దేశంలో కీలకమైన నగరంలో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వోడాఫోన్ ఐడియా..!
Vodafone idea 5G : ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ వోడాఫోన్ ఐడియా (Vi) క్రమంగా 5G నెట్‌వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ముంబైలో 5G నెట్‌వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం బిహార్‌లోని పాట్నా, పంజాబ్‌లోని చంఢీగడ్ నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. అయితే తాజాగా మరో కీలక నగరంలో Vi 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజాగా దేశ రాజధానిలో :
వోడాఫోన్ ఐడియా ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో 5G సర్వీసులను లాంచ్ చేసింది. ఢిల్లీ NCR లో ఈ సర్వీసులను ప్రారంభించింది. 5G మౌలిక సదుపాయాల కోసం ఎరిక్‌సన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వోడాఫోన్ ఐడియా NSA Non Standlone) ఆర్కిటెక్చర్ ఆధారిత 5G నెట్‌వర్క్ ను కలిగి ఉంది.

NSA అంటే ఏంటి :
NSA అంటే ఇప్పటికే ఉన్న 4G నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని 5G నెట్‌వర్క్ ను అందించడం. ఎయిర్‌టెల్ కూడా ఇదే తరహాలో 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది. అయితే జియో మాత్రం SA (Standlone) మోడల్‌లో 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది.
ఆగస్టు నాటికి మరిన్ని ప్రాంతాల్లో :
వోడాఫోన్ ఐడియా ఈ సంవత్సరం ఆగస్టు నాటికి మరిన్ని టెలికాం సర్కిల్స్‌లో 5G నెట్‌వర్క్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రారంభ ఆఫర్‌లో భాగం రూ.299 రీఛార్జ్ ప్లాన్ నుంచే అన్‌లిమిటెడ్ 5G సర్వీసులను అందిస్తోంది.
వోడాఫోన్ ఐడియా రూ.299 రీఛార్జ్ ప్లాన్ :
Vi రూ.299 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 1GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఇప్పటికే ముంబైలో 70 శాతం 5G స్మార్ట్‌ఫోన్‌లు కలిగిన యూజర్లు 5G సర్వీసులను ఉపయోగిస్తున్నారని Vi తెలిపింది.
దీంతోపాటు రానున్న మూడు సంవత్సరాల్లో 100 నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని వోడాఫోన్ ఐడియా లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు ప్రస్తుతం 5G నెట్‌వర్క్ అందిస్తున్న జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel) కంటే తక్కువ ధరకు 5G సర్వీసులను అందిస్తామని Vi గతంలో తెలిపింది.
BSNL పరిస్థితి ఎలా ఉంది?
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల కీలక వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ కోసం లక్ష 4G టవర్లు ఏర్పాటు చేయాలని భావించిన సంస్థ.. ఇప్పటి వరకు 84 వేలకు పైగా టవర్లను ఇన్‌స్టాల్ చేసినట్లు వెల్లడించింది. ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ ను లాంచ్ చేయాలని భావిస్తోంది.
దీంతోపాటు జూన్‌లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఢిల్లీలో తొలి దశలో BSNL 5G ను అందుబాటులోకి తీసుకురానుంది. అనంతరం క్రమంగా ఇతర నగరాలు పట్టణాలకు విస్తరించనుంది. 4G నుంచి సులభంగా 5G కు అప్‌గ్రేడ్ అయ్యేలా టెక్నాలజీని అభివృద్ధి చేసింది. TCS భాగస్వామ్యంతో 4G టెక్నాలజీని అభివృద్ధి చేస్తింది.


Click it and Unblock the Notifications








