Vi : షాకింగ్ నిర్ణయం తీసుకున్న వోడాఫోన్ ఐడియా.. పూర్తి వివరాలు..!
భారత్‌లోని టెలికాం సంస్థలు ఈ సంవత్సరం చివర్లో మొబైల్ టారిఫ్ లను పెంచే అవకాశం ఉంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. BSNL మినహా మిగిలిన సంస్థలు 10- 12 శాతం రీఛార్జ్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా సంస్థలు మాత్రం పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే అంతకంటే ముందుగానే నెట్‌వర్క్ ప్రొవైడర్లు కొన్ని ప్లాన్‌లలో మార్పులు చేస్తున్నాయి. తొలుత BSNL, అనంతరం ఎయిర్‌టెల్. తాజాగా వోడాఫోన్ ఐడియా కొన్ని మార్పులు చేశాయి.
కీలక నిర్ణయాలు :
గతంలో జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు రోజువారీ 1GB డేటాను అందించే ప్లాన్‌లను పూర్తిగా ఎత్తివేశాయి. వోడాఫోన్ మాత్రమే రోజువారీ 1GB అందించే ప్లాన్‌ను కొనసాగిస్తోంది. అయితే ఇటీవల BSNL సంస్థ తన రీఛార్జ్ ప్లాన్‌లలో కొన్నింటి ప్రయోజనాల్లో మార్పులు చేసింది. డేటా, వ్యాలిడిటీ లో మార్పులు చేసింది. ఎయిర్‌టెల్ కూడా తాజాగా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది.

వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం! :
అయితే వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తన వార్షిక రీఛార్జ్ ప్లాన్ ధరను పెంచింది. ఏకంగా రూ.250 ధరను పెంచింది. టెలికాం టాక్ రిపోర్టు ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం Vi సంస్థ సుమారుగా 100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.
ఈ ప్లాన్‌పై రూ.250 పెంపు :
వోడాఫోన్ ఐడియా (Vodafone idea) వార్షిక ప్లాన్ ధర రూ.1,999 గా ఉండేది. తాజాగా ఈ ప్లాన్ ధరను రూ.250 పెంచింది. దీంతో ఈ ప్లాన్ ధర రూ.2249 గా మారింది. ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 3600 SMS లను అందిస్తోంది.
సంవత్సరం వ్యాలిడిటీ :
ఈ Vi ప్లాన్ లో భాగంగా మొత్తంగా 30GB డేటాను పొందవచ్చు. అయితే కొన్ని టెలికాం సర్కిల్స్ లో 40GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంటుంది. అంటే రోజువారీ రూ.6.16 చెల్లిస్తున్నట్లు భావించవచ్చు.
వోడాఫోన్ ఐడియా యూజర్ల పరంగా ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఈ సంవత్సరం తొలి భాగం నుంచి 5G నెట్‌వర్క్‌ను క్రమంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది.
ఎయిర్‌టెల్ షాకింగ్ నిర్ణయం :
మరో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కనిష్ట నెలవారీ రీఛార్జ్ ప్లాన్ నిన్న రూ.189 రీఛార్జ్ ప్లాన్ ను పూర్తిగా తొలగించింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను అందించేది. అయితే నెలవారీ కనిష్ఠ రీఛార్జ్ కోసం ఇప్పటి నుంచి రూ.199 ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎయిర్‌టెల్ రూ.199 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా ఈ ప్లాన్ లో 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications