వోడాఫోన్ ఐడియా షాకింగ్ నిర్ణయం.. రీఛార్జ్ చేసే ముందు కచ్చితంగా తెలుసుకోండి..!!
ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థ జియో ఇటీవల రూ.11 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఏకంగా 10GB డేటాను అందిస్తోంది. ఎయిర్‌టెల్ కూడా ఇదే తరహా ప్లాన్‌ను ఇప్పటికే కలిగి ఉంది. ఈ రెండింటిలో ఇదే తక్కువ రీఛార్జ్ ప్లాన్‌గా ఉంది. వోడాఫోన్ ఐడియా (Vi) కనిష్ఠ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.23 గా ఉంది. అయితే ఈ ప్లాన్ ప్రయోజనాల విషయంలో Vi షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
వోడాఫోన్ ఐడియా (Vodafone idea) రూ.23 డేటా రీఛార్జ్ ప్లాన్ ద్వారా గతంలో 1.2 డేటాను అందించేది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒకరోజు ఉండేది. తాజాగా ఈ ప్లాన్‌లో భాగంగా అందించే డేటాను 1GB కి తగ్గించింది. అంటే వినియోగదారులు 200MB డేటాను కోల్పోతున్నారు. అయితే వ్యాలిడిటీలో ఎటువంటి మార్పులు చేయలేదు.

ప్రస్తుతం Vi రూ.23 ప్లాన్ ద్వారా 1GB డేటాను పొందవచ్చు. ఒకరోజు వ్యాలిడిటిని అందిస్తోంది. ప్రస్తుతం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే Vi రూ.26 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక రోజుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో ఇంకా ఎటువంటి ప్రయోజనాలను అందించడం లేదు.
దీంతోపాటు Vi అనేక రీఛార్జ్ ప్లాన్‌లు అందిస్తోంది. రూ.33 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 2GB డేటాను అందిస్తోంది. రెండు రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తోంది. మరియు రూ.48 రీఛార్జ్ ప్లాన్‌తో రూ.6GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 3 రోజులుగా ఉంది.
దీంతోపాటు రూ.49 డేటా రీఛార్జ్ ప్లాన్‌తో 20GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒకరోజుగా ఉంటుంది. రాత్రి 11.59 PM గంటలకు ఈ ప్లాన్ గడువు ముగుస్తుంది. రూ.89 డేటా రీఛార్జ్ ప్లాన్‌తో 6GB డేటాను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంది.
వోడాఫోన్ ఐడియా రూ.139 డేటా రీఛార్జ్ ప్లాన్‌తో 12GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. మరియు రూ.145 రీఛార్జ్ ప్లాన్‌తో 28 రోజులపాటు రోజువారీ 1GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రూ.208 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
ఇటీవలే మరో ప్రముఖ టెలికాం సంస్థ జియో రూ.11 డేటా రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా 10GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ గంటపాటు ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లు ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ సంస్థ కూడా రూ.11 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 10GB డేటాను అందిస్తోంది. ప్లాన్ వ్యాలిడిటీ ఒక గంటపాటు ఉంటుంది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL రూ.16 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా ఒకరోజు వ్యాలిడిటీతో 2GB డేటాను అందిస్తోంది.


Click it and Unblock the Notifications