Home
News

ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్లాన్‌లను లాంచ్‌ చేసిన Vi.. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ల పూర్తి వివరాలు..!

Vodafone Idea International Roaming Plans : ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్‌ ఐడియా (Vi) తాజాగా ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్లాన్‌లను లాంచ్‌ చేసింది. వీటిని ప్రత్యేకంగా గల్ఫ్ ప్రాంతానికి వెళ్లే యూజర్ల కోసం తీసుకొచ్చింది. Vi ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల కోసం వీటిని లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా ఇన్‌కమింగ్‌, అవుట్‌ గోయింగ్‌, డేటా కూడా అందిస్తోంది. ఇటీవలే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో Vi 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వోడాఫోన్ ఐడియా రూ.1199 ప్లాన్ :
గల్ఫ్ రీజియన్‌కు వెళ్లే వోడాఫోన్‌ ఐడియా ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం ఈ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో అన్‌లిమిటెడ్‌ ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ను అందిస్తోంది. మరియు 150 నిమిషాల వరకు అవుట్‌ గోయింగ్‌ (లోకల్‌, ఇండియా) కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు.

vodafone idea launched international prepaid and postpaid roaming plans for gulf

ఈ Vi ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో భాగంగా యూజర్లు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. మరియు SMS పంపేందుకు 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 20 రోజులుగా ఉంది.

Vi రూ.2388 రోమింగ్ ప్లాన్ :
ఈ ఇంటర్నేషనల్‌ ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను పొందవచ్చు. మరియు 300 నిమిషాల పాటు అవుట్‌ గోయింగ్‌ (లోకల్‌ + ఇండియా) కాల్స్‌ అందిస్తోంది. ఒక్కో SMS కోసం రూ.15 చెల్సించాల్సి ఉంటుంది.

ఈ ప్లాన్‌లో భాగంగా 4GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 40 రోజులుగా ఉంది. ప్రీపెయిడ్‌ ప్లాన్‌లతోపాటు పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల కోసం మరో రెండు ఇంటర్నేషనల్‌ గల్ఫ్‌ రోమింగ్‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. అయితే రూ.2500, రూ.4500 ధరల్లో లాంచ్ చేసింది.

Vi రూ.2500 రోమింగ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు గల్ఫ్‌ ప్రాంతంలో అన్‌లిమిటెడ్‌ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ను పొందవచ్చు. 500 నిమిషాల వరకు అవుట్‌ గోయింగ్‌ (లోకల్‌, ఇండియా) కాల్స్‌ను చేసేందుకు అవకాశం ఉంది.

అన్ని ఇన్‌కమింగ్‌ SMS లు ఉచితం కాగా.. 20 అవుట్‌గోయింగ్ SMS లను ఉచితంగా అందిస్తోంది. డేటా పరంగా ఈ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లో 4GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్లాన్ వ్యాలిడిటీ 20 రోజులుగా ఉంది.

వోడాఫోన్‌ ఐడియా రూ.4500 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా గల్ఫ్‌లో పర్యటించే యూజర్లు అన్‌లిమిటెడ్‌ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను పొందవచ్చు. మరియు 1000 నిమిషాల వరకు అవుట్‌ గోయింగ్‌ (లోకల్‌, ఇండియా) కాల్స్ చేసేందుకు అవకాశం ఉంది. వీటితోపాటు అన్ని ఇన్‌కమింగ్‌ SMS లను ఉచితంగా పొందవచ్చు.

మరియు 30 అవుట్‌ గోయింగ్‌ SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో (Rs4500 Vi international Roaming Plan) భాగంగా యూజర్లు గరిష్ఠంగా 8GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 40 రోజులుగా ఉంది.

భారత్‌లో మార్చి నెలలో ముంబయిలో 5G సర్వీసులను వోడాఫోన్‌ ఐడియా ప్రారంభించింది. ముంబయితోపాటే దేశంలోని ప్రముఖ స్టేడియంలలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం గత వారంలో పాట్నా, చండీఘడ్‌ నగరాల్లోనూ తీసుకొచ్చింది. త్వరలో బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీలోనూ ఈ సర్వీసులను లాంచ్‌ చేసే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vodafone idea launched international prepaid and postpaid roaming plans for gulf
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X