Vodafone Idia: ఆ ప్లాన్‌తో రోజుకు 4GB డేటా ఎంజాయ్ చేయొచ్చు!
భారత్‌లో మూడో అతి పెద్ద టెల్కో అయిన Vodafone Idea (Vi) తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్లను విడుదల చేస్తుంది. అయితే, వొడాఫోన్ ఐడియా వినియోగించే యూజర్లు తమ టెల్కో నుంచి అధిక మొత్తంలో డేటాను వినియోగించాలనుకుంటే ఓ అద్భుతమైన ప్లాన్‌ను వీఐ అందుబాటులో ఉంచింది. అది కూడా రూ.500 లోపు ధరలోనే వొడాఫోన్ ఐడియా ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి ఉంచింది.

కాకపోతే, కంపెనీ ఈ ప్లాన్‌పై చాలా తక్కువ వ్యాలిడిటీని అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ డేటా మరియు పలు అదనపు ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మేము మాట్లాడుతున్న ప్రీపెయిడ్ ప్లాన్ ఏదంటే.. రూ.475 ప్లాన్. ఇది వీఐ యొక్క జాబితాలో కొత్తగా చేరిన ప్లాన్ అయితే కాదు. ఇది ఇదువరకే వీఐ ప్లాన్ల జాబితాలో కొనసాగుతోంది. ఇప్పటికే మీరు దీన్ని ఉపయోగిస్తూ ఉండవచ్చు కూడా. అయితే, ఈ ప్లాన్ గురించి, దీని ప్రయోజనాల గురించి తెలియని వారి కొసం మేం ఇప్పుడు దీన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. మీరు కూడా అధిక డేటా ప్రయోజనాల కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్‌పై ఓ లుక్కేయండి.

వోడాఫోన్ ఐడియా రూ.475 ప్రీపెయిడ్ ప్లాన్:
Vodafone Idea దాని రూ.475 ప్రీపెయిడ్ ప్లాన్‌ని మొత్తం 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. ఈ ఖరీదైన ప్లాన్‌తో మీకు 28 రోజుల సర్వీస్ మాత్రమే లభిస్తుంది. అయితే, మీరు Airtel లేదా Jio నుండి ఏ ఇతర ప్లాన్ ఇవ్వలేని డేటా ప్రయోజనాలను మీరు ఈ ప్లాన్ ద్వారా పొందుతారు. Vodafone Idea నుండి 475 రూపాయలతో, వినియోగదారులు 4GB రోజువారీ డేటాను పొందుతారు. ఈ విధంగా, ఈ ప్లాన్‌తో మొత్తం 112GB డేటా ను వినియోగదారులు 28 రోజుల పాటు ఎంజాయ్ చేయవచ్చు.
దీనితో పాటు, వినియోగదారులు ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు పొందుతారు. Vi Hero అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు, Vi Hero అన్‌లిమిటెడ్ ప్రయోజనాలలో వీకెండ్ డేటా రోల్‌ఓవర్, బింగే ఆల్ నైట్ మరియు డేటా డిలైట్స్ వంటి ఆఫర్‌లు ఉన్నాయి. Vi ఈ ప్లాన్‌తో వినియోగదారులకు Vi Movies & TV VIP యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. 4GB రోజువారీ డేటా వినియోగం తర్వాత, వినియోగదారుల ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడానికి, మీరు Vi యాప్‌కి వెళ్లి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా సైన్ ఇన్ చేసి రీచార్జ్ చేసుకోవచ్చు. లేదా టెల్కో వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా మీరు దీనికి యాక్సెస్ పొందవచ్చు.

అదేవిధంగా, వొడాఫోన్ ఐడియా టెల్కో నుంచి రూ.500 లోపు డిస్నీ+హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందించే ప్లాన్ల గురించి కూడా తెలుసుకుందాం:
వొడాఫోన్ ఐడియా రూ.151 ప్లాన్:
Vi అందిస్తున్న రూ.151 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌తో దాదాపు 8జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా యూజర్లు మూడు నెలల పాటు డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు.

Vodafone Idia రూ.399 ప్లాన్:
Vi అందిస్తున్న రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం పొందుతారు. అంతేకాకుండా డైలీ 2.5జీబీ డేటాతో పాటు, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లను కూడా పొందవచ్చు. ఈ ప్యాకేజీ ద్వారా యూజర్లు మూడు నెలల పాటు డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. అదనంగా Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP కి యాక్సెస్ పొందవచ్చు. మీరు ఈ ప్లాన్‌తో రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను ఉపయోగించవచ్చు.

Vodafone Idia రూ.499 ప్లాన్:
Vi అందిస్తున్న రూ.499 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం పొందుతారు. అంతేకాకుండా డైలీ 2జీబీ డేటాతో పాటు, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లను కూడా పొందవచ్చు. ఈ ప్యాకేజీ ద్వారా యూజర్లు మూడు నెలల పాటు డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. అదనంగా Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP కి యాక్సెస్ పొందవచ్చు. మీరు ఈ ప్లాన్‌తో రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను ఉపయోగించవచ్చు.


Click it and Unblock the Notifications