రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చిన VI.. ఇలాంటి వారికి ఎంతో ఉపయోగపడతాయి..!
ప్రైవేటు టెలికాం సంస్థలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం జులై నుంచి జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలకు యూజర్లకు భారీగా షాక్‌లు ఇస్తున్నారు. భారీగా టారిఫ్ ధరలు పెంచారనే కారణంతో ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ట్రాయ్ ఇటీవల విడుదల చేసింది. అందువల్ల వినియోగదారులను కాపాడుకొనేందుకు ఆకర్షణీయ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
తాజాగా దేశంలో మూడు పెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉన్న వోడాఫోన్ ఐడియా (VI- Vodafone idea) సంస్థ తక్కువ ధరలో రెండు రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్‌లు రూ.150 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. రూ.128, రూ.138 రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ రెండు ప్లాన్లు సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

వోడాఫోన్ ఐడియా రూ.128 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో భాగంగా 100MB డేటాను పొందవచ్చు. మరియు 10 లోకల్ నెట్ నైట్ మినిట్స్‌ను పొందవచ్చు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఉచితంగా SMS అందించడం లేదు.
ఈ ప్లాన్‌లో (Vodafone idea RS128 Prepaid Recharge Plan) లోకల్ లేదా నేషనల్ కాల్స్‌ను చేసుకొనేందుకు ప్రతి సెకన్‌కు 2.5 పైసా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులుగా ఉంది. VI సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉండేందుకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
VI రూ.138 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో భాగంగా 100MB డేటాను పొందవచ్చు. మరియు 10 లోకల్ నెట్ నైట్ మినిట్స్‌ను పొందవచ్చు. 11 PM నుంచి 6AM మధ్యకాలంలో వినియోగించుకోవచ్చు. కాల్స్ చేసుకొనేందుకు సెకన్‌కు 2.5 పైసా చెల్లించాల్సి ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 20 రోజులుగా ఉంది.
ఈ రెండు ప్లాన్‌లను సిమ్ కార్డు యాక్టివ్‌గా ఉంచేందుకు ఉపయోగపడనున్నాయి. డ్యూయల్ సిమ్ కార్డులను వినియోగిస్తున్న వారికి ఈ వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్‌లు అనుకూలంగా ఉన్నాయి. ఇటీవల ఈ తరహా డ్యూయల్ సిమ్ కార్డులు కలిగిన వారికి అనుకూలంగా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది.
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డేటా ప్రయోజనాలు లేకుండా వాయిస్, SMS లతో ప్రత్యేక టారిఫ్ వోచర్‌లను (STV) తీసుకురావాలని స్పష్టం చేసింది. అందులో రూ.10 కనిష్ట ప్లాన్ కచ్చితంగా ఉండాలని సూచించింది.
టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తాజా నిర్ణయం ఫీచర్ ఫోన్‌లు సహా డేటా అవసరం లేని వారికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఇళ్లలో వైఫై సౌకర్యం ఉన్న వారికి అదనపు డేటా అవసరం ఉండదు. వీరికి కూడా STV లతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా డ్యూయల్ సిమ్ కార్డులు వినియోగిస్తున్న వారిలో రెండో సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








