Vodafone Idea యూజర్లకు eSIM మద్దతు!!! ఈ ఫోన్లకు మాత్రమే...

|

వొడాఫోన్ ఐడియా సంస్థ ఢిల్లీ, గుజరాత్ మరియు ముంబై సర్కిల్‌లలో తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా "ఈసిమ్" మద్దతును ప్రారంభించింది. ఈసిమ్ మద్దతు యొక్క అర్హతను కలిగిన వొడాఫోన్ మరియు ఐడియా కస్టమర్లు తమ మొబైల్ ఫోన్లలో వారి సెల్యులార్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి భౌతిక సిమ్ కార్డును ఉంచాల్సిన అవసరం లేదు.

వొడాఫోన్ ఐడియా eSIM మద్దతు

వొడాఫోన్ ఐడియా eSIM మద్దతు

బదులుగా వారు ఇంటిగ్రేటెడ్ సిమ్ చిప్ ద్వారా నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయగలరు. కాకపోతే ఈ కొత్త మద్దతు ప్రారంభంలో మొదట ఐఫోన్ మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మద్దతు తరువాతి దశలో ఇతర ఫోన్‌లకు విస్తరించబడుతుంది.

 

Also Read: బడ్జెక్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో MediaTek 5G చిప్‌సెట్‌!!Also Read: బడ్జెక్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో MediaTek 5G చిప్‌సెట్‌!!

వొడాఫోన్ ఐడియా ఈసిమ్ మద్దతు ఫోన్లు

వొడాఫోన్ ఐడియా ఈసిమ్ మద్దతు ఫోన్లు

వొడాఫోన్ ఐడియా సంస్థ కొత్తగా ప్రారంభించిన "ఇసిమ్" మద్దతు ఇప్పుడు ఐఫోన్ యొక్క కొన్ని మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ జాబితాలో ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ SE (2020), ఐఫోన్ XS, ఐఫోన్ XS మాక్స్ మరియు ఐఫోన్ XR వంటివి ఉన్నాయి. ఈ కొత్త సర్వీస్ త్వరలో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, గెలాక్సీ ఫోల్డ్‌లో కూడా లభిస్తుందని వొడాఫోన్ ఐడియా టెల్కో ఒక ప్రకటనలో తెలిపింది.

eSIM మద్దతు ఆపరేటర్లు
 

eSIM మద్దతు ఆపరేటర్లు

ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో రెండు టెలికాం ఆపరేటర్లు భారతదేశంలో ఇసిమ్ మద్దతును ఇప్పటికే అందించడం ప్రారంభించాయి . వోడాఫోన్ ఐడియా గత నెలలో దేశంలో ఆపిల్ వాచ్ సెల్యులార్ మోడళ్లకు ఇలాంటి మద్దతును ప్రకటించడం ద్వారా ఈ కొత్త ఇసిమ్ అనుభవాన్ని ప్రారంభించింది.

ఐఫోన్ లో డ్యూయల్-సిమ్ మద్దతు

ఐఫోన్ లో డ్యూయల్-సిమ్ మద్దతు

వోడాఫోన్ మరియు ఐడియా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు కొత్తవారు లేదా ఇప్పటికే ఉన్నవారు కూడా తమ ఐఫోన్ మోడళ్లపై eSIM మద్దతును పొందవచ్చు. ఐఫోన్ వినియోగదారులకు ఇప్పటి వరకు సంప్రదాయమైన డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్ లేనందున తమ ఫోన్లలో రెండు సిమ్ లను ఉపయోగించ లేకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇసిమ్ మద్దతు లభించడంతో ఐఫోన్ మోడల్ లలో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ సిమ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకునే సౌలభ్యాన్ని పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Vodafone Idea Launches eSIM Service in India For iphone Devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X