Home
News

ఈ సిమ్‌ కార్డు యూజర్లకు గుడ్‌న్యూస్‌.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌, అన్‌లిమిటెడ్ డేటాతో మూడు రీఛార్జ్‌ ప్లాన్‌లు!

ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్‌ ఐడియా (Vodafone idea) తాజాగా ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం మూడు రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్‌ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లు ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ టెలికాం సర్కిల్‌, కోలకతా, మహారాష్ట్ర, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌, కర్ణాటక, రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, ఛత్తీశ్‌గడ్‌ వంటి టెలికాం సర్కిల్స్‌ ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

వోడాఫోన్ ఐడియా రూ.398 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vodafone idea Rs398 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్‌ మరియు STD కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

vodafone idea

Vi రూ.698 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ఫ్లాన్‌లో (Vodafone idea Rs698 Recharge Plan) భాగంగా వోడాఫోన్‌ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌ మరియు STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.

వోడాఫోన్‌ ఐడియా రూ.1048 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vodafone idea Rs1048 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌ మరియు STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

వోడాఫోన్ ఐడియా ఇటీవలే కీలక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంవత్సరం మార్చి నెలలో ముంబైలో తొలుత 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. అనంతరం పాట్నా, చంఢీగడ్‌ నగరాల్లోనూ 5G ను ప్రారంభించింది. గత వారం దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ NCR లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

vodafone idea

ఈ సంవత్సరం ఆగస్టు నాటికి మరిన్ని టెలికాం సర్కిల్స్‌లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. దీంతోపాటు వచ్చే మూడు నెలల్లో 100 నగరాల్లో Vi 5G సేవలను లాంచ్‌ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌ను కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

Take a Poll

వోడాఫోన్‌ ఐడియా NSA Non Standlone) ఆర్కిటెక్చర్‌ ఆధారిత 5G నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. NSA అంటే ఇప్పటికే ఉన్న 4G నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని 5G నెట్‌వర్క్‌ను అందించడం. ఎయిర్‌టెల్‌ కూడా ఇదే తరహాలో 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది. అయితే జియో మాత్రమే SA (Standlone) మోడల్‌లో 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది.

ఇప్పటికే ముంబైలో అత్యధిక శాతం వోడాఫోన్‌ ఐడియా యూజర్లు 5G నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నారని సంస్థ వెల్లడించింది. Vi రూ.299 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone idea launched Rs398, Rs698 and Rs1048 prepaid recharge plans with unlimited data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X