మీ మొబైల్ రీఛార్జీ బ‌డ్జెట్ త‌క్కువా.. అయితే ఈ Vi ప్లాన్లు బెస్ట్ ఎంపిక‌!

|

దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ Vodafone Idea, ఎక్కువ బ‌డ్జెట్ వెచ్చించ‌లేని త‌మ కస్టమర్‌లను ఆదుకునేందుకు ఆక‌ర్ష‌ణీయ ప్లాన్ల‌ను అందిస్తోంది. ప్రీపెయిడ్ ధరల పెంపు కారణంగా, టెల్కోల నుంచి వినియోగదారులకు సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో లేవు. ఈ క్ర‌మంలో Vodafone Idea (Vi) తక్కువ-ఆదాయం క‌లిగిన‌ వినియోగదారులను ఎటువంటి ఆందోళ‌న లేకుండా తన వేగవంతమైన 4G నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడానికి బాధ్య‌తలు తీసుకుంది. అందులో భాగంగా ఈ రోజు మేము త‌క్కువ ఖర్చులో, మంచి వ్యాలిడిటీ లో అందుబాటులో ఉన్న మూడు Vi ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాను మీకు అందిస్తున్నాం. కాబ‌ట్టి ఆ ప్లాన్ల‌పై ఓ లుక్కేద్దాం.

 
మీ మొబైల్ రీఛార్జీ బ‌డ్జెట్ త‌క్కువా.. అయితే ఈ Vi ప్లాన్లు బెస్ట్ ఎంపి

Vodafone Idea నుంచి రూ.120 లోపు ఉన్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు:
Vodafone Idea రూ.120లోపు మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ మూడు ప్లాన్లు కూడా మీ డ‌బ్బును ఆదా చేస్తాయి. మీ ఖ‌ర్చును త‌గ్గిస్తాయి. కానీ, ఈ మూడు ప్లాన్లు అపరిమిత ప్రయోజనాలను చేకూర్చేవి కావు. కానీ, త‌క్కువ ఆదాయం ఉండి నెట్‌వ‌ర్క్‌ను కొన‌సాగింపు చేసుకునే వారికి అవి న్యాయమైన ప్లాన్లు అని చెప్పొచ్చు. సరే, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఆ మూడు ప్లాన్‌లు రూ. 99, రూ. 107 మరియు రూ. 111.

Vodafone Idea రూ.99 ప్లాన్‌:
* ఆదాయం త‌క్కువ ఉండి, అత్య‌ల్ప‌ ధ‌ర‌లో మొబైల్‌ రీఛార్జి చేసుకోవాల‌నుకున్న వినియోగ‌దారుల‌కు ఈ రూ.99 ప్లాన్ ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 200ఎంబీ డేటాను Vi ఆఫ‌ర్ చేస్తోంది. ఎస్ఎంఎస్‌ల‌ను కంపెనీ ఆఫ‌ర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రూ.99 టాక్‌టైం (66 నిమిషాల వ‌ర‌కు సెక‌నుకు 2.5 పైసా) పొంద‌వ‌చ్చు. ఈ ప్యాక్ 28 రోజుల వ‌ర‌కు వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగ‌దారుల‌కు ఎలాంటి ఎస్ఎంఎస్ ప్ర‌యోజ‌నాలు ఉండ‌వు.

మీ మొబైల్ రీఛార్జీ బ‌డ్జెట్ త‌క్కువా.. అయితే ఈ Vi ప్లాన్లు బెస్ట్ ఎంపి

Vodafone Idea రూ.107 ప్లాన్‌:
* ఈ రూ.107 ప్లాన్ ద్వారా Vi సేమ్ రూ.99 త‌ర‌హా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తోంది. కేవ‌లం, టాక్‌టైం, వ్యాలిడిటీలో తేడాలు ఉన్నాయి. ఇది కూడా ఆదాయం త‌క్కువ ఉండి, అత్య‌ల్ప‌ ధ‌ర‌లో మొబైల్‌ రీఛార్జి చేసుకోవాల‌నుకున్న వినియోగ‌దారుల‌కు ఈ రూ.99 ప్లాన్ ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 200ఎంబీ డేటాను వీఐ ఆఫ‌ర్ చేస్తోంది. ఎస్ఎంఎస్‌ల‌ను కంపెనీ ఆఫ‌ర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రూ.107 టాక్‌టైం (సెక‌నుకు 2.5 పైసా) పొంద‌వ‌చ్చు. ఈ ప్యాక్ 30 రోజుల వ‌ర‌కు వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది.

