Home
News

Vodafone Idea నుంచి 150GB డేటా బోన‌స్ ఆఫ‌ర్‌! ఆ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే!

భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన Vodafone Idea, త‌మ వినియోగ‌దారుల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ప్లాన్ల‌ను విడుద‌ల చేస్తుంది. తాజాగా, ఆ కంపెనీ త‌మ పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు మ‌రో అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. కొత్త‌గా పోస్ట్‌పెయిడ్ సిమ్‌ను కొనుగోలు చేసిన‌ వినియోగదారులకు రూ.399 ప్లాన్ ద్వారా 150GB బోనస్ డేటాను అందిస్తోంది. అయితే, కొత్త వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ప్లాన్ రీఛార్జీ చేసుకున్న‌ప్పుడు మాత్రమే బోనస్ డేటా అందించబడుతుందని పేర్కొంది.

Vodafone Idea

రూ.399 ప్లాన్ టెల్కో నుండి ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్. కొత్త SIM కొనుగోలుపై బోనస్ డేటాను అందించే ఏకైక ప్లాన్ ఇదే. ఒక‌వేళ మీరు గ‌నుక Vodafone Idea నుండి రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తీసుకున్న‌ట్ల‌యితే మీరు పొందే మొత్తం ప్రయోజనాలను వివ‌రంగా ఇక్క‌డ అందిస్తున్నాం. పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌డానికి ఆర్టిక‌ల్ పూర్తిగా చ‌ద‌వండి.

Vodafone Idea Rs 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ బోనస్ డేటా పూర్తి వివరాలు:

Vodafone Idea Rs 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ బోనస్ డేటా పూర్తి వివరాలు:

ఇది వీఐ నుండి అందుబాటులో ఉన్న ఎంట్రీ-లెవల్ ప్లాన్. రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను, వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే 40GB డేటాతో పాటు 150GB బోనస్ డేటాను పొందుతారు. రెండింటితో క‌లిపి నెలలో మొత్తం డేటా 190GB పొంద‌గ‌లుగుతారు. దీనితో పాటు, వినియోగదారులు 200GB డేటా రోల్‌ఓవర్ ఫీచ‌ర్‌, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/నెలకు కూడా పొందుతారు.

అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు:

అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు:

ఇవే కాకుండా ఈ ప్లాన్‌తో ప‌లు అదనపు ప్రయోజనాలు కూడా అందించబడతాయి. Vi Movies & TV VIP సబ్‌స్క్రిప్షన్‌కు వినియోగదారులు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. దీనితో పాటు, Vi యాప్‌లో ఆరు నెలల పాటు యాడ్-ఫ్రీ హంగామా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. మీరు OTT (ఓవర్-ది-టాప్) కంటెంట్ వినియోగాన్ని ఇష్టపడే వారైతే, ఈ ప్లాన్‌తో మీకు ZEE5 ప్రీమియం కూడా ఉచితంగా లభిస్తుంది. పైన పేర్కొన్న నెలవారీ ధర రూ.399తో పాటు ట్యాక్స్ కూడా అద‌నంగా ఉంటుంద‌నే విష‌యాన్ని వినియోగ‌దారులు గ‌మ‌నించాలి.

93% మంది వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఇష్టపడుతున్నారని Vi తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కంపెనీ అందించే ఇతర పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. కొన్ని హై-ఎండ్ ప్లాన్‌లు నిజంగా అపరిమిత డేటాతో కూడా వస్తాయి. మీరు దీని కంటే ఎక్కువ ఖర్చు చేయగలిగితే, కంపెనీ అందించే REDX ప్లాన్‌ల ను కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇంకా ఎక్స్‌ప్లోర్ చేస్తే.. మీరు Vi నుండి కుటుంబ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా పొందవచ్చు.

అదేవిధంగా, రూ.300 లోపు Vodafone Idea అందిస్తున్న‌ బెస్ట్ ప్రీపెయిడ్‌ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం:

అదేవిధంగా, రూ.300 లోపు Vodafone Idea అందిస్తున్న‌ బెస్ట్ ప్రీపెయిడ్‌ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం:

Vodafone Idea కంపెనీ రూ.300 లోపు రెండు Prepaid Plans అందిస్తోంది. వాటిలో రూ.299 ప్లాన్ ఒక‌టి కాగా.. మ‌రొక‌టి రూ.249 మ‌రొక‌టి.
* రూ.299 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను కంపెనీ ఆఫ‌ర్ చేస్తోంది. అంతేకాకుండా రోజుకు 1.5జీబీ వ‌ర‌కు డేటాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఈ ప్యాక్ 28 రోజుల వ‌ర‌కు వ్యాలిడిటీ క‌లిగ‌గి ఉంటుంది. అదనంగా, కస్టమర్‌లకు 12:00 AM నుండి 6:00 AM వరకు అపరిమిత ఉచిత బ్యాండ్‌విడ్త్ ఇవ్వబడుతుంది.

* ఇక రూ.249 ప్లాన్ విష‌యానికొస్తే.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను కంపెనీ ఆఫ‌ర్ చేస్తోంది. అంతేకాకుండా రోజుకు 1.5జీబీ వ‌ర‌కు డేటాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఈ ప్యాక్ 21 రోజుల వ‌ర‌కు వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది. దీని ద్వారా ఉచితంగా జియో యాప్స్‌కు యాక్సెస్ పొంద‌వ‌చ్చు.

Best Mobiles in India

English summary
Vodafone Idea Offering 150GB Bonus Data with OTT Benefits for Rs 399
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X