ప్రతినెలా రీఛార్జ్ చేసేందుకు విసుగెత్తిపోతున్నారా.. సంవత్సరం వ్యాలిడిటీ కలిగిన VI రీఛార్జ్ ప్లాన్‌లు ఇవిగో..!
భారత టెలికాం రంగంలో వోడాఫోన్ ఐడియా (Vi) మూడో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. ఈ సంవత్సరం జులై నెలలో VI సంస్థ మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచింది. దీంతోపాటు జియో, ఎయిర్‌టెల్ తరహాలోనే అధిక సంఖ్యలో యూజర్‌లను కోల్పోతోంది. అయితే కొత్త ప్లాన్స్ సహా ఆఫర్ ద్వారా యూజర్‌లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా సంస్థ సంవత్సరం వ్యాలిడిటీతో వివిధ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ప్రతి నెల లేదా రెండు మూడు నెలలకు ఒకసారి రీఛార్జ్ చేయడం ఇష్టం లేని యూజర్లు ఈ రీఛార్జ్ ప్లాన్‌లు అనుకూలంగా ఉంటాయి.
వోడాఫోన్ ఐడియా 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల (VI One year Validity Prepaid Recharge Plans) ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా డేటా ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు వోడాఫోన్ ఐడియా ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లకు గట్టిపోటీనిచ్చే విధంగా ఈ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం రూ.3499, రూ.3599, రూ.3699 ప్లాన్‌లు ఉన్నాయి.

రూ.3,499 రీఛార్జ్ ప్లాన్ : వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (VI RS3499 Prepaid Recharge Plan) ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, సహా ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు.
డేటా పరంగా రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రాత్రి 12 AM నుంచి 6AM వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. దీంతోపాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వినియోగించుకోవచ్చు. ఇలా నెలకు 2GB వరకు డేటాను పొందవచ్చు.
రూ.3599 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో (VI RS3599 Prepaid Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు డేటాపరంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. VI యాప్‌లను వినియోగించుకోవచ్చు.
అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 730GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు రాత్రి 12 AM నుంచి 6AM వరకు అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. మరియు సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వినియోగించుకోవచ్చు. అయితే నెలకు 2GB మాత్రమే వరకు వినియోగించుకొనేందుకు వీలుంది.
రూ.3699 రీఛార్జ్ ప్లాన్ : ఈ VI ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని (VI RS3699 Prepaid Recharge Plan) అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా సంవత్సరం వ్యాలిడిటీతో డిస్ని + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్ర్కిప్షన్‌ను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు.
ఈ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీలో మొత్తంగా 730GB డేటాను పొందవచ్చు. మరియు రాత్రి 12 AM నుంచి 6AM వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వినియోగించుకోవచ్చు. ఇలా నెలకు 2GB వరకు డేటాను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








