అయోమయంలో 5 వేల మంది ఉద్యోగులు

Written By:

దేశీయ టెలికాం రంగంలో జియో వచ్చిన తరువాత అనేక రకాలైన విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దిగ్గజాలు నష్టాలను పూడ్చుకోవడానికి మెర్జ్ దిశగా అడుగులు వేసాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు మెర్జ్ దిశగా అడుగులు వేయగా తాజాగా వాటి సరసన వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్లు కూడా చేరబోతున్నాయి. దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థ ఏర్పాటు దిశగా ఈ రెండు కంపెనీలు విలీనం కాబోతున్నాయి. అయితే ఈ మెగా మెర్జర్‌ ఇరు సంస్థలకుచెందిన ఉద్యోగులపై వేటుకు దారి తీయనుంది. వొడాఫోన్-ఐడియా విలీనం ద్వారా ఏర్పడనున్న ఉమ్మడి సంస్థలో భారీ తొలగింపులు చోటు చేసుకోనున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు, సామర్థ్యాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా రాబోయే నెలల్లో ఈ భారీ తొలగింపులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. ఇరు సంస్థల్లో కలిపి 21వేల మందికి పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 5వేలమందిపై వేటుపడే అవకాశాలున్నాయని ఈటీ రిపోర్ట్‌ చేసింది.

అయోమయంలో 5 వేల మంది ఉద్యోగులు

ఉమ్మడి సంస్థ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించే సందర్భంలో రుణాలు మార్జిన్ ఒత్తిళ్లతో అనవసర ఉద్యోగులను భరించాల్సిన అవసరం లేదని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించడం ఈ అంచనాలకు ఊతమిచ్చింది. ముకేష్ అంబానీ యాజమాన్యం రిలయన్స్ జియో ప్రవేశం టెలికాం రంగాన్ని భారీగా ప్రభావితం చేసిన నేపథ్యంలో​ వొడాఫోన్‌, ఐడియా కంపనీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే ఐడియా, వొడాఫోన్‌ విలీనానికి ముందుకు వచ్చాయి. జియో ఎఫ్టెక్ట్‌తో కుదేలైన టెలికాం రంగం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను తగ్గించుకుంది. తాజాగా మరో 5వేలమందికి ఉద్యోగులకు ఉద్వాసన తప‍్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.

కూల్‌ప్యాడ్ నుంచి అత్యంత తక్కువ ధరకే రెండు 4జీస్మార్ట్‌ఫోన్లు

ఈ విలీన ప్రక్రియకు ఎఫ్‌డీఐ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ మెర్జర్‌కు ముందే ఇరు సంస‍్థలు (వోడాఫోన్‌, ఐడియా) తమ బకాయిలు క్లియర్ చేయవలసిందిగా టెలికాం శాఖ కోరినట్టు తెలుస్తోంది. అలాగే టెలికాం రంగంలో ఎఫ్‌డీల అనుమతిపై హోం మంత్రిత్వ శాఖ నుండి ఆమోదంకోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి)కు రెండు వారాల క్రితం పంపించామని , స్పందనకోసం వేచి ఉన్నామని టెలికాం విభాగం అధికారి తెలిపారు. కంపెనీలోఎఫ్‌డీఐఐ పరిమితిని 100 శాతం పెంచాలని ఐడియా కోరిన సంగతి తెలిసిందే.

English summary
Vodafone, Idea may let go of over 5000 employees More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot