Home
News

Vodafone Idea కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల ఆఫర్స్ చూడతరమా...

వోడాఫోన్ ఐడియా ఇప్పుడు ఇండియాలో మరొక రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. రూ.218 మరియు రూ.248 ధరల వద్ద ఎంచుకున్న సర్కిల్‌లలో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాల్‌లను అందిస్తున్నాయి.

వోడాఫోన్

యాడ్-ఆన్‌లలో వినియోగదారులు Zee5 చందా మరియు వోడాఫోన్ ప్లే చందాను కూడా ఉచితంగా పొందుతారు. ఈ కొత్త వొడాఫోన్ ప్లాన్‌లు ప్రస్తుతం డిల్లీ మరియు హర్యానా సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో లేదా మై వోడాఫోన్ యాప్ ద్వారా మాత్రమే వీటిని రీఛార్జ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

 

 

వోడాఫోన్ రూ.218 ప్లాన్

వోడాఫోన్ రూ.218 ప్లాన్

వోడాఫోన్ ఐడియా యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రూ.218 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో ఏ నెట్‌వర్క్‌కు అయిన స్థానిక మరియు జాతీయ అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనంను ఇస్తుంది. ఈ ప్లాన్ తన మొత్తం చెల్లుబాటు కాలానికి 6GB డేటా మరియు 100 స్థానిక మరియు జాతీయ SMSలను అందిస్తుంది. ఈ ప్యాక్ వొడాఫోన్ ప్లే మరియు Zee5 యొక్క కాంప్లిమెంటరీ చందాను ఉచితంగా అందిస్తుంది.

 

 

వోడాఫోన్ రూ.248 ప్లాన్

వోడాఫోన్ రూ.248 ప్లాన్

వోడాఫోన్ కొత్తగా విడుదల చేసిన రెండవ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.248 ధరను కలిగి ఉంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఏ నెట్‌వర్క్‌కు అయిన లోకల్ + నేషనల్ అపరిమిత కాల్స్ , మొత్తం చెల్లుబాటు కాలానికి 8GB డేటా మరియు 100 లోకల్ మరియు నేషనల్ SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ వొడాఫోన్ ప్లే మరియు Zee5 యొక్క కాంప్లిమెంటరీ చందాను ఉచితంగా అందిస్తుంది.

 

 

వోడాఫోన్ కొత్త ప్యాక్‌లు

వోడాఫోన్ కొత్త ప్యాక్‌లు

వోడాఫోన్ యొక్క ఈ కొత్త ప్యాక్‌లు ప్రస్తుతం డిల్లీ మరియు హర్యానాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే ప్రణాళికలు దాని చందాదారుల కోసం ఐడియా వెబ్‌సైట్‌లో కూడా జాబితా చేయబడ్డాయి. Zee 5 మరియు వొడాఫోన్ ప్లే యాడ్-ఆన్‌లు ఐడియా కస్టమర్ల కోసం జాబితా చేయబడలేదు.

 

 

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్

వోడాఫోన్ అందిస్తున్న డబుల్ డేటా ఆఫర్ విషయానికి వస్తే రూ.249, రూ.399, మరియు రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌ల మీద ఇప్పుడు అదనంగా 1.5GB రోజువారీ హై-స్పీడ్ డేటాను అందిస్తున్నది. అంటే రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు మొత్తంగా 3GB హై-స్పీడ్ డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నది. అలాగే రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వాలిడిటీతో రోజువారీ 3GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అలాగే రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ అదనపు హై స్పీడ్ డేటాను 84 రోజులకు అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea Launched Rs 218 and Rs 248 Prepaid Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X