ఎట్టకేలకు 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన వోడాఫోన్ ఐడియా.. ఈ జాబితాలో మీ ఊరి పేరు ఉందా?
ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (VI) ఎట్టకేలకు 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో ఎంపిక చేసిన సర్కిళ్లలో 5G నెట్‌వర్క్‌ను లాంచ్ చేసింది. భారత్ టెలికాం మార్కెట్‌లో జియో, ఎయిర్‌టెల్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. వోడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది. అయితే జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 5G సర్వీసులను అందిస్తోంది.
భారత్‌లోని 17 టెలికాం సర్కిళ్లలో వోడాఫోన్- ఐడియా 5G నెట్‌వర్క్‌ను (Vodafone idea 5G) ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఓక్లా ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 2, ఇండియా గేట్, ప్రగతి మైదాన్, తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో VI 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి.

వీటితోపాటు మహారాష్ట్రలోని పూణే - శివాజీనగర్, చెన్నైలోని - పెరుంగుడి మరియు నేసపక్కమ్, పంజాబ్‌లోని జలంధరలోని కొన్ని ప్రాంతాలు, బెంగళూరు డైరీ సర్కిల్, ముంబైలోని వర్లీ, మరోల్ అంధేరీ ఈస్ట్, బీహార్ రాష్ట్రంలోని పాట్నా- అనిషాబాద్ గోలంబార్ వంటి సర్కిళ్లలో VI 5G నెట్‌వర్క్‌ను లాంచ్ చేసింది.
వోడాఫోన్ ఐడియా 5G నెట్‌వర్క్‌ను పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి- సిటీ ప్లాజా సెవోక్ రోడ్, కోల్‌కతా సెక్టార్ 5, సాల్ట్ లేక్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ - పరదేశీపురం మరియు ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్, గుజరాత్‌లోని అహ్మదాబాద్ - కార్పొరేట్ రోడ్ మరియు మకర్బా, ప్రహ్లాద్ నగర్, హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ - ఇండస్ట్రియల్ ఏరియా, సెక్టార్ 3లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీంతోపాటు ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలోని ఆగ్రా - జేపీ హోటల్ మరియు ఫతేహాబాద్ రోడ్ వీటితోపాటు ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని లక్నో - విభూతి ఖండ్ మరియు గోమతి నగర్ సహా కేరళ రాష్ట్రంలోని కాకనాడ్ మరియు త్రిక్కకాడ లో 5G నెట్‌వర్క్‌ను VI విడుదల చేసింది. జైపూర్‌లోని మానససరోవర్ ఇండస్ట్రియల్ ఏరియా, గెలాక్సీ సినిమా, RIICO వంటి ప్రాంతాల్లో VI 5G లాంచ్ చేసింది.
అయితే ప్రస్తుతానికి వోడాఫోన్ ఐడియా కేవలం 17 సర్కిళ్లలో మాత్రమే 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగిలిన ప్రాంతాలకు 5G సర్వీసులను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరికొన్ని నెలల్లో మరిన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వోడాఫోన్ ఐడియా జులై నెలలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచింది. ఫలితంగా VI సంస్థ దేశవ్యాప్తంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీగా యూజర్లను కోల్పోయింది. వీటితోపాటు జియో, ఎయిర్‌టెల్ కూడా భారీగా యూజర్లను కోల్పోయింది. టెలికాం రెగ్యూలేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా ఈ వివరాలను వెల్లడించింది.
ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మాత్రమే జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూజర్లను సంపాదించుకుంది. జులై నెలలో వోడాఫోన్ ఐడియా 14 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. అదే ఆగస్టులో సుమారు 19 లక్షల మంది VI యూజర్ల ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్ అయ్యారు.


Click it and Unblock the Notifications








