వీఐ ప్రీపెయిడ్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇక డేటా షేరింగ్, డిస్కౌంట్లు మీ సొంతం!
వొడాఫోన్ ఐడియా (Vi) దేశవ్యాప్తంగా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ‘ప్రీపెయిడ్ ఫ్యామిలీ’ (Prepaid Family) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రీపెయిడ్ యూజర్లు చిన్న మొత్తంలో డేటాను షేర్ చేసుకోవడంతో పాటు యాప్‌లో రీఛార్జ్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఆఫర్‌ను తీసుకొచ్చామని వీఐ వెల్లడించింది. ఒక ఫ్యామిలీ గ్రూప్‌లో గరిష్టంగా నలుగురు వీఐ ప్రీపెయిడ్ యూజర్లు చేరవచ్చు. అంతేకాదు, దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న వీఐ నంబర్‌తోనైనా (క్రాస్-సర్కిల్) డేటా షేర్ చేసుకునే వీలుంది.
ఈ డేటా షేరింగ్‌ను ముఖ్యంగా అత్యవసర అవసరాల కోసమే డిజైన్ చేశారు. అందుకే దీనిపై కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. ఒక సభ్యుడు ఒకేసారి 500 MB డేటాను మాత్రమే పంపగలరు. రోజుకు ఒకసారి, వారానికి రెండుసార్లు, నెలకు గరిష్టంగా నాలుగు సార్లు మాత్రమే డేటా పంపేందుకు అనుమతి ఉంటుంది. షేర్ చేసిన డేటా అదే రోజు రాత్రి 11:59 గంటలకు గడువు ముగుస్తుంది. దేశవ్యాప్తంగా ఏ సర్కిల్‌లో ఉన్న వీఐ నంబర్‌కైనా ఈ డేటాను పంపుకోవచ్చు.

Vi యాప్‌లో 'ప్రీపెయిడ్ ఫ్యామిలీ'ని ఎలా సెటప్ చేయాలి?
ముందుగా Vi యాప్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్‌పై ఉన్న 'Family' ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. అందులో 'Create Family' ఎంచుకుని, మీరు యాడ్ చేయాలనుకుంటున్న వీఐ ప్రీపెయిడ్ నంబర్‌ను సెలెక్ట్ చేయాలి లేదా ఎంటర్ చేసి ఓటీపీ (OTP) వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఫ్యామిలీని క్రియేట్ చేసిన వ్యక్తి ప్రైమరీ మెంబర్‌గా, మిగిలిన వారు సెకండరీ మెంబర్లుగా ఉంటారు. వీరికి 90 రోజుల లాక్-ఇన్ పీరియడ్ వర్తిస్తుంది. డేటా పంపాలన్నా, పొందాలన్నా ఇరువైపులా యాక్టివ్ సర్వీస్ వ్యాలిడిటీ ఉండటం తప్పనిసరి. అలాగే ప్రైమరీ యూజర్ మెయిన్ బ్యాలెన్స్‌లో కనీసం 600 MB డేటా మిగిలి ఉండాలి. నైట్ డేటా, డేటా రోలోవర్, ప్రమోషనల్ ఆఫర్ల డేటాను షేర్ చేయడానికి వీల్లేదు. అన్‌లిమిటెడ్ ప్యాక్‌ల నుంచి షేర్ చేసేటప్పుడు వీఐ కమర్షియల్ యూసేజ్ పాలసీ వర్తిస్తుంది.
Vi 'ప్రీపెయిడ్ ఫ్యామిలీ' వల్ల నిజంగా ఎవరికి లాభం?
ఈ ఫ్యామిలీ ఫీచర్‌తో యాప్‌లోనే రీఛార్జ్ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. సర్వీస్ వ్యాలిడిటీ ఉన్న అన్‌లిమిటెడ్ ప్యాక్‌లతో పాటు ₹99 కంటే ఎక్కువ విలువైన డేటా ప్యాక్‌లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. బిల్లింగ్ చెకౌట్ సమయంలోనే ఈ తగ్గింపు లభిస్తుంది. నెలకు ఒక మెంబర్‌కు గరిష్టంగా 2 GB వరకు డేటా పంపే అవకాశం ఉండటంతో, అత్యవసర సమయాల్లో ప్రత్యేకంగా డేటా బూస్టర్‌లు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది విద్యార్థులకు, ఎక్కువగా ఓటీటీలు చూసేవారికి, బడ్జెట్ యూజర్లకు తమ రోజువారీ ప్లాన్‌లను పొదుపుగా వాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
నిబంధనలు, అర్హతలు ఇవే..
ఫ్యామిలీ గ్రూప్ యాక్టివ్‌గా ఉండాలంటే కనీసం ఇద్దరు సభ్యులు ఉండాలి. కేవలం వీఐ ప్రీపెయిడ్ యూజర్లు మాత్రమే దీనికి అర్హులు. ఇతర నెట్‌వర్క్ యూజర్లు ఇందులో చేరాలంటే ముందుగా వీఐకి పోర్ట్ కావాల్సి ఉంటుంది. ప్రైమరీ మెంబర్ సంబంధిత వ్యక్తి ఓటీపీ సాయంతో ఫ్యామిలీ నుంచి తొలగించవచ్చు. ఒక నంబర్ ఒకే సమయంలో ఒక ఫ్యామిలీ గ్రూప్‌లో మాత్రమే ఉండేందుకు వీలుంటుంది. ఇద్దరి వద్ద యాక్టివ్ సర్వీస్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఉన్నప్పుడు మాత్రమే డేటా షేరింగ్ పనిచేస్తుంది.
జియో, ఎయిర్‌టెల్‌లో ఈ ఆప్షన్ లేదా?
పోటీ సంస్థలైన ఎయిర్‌టెల్, జియోలు కేవలం పోస్ట్‌పెయిడ్ విభాగంలో మాత్రమే ఫ్యామిలీ డేటా పూలింగ్‌ను అందిస్తున్నాయి. 'ఎయిర్‌టెల్ ఫ్యామిలీ', 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' ప్లాన్లలో డేటా షేరింగ్‌తో పాటు ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, ఒకే బిల్లు సదుపాయం ఉంటాయి. కానీ ప్రీపెయిడ్‌లో ఈ తరహా ఫ్యామిలీ షేరింగ్ ఆప్షన్ వాటిలో లేదు. అన్‌లిమిటెడ్ 5G, నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ కావలసిన వారు పోస్ట్‌పెయిడ్‌కే మొగ్గు చూపవచ్చు. అయితే పోస్ట్‌పెయిడ్‌కు మారకుండానే దేశవ్యాప్తంగా డేటా షేరింగ్, డిస్కౌంట్లు పొందాలనుకునే ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రం వీఐ తెచ్చిన ఈ కొత్త ఫీచర్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications
