోవచ్చు. ప్రతి నెల ఇలా 2GB వరకు వినియోగించుకోవచ్చు.

రూ.369 Vi రీఛార్జ్‌ ప్లాన్‌లో (Vi Rs369 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. అదే విధంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 12AM నుంచి 12PM వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు.

దీందోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్‌ వంటి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. డేటా డిలైట్‌ అంటే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వినియోగించుకోవచ్చు. ఇలా నెలకు ఒకసారి 2GB వరకు వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone idea has begin 5G trials in mumbai here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X