Home
News

వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండి

వోడాఫోన్ ఐడియా సంస్థలు ఇప్పుడు కొత్త ప్లాన్ ల యొక్క ధరలను ప్రకటించారు. పెరిగిన ఈ కొత్త ప్రీపెయిడ్ ధరలు డిసెంబర్ 3 నుంచి అమలలోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఈ టెలికాం ఆపరేటర్ భారీ నష్టాలను ఎదుర్కొన్నది . ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద సుమారు రూ.50,922 కోట్లు నష్టం కలిగినట్లు తెలిపింది.

వోడాఫోన్ ఐడియా లిమిటెడ్

వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (VIL) పెరిగిన ప్రీపెయిడ్ సుంకాల ధరలు పెంచడం ద్వారా వినియోగదారుని సగటు ఆదాయం (ARPU) తగ్గడానికి ఇది సహాయపడుతుందని ఆశిస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్ వ్యయాన్ని పెంచే ఏకైక టెల్కో వోడాఫోన్ ఐడియానే కాదు. ఎయిర్‌టెల్ కూడా కొత్త దరలను ప్రకటించింది. దీని కొత్త ధరలు డిసెంబర్ 3 నుంచి అమలులో ఉంటాయి. రిలయన్స్ జియో కూడా డిసెంబర్ 6 నుండి తన పెరిగిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క ధరలను ప్రకటించనున్నది.

 

 టెలికం ఆపరేటర్

కస్టమర్లకు సరళమైన, సౌకర్యవంతమైన మరియు సరసమైన ఉత్పత్తులను అందించే నిబద్ధతకు అనుగుణంగా VIL వాయిస్ మరియు డేటా రెండింటి ఫీచర్లను కలిగి వున్న ప్లాన్‌లను అందిస్తోంది అని టెలికం ఆపరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు వారి నిర్దిష్ట అవసరాలకు తగిన ప్రణాళికను ఎంచుకోవడం ద్వారా దానికి తగ్గ ప్రయోజనాలను పొందవచ్చు. వీటి ద్వారా భారతదేశం అంతటా కనెక్టివిటీని ఆస్వాదించడం కొనసాగించవచ్చు అని వోడాఫోన్ ఐడియా కంపెనీ తెలిపింది.

వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ టారీఫ్స్

వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ టారీఫ్స్

మొదటగా భారతీయ వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందిన అపరిమిత ప్యాక్‌లతో ప్రారంభిద్దాం. వోడాఫోన్ ఐడియా ఇప్పుడు నాలుగు రకాల ప్రీపెయిడ్ అన్‌లిమిటెడ్ ప్యాక్‌లను నెలవారీ వాలిడితో అందించనుంది. ఈ ప్యాక్‌లలో రూ.149, రూ.249, రూ. 299, మరియు రూ.399 ప్లాన్స్ ఉన్నాయి. ఇవి డేటా అలవెన్స్ మరియు ఎస్ఎంఎస్ కోటా మినహా అన్ని ప్యాక్లలో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.

 

వొడాఫోన్ ఐడియా 28 రోజుల చెల్లుబాటుతో కొత్త అపరిమిత ప్యాక్‌లు మరియు ప్యాక్‌ ప్రయోజనాలు

వొడాఫోన్ ఐడియా 28 రోజుల చెల్లుబాటుతో కొత్త అపరిమిత ప్యాక్‌లు మరియు ప్యాక్‌ ప్రయోజనాలు

రూ. 149 ---- అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 1000 నిమిషాల FUP), మొత్తం నెలకు 2GB డేటా, 300 SMS

రూ. 249---- అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 1000 నిమిషాల FUP), రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMS

రూ. 299---- అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 1000 నిమిషాల FUP), రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS

రూ. 399 ---- అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 1000 నిమిషాల FUP), రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMS

 

 

 

వొడాఫోన్ ఐడియా 84 రోజుల చెల్లుబాటుతో కొత్త అపరిమిత ప్యాక్‌లు

వొడాఫోన్ ఐడియా 84 రోజుల చెల్లుబాటుతో కొత్త అపరిమిత ప్యాక్‌లు

రూ. 379 --- అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 3000 నిమిషాల FUP), మొత్తం చెల్లుబాటు కాలానికి 6GB డేటా, మరియు 1000 SMS

రూ. 599 ---- అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 3000 నిమిషాల FUP), రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMS

రూ. 699 ---- అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 3000 నిమిషాల FUP), రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS

 

ఒక సంవత్సరం కాలం చెల్లుబాటుతో  కొత్త అపరిమిత ప్యాక్‌లు

ఒక సంవత్సరం కాలం చెల్లుబాటుతో కొత్త అపరిమిత ప్యాక్‌లు

రూ. 1499 --- అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 12000 నిమిషాల FUP), మొత్తం చెల్లుబాటు కాలానికి 24GB డేటా, మరియు 3600 SMS

రూ. 2399 ---- అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 12000 నిమిషాల FUP), రోజుకు 1.5 GB డేటా, రోజుకు 100 SMS

 

 

 

పరిమిత ప్యాక్‌

ఈ టెలికాం ఆపరేటర్ అపరిమిత ప్యాక్‌లతో పాటు రెండు రోజుల వాలిడిటీతో రీఛార్జ్ ఎంపికగా అపరిమిత సాచెట్‌ను అందించబోతున్నారు. దీని ధర 19 రూపాయలు. ఇది అపరిమిత వొడాఫోన్ ఐడియా టు వొడాఫోన్ ఐడియా కాల్స్, 150 ఎమ్‌బి డేటా మరియు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సాచెట్ కేవలం 2 రోజుల చెల్లుబాటుతో మాత్రమే వస్తుంది.

కాంబో రీఛార్జిలు

అపరిమిత ప్యాక్‌లను కోరుకోనివారికి కాంబో రీఛార్జిలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కాంబో వోచర్‌లలో రూ. 49 మరియు రూ. 79 ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటాయి. ప్రయోజనాల పరంగా రూ. 49 వోడాఫోన్ ఐడియా వోచర్ రూ. 38 టాక్‌టైమ్, 100 ఎమ్‌బి డేటాను కలిగి ఉండి సెకనుకు 2.5 పైసలు టారిఫ్ ఛార్జీలను వసూలు చేస్తుంది. రూ.79 వోడాఫోన్ ఐడియా వోచర్ రూ. 64 టాక్‌టైమ్, 200 ఎమ్‌బి డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ సెకనుకు 1 పైస చొప్పున కాల్ చార్జీలను వసూలు చేస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea New Prepaid Plans Price, Offers, Start Date, Validity, Benefits Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X