Vi నుంచి త్వరలోనే 5G సేవలు! లాంచ్ ఎప్పుడంటే...?
Vi (వోడాఫోన్ ఐడియా) యొక్క ఒక తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో 5G సేవలను త్వరలో అంటే ఆరు నుండి ఏడు నెలల్లో ప్రారంభించాలనే దాని ప్రణాళికలను విడుదలచేసారు. తదుపరి తరం బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ మరియు 5G నెట్‌వర్క్ యొక్క రోల్ అవుట్‌పై పని చేయడానికి ముందు కంపెనీ యొక్క నిధుల సేకరణ పరిస్థితి గురించి మానిటైజేషన్ సమస్యపై టెల్కో మెరుగైన స్పష్టత పొందాలని ఆశిస్తున్నట్లు CEO అక్షయ మూండ్రా వెల్లడించారు.
ఇటీవల, 5G స్పెక్ట్రమ్ యొక్క కనీస రోల్ అవుట్ విషయం లో బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైనందుకు Vi కి టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) షోకాజ్ నోటీసును అందజేసింది.నివేదిక ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ కల్లా కంపెనీ త్రైమాసిక ఆదాయాల కాల్ సందర్భంగా మూండ్రా 5G రోల్ అవుట్ ప్లాన్‌లను పూర్తి చేయడం గురించి మాట్లాడారు.

ప్రస్తుతం, దేశంలో 5G నెట్వర్క్ కు మానిటైజేషన్ లేదని ఆయన హైలైట్ చేశారు. ఇది రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఈ రెండూ బహుళ సర్కిల్‌లలో 5G సేవలను అందుబాటులోకి తెచ్చాయి. అయితే, ఈ సేవల కోసం ఇంకా నిర్దిష్ట 5G టారిఫ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టలేదు. స్పెక్ట్రమ్‌ను ప్రారంభించే సమయానికి మానిటైజేషన్ ప్లాన్‌ను పొందాలని Vi లక్ష్యంగా పెట్టుకుంది.
Vi సంస్థ యొక్క నిధుల సేకరణ ఈ సేవను అందుబాటులోకి తీసుకురావడానికి ఒక కారకంగా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. అయితే, నివేదిక ప్రకారం దాని గురించి ఎలాంటి వివరాలు అందించలేదు. నగదు కొరతతో ఉన్న ఈ టెలికాం ఆపరేటర్ గత కొంతకాలంగా నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివిధ వర్గాలు గతంలో పేర్కొన్నాయి.
"ఫండింగ్ ప్లాన్‌లు కార్యరూపం దాల్చిన తర్వాత, 5Gని త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి మాకు దాదాపు 6-7 నెలల సమయం పడుతుంది మరియు... అప్పటికి మానిటైజేషన్ ఈనాటి కంటే స్పష్టంగా ఉంటుంది. మా వ్యూహం దానిపై ఆధారపడి ఉంటుంది, "అని మూండ్రా ప్రకటనలో తెలిపారు.
5G స్పెక్ట్రమ్ యొక్క వేలం తర్వాత DoT విధించిన కనీస రోల్ అవుట్ బాధ్యతలను నెరవేర్చడంలో కూడా Vi విఫలమైంది. నిబంధనల ప్రకారం స్పెక్ట్రమ్ పంపిణీ జరిగిన ఒక సంవత్సరంలోపు కనీసం ఒక మెట్రో మరియు ఒక మెట్రోయేతర సర్కిల్‌లో వాణిజ్యపరంగా 5G సేవలను ప్రారంభించాల్సిన బాధ్యత ఉంది.
అయితే, 5G స్పెక్ట్రమ్ వేలం జూలై 2022లో జరిగింది. ప్రత్యేక నివేదిక ప్రకారం VI ఈ విషయంలో ఇంకా వెనకబడి ఉంది. అందుకే, ఈ టెలికాం ఆపరేటర్‌కు నోటీసులు ఇవ్వొచ్చు మరియు జరిమానాలు విధించవచ్చు.
ఆగస్ట్ 2023 లో Vi తన 17 సర్కిల్‌లలో రెండింటిలో కనీస పెట్టుబడులు పెట్టినట్లు క్లెయిమ్ చేసినప్పటికీ, అది ఇంకా 5G సేవలను వాణిజ్యపరంగా ప్రారంభించలేదు.ఈ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్, Xiaomi మరియు క్వాల్కమ్ లతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇది మెరుగైన కవరేజ్ అనుభవాన్ని అందించడంలో కూడా సహాయపడుతుంది.
VI ఇటీవలే,యూరప్ లో 5G టెక్నాలజీ ని పరీక్షించింది కూడా. ఈ పరీక్ష సమయంలో కంపెనీలు 273 Mbps గరిష్ట అప్‌లింక్ వేగాన్ని సాధించాయి. మెరుగైన 5G టెక్నాలజీ అప్‌లోడ్ వేగం కోసం ఇది స్థాయిని పెంచుతుందని మరియు కవరేజీని విస్తరించడం మరియు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇంటర్నెట్ యొక్క అప్‌లింక్ వేగాన్ని డౌన్‌లోడ్ స్థాయిలకు దగ్గరగా తీసుకువస్తుందని ఒక విడుదల అయిన ప్రకటన లో వోడాఫోన్ తెలిపింది.


Click it and Unblock the Notifications