Vodafone Idea రూ.111 ప్లాన్‌:
* ఈ రూ.111 ప్లాన్ ద్వారా మొత్తం 200ఎంబీ డేటాను Vi ఆఫ‌ర్ చేస్తోంది. ఎస్ఎంఎస్‌ల‌ను కంపెనీ ఆఫ‌ర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రూ.111 టాక్‌టైం (సెక‌నుకు 2.5 పైసా) పొంద‌వ‌చ్చు. ఈ ప్యాక్ 31 రోజుల వ‌ర‌కు వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది.

మొబైల్ నెట్‌వర్క్‌లకు క‌నెక్ట‌య్యేలా కస్టమర్‌లను ఆక‌ర్షించ‌డం గొప్ప విషయమే అయినప్పటికీ, త‌క్కువ ఆదాయం క‌లిగిన వారిని నెట్‌వ‌ర్క్‌లో ఉండేలా చేయ‌డం క‌ష్ట‌మే. అలా వినియోగ‌దారుల‌ను త‌మ నెట్‌వ‌ర్క్‌లో కొన‌సాగింపు చేసుకోవాలంటే.. త‌క్కువ బ‌డ్జెట్ క‌లిగిన యూజ‌ర్ల‌కు కూడా త‌గిన ప్లాన్ల‌ను అందుబాటులో ఉంచ‌గ‌ల‌గాలి. అలా వారి బ‌డ్జెట్‌కు త‌గిన ప్లాన్ల‌ను అందుబాటులో ఉంచితే టెల్కోలు యూజ‌ర్ల‌ను త‌మ‌తోనే ఉంచుకోగ‌ల‌రు.

 
మీ మొబైల్ రీఛార్జీ బ‌డ్జెట్ త‌క్కువా.. అయితే ఈ Vi ప్లాన్లు బెస్ట్ ఎంపి

ఇవే కాకుండా, Vi రూ.500లోపు ప‌లు ప్లాన్ల రీచార్జీపై ఉచితంగా డిస్నీ హాట్‌స్టార్ (Disney+Hotstar) ను కూడా అందిస్తోంది. దాదాపు మూడు ప్రీపెయిడ్‌ ప్లాన్ల‌పై ఉచితంగా Disney+Hotstar స‌బ్‌స్క్రిప్ష‌న్ అందిస్తోంది. రూ.151, రూ.399, రూ.499 ఈ ధ‌ర క‌లిగి ఉన్నాయి. వీటిలో ప్రతి ప్లాన్ వివిధ రకాల ప్ర‌యోజ‌నాల‌ను కలిగి ఉన్నాయి. రూ. 151 ప్లాన్ మినహా, మిగ‌తా ప్లాన్‌కు Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP యాక్సెస్ క‌ల్పిస్తున్నారు. ఇక ఆ మూడు ప్లాన్ల‌ను గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

Vodafone Idia రూ.151 ప్లాన్‌:
Vi అందిస్తున్న‌ రూ.151 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌తో దాదాపు 8జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా యూజ‌ర్లు మూడు నెల‌ల పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు.

Vodafone Idia రూ.399 ప్లాన్‌:
Vi అందిస్తున్న‌ రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం పొందుతారు. అంతేకాకుండా డైలీ 2.5జీబీ డేటాతో పాటు, రోజుకు వంద ఎస్ఎంఎస్‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప్యాకేజీ ద్వారా యూజ‌ర్లు మూడు నెల‌ల పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు. అద‌నంగా Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP కి యాక్సెస్ పొంద‌వ‌చ్చు. మీరు ఈ ప్లాన్‌తో రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను ఉపయోగించవచ్చు.

Vodafone Idia రూ.499 ప్లాన్‌:
Vi అందిస్తున్న‌ రూ.499 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం పొందుతారు. అంతేకాకుండా డైలీ 2జీబీ డేటాతో పాటు, రోజుకు వంద ఎస్ఎంఎస్‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప్యాకేజీ ద్వారా యూజ‌ర్లు మూడు నెల‌ల పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు. అద‌నంగా Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP కి యాక్సెస్ పొంద‌వ‌చ్చు. మీరు ఈ ప్లాన్‌తో రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను ఉపయోగించవచ్చు.

Best Mobiles in India

English summary
Vodafone Idea Looking After Customers Without Big Budgets with These Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X