జియోకి ఝలక్, ఫారిన్ నుంచి వొడాఫోన్ ఐడియాకు వేల కోట్ల పెట్టుబడులు

దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద మెర్జ్ తో ఒకటయిన వొడాఫోన్ ఐడియా ఇప్పుడు భారీ వ్యూహాలతో ముందుకెళుతున్నట్లుగా తెలుస్తోంది. దేశీ టెలికాం మార్కెట్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న జియోకి ఝలక్ ఇస్తూ ఫార

|

దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద మెర్జ్ తో ఒకటయిన వొడాఫోన్ ఐడియా ఇప్పుడు భారీ వ్యూహాలతో ముందుకెళుతున్నట్లుగా తెలుస్తోంది. దేశీ టెలికాం మార్కెట్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న జియోకి ఝలక్ ఇస్తూ ఫారిన్ నుంచి వేల కోట్ల రూపాయలను ఫండ్స్ రూపంలో సమకూర్చుకోనున్నాయి. ఈ మేరకు వొడాఫోన్‌ ఐడియా రైట్స్‌ ఇష్యూ ఈ నెల 10న ప్రారంభమవుతోంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.25,000 కోట్లు సమీకరించబోతోంది. ఇందులో ఆదిత్య బిర్లా గ్రూపు రూ.7,250 కోట్లు, వొడాఫోన్‌ గ్రూపు రూ.18,000 కోట్లు సమకూరుస్తాయి.

జియోకి ఝలక్, ఫారిన్ నుంచి వొడాఫోన్ ఐడియాకు వేల కోట్ల పెట్టుబడులు

వొడాఫోన్‌ గ్రూపు సమకూర్చే మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) రూపంలో ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం: రూ.5,000 కోట్లు మించిన ఏ ఎఫ్‌డీఐకైనా కేంద్ర కేబినెట్‌ ఆమో దం తప్పనిసరి.కాగా కేబినెట్‌ ఫిబ్రవరి 28న కంపెనీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

రూ.18 వేల కోట్ల పెట్టుబడులు

రూ.18 వేల కోట్ల పెట్టుబడులు

వొడాఫోన్‌ -ఐడియా రైట్స్‌ ఇష్యూలో భాగంగా విదేశీ ఇన్వెస్టర్లు రూ.18 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా వొడాఫోన్‌ గ్రూపే స్వయంగా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టబోతోందని సమాచారం. భవిష్యత్ అవసరాల కోసం, వ్యాపార విస్తరణ కోసం వొడాఫోన్‌ ఐడియా రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు రైట్స్‌ ఇష్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కేంద్ర క్యాబినెట్ ఆమోదం

కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ఇదిలా ఉంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతి ఇవ్వాలంటూ వొడాఫోన్‌ ఐడియా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.18 వేల కోట్ల నిధులు విదేశీ మదుపర్ల నుంచి వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి వెల్లడించారు.

వొడాఫోన్‌ ఐడియా

వొడాఫోన్‌ ఐడియా

వొడాఫోన్‌ ఐడియా ప్రమోటర్లైన వొడాఫోన్‌ గ్రూపు రూ.11వేల కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూపు రూ.7,250 కోట్లు (మొత్తం రూ.18,250 కోట్లు) రైట్స్‌ ఇష్యూలో పెట్టుబడి పెట్టనున్నాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌ను రూ.12.50 చొప్పున (మార్కెట్‌ ధరతో పోలిస్తే 61 శాతం తక్కువ ధర) రైట్స్‌ ఇష్యూ ద్వారా జారీ చేయాలని డైరెక్టర్ల బోర్డు మార్చి 20న నిర్ణయించింది.

భారీ డిస్కౌంట్‌

భారీ డిస్కౌంట్‌

వొడొఫోన్‌ ఐడియా భారీ డిస్కౌంట్‌తో ఈ రైట్స్‌ ఇష్యూ జారీ చేస్తోంది. ఒక్కో షేరును రూ.12.5కు జారీ చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోద ముద్ర వేసింది. శుక్రవారం బీఎస్ఈలో వొడాఫోన్‌ ఐడియా షేర్ల ముగింపు ధరతో పోలిస్తే ఇది 61 శాతం తక్కువ.

38 షేర్లకు 87 షేర్ల చొప్పు

38 షేర్లకు 87 షేర్ల చొప్పు

ఈ నెల 20నాటికి కంపెనీ రికార్డుల్లో పేర్లు ఉన్న వాటాదార్లందరికీ రైట్స్‌ ఇష్యూ షేర్లు జారీ చేస్తారు. ప్రతి 38 షేర్లకు 87 షేర్ల చొప్పున కేటాయిస్తారు. ఈ ఇష్యూ ద్వారా సమకూరే నిధులతో వొడాఫోన్‌ ఐడియా పోటీని ఎదుర్కోగలదని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, రైట్స్‌ ఇష్యూ ద్వారా వొడాఫోన్‌ ఐడియా మూలధనం పెంచుకోవడంతో కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ మెరుగుపడటంతోపాటు నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని, కవరేజీని పెంచుకునే అవకాశం ఉందని సిటీ రీసెర్చ్‌ సంస్థ అంచనా వేస్తోంది.

 

Best Mobiles in India

English summary
Vodafone Idea may get Rs 18,000 crore foreign funding during rights issue

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X