మీరు ఎక్కువగా డేటా ఉపయోగిస్తారా.. అయితే రూ.100 కంటే తక్కువ ధరలో బెస్ట్ డేటా ప్లాన్‌లు..!
Vodafone Idea (Vi) Data packs : భారత్ టెలికాం రంగంలో వోడాఫోన్ ఐడియా యూజర్ల పరంగా మూడో అతిపెద్ద నెట్‌వర్క్ గా ఉంది. ప్రస్తుతం కాలింగ్, డేటా, OTT ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అయితే అత్యవసరంగా డేటా అవసరం లేదా ఎక్కువగా డేటా వినియోగించేవారి కోసం ప్రత్యేకంగా డేటా ప్యాక్స్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం రూ.100 ధర రేంజ్ లోనూ అనేక డేటా ప్యాక్స్ ను కలిగి ఉంది.
రూ.23 ప్లాన్ :
ఈ ప్లాన్ లో ( Vodafone Idea Rs23 Data Pack ) 1GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే. అయితే డేటా మినహా ఎటువంటి కాలింగ్, SMS, ఓటీటీ ప్రయోజనాలను అందించడం లేదు.

రూ.26 ప్లాన్ :
ఈ ప్లాన్ లో ( Vodafone Idea Rs26 Data Pack ) భాగంగా వోడాఫోన్ ఐడియా యూజర్ 1.5GB డేటాను పొందుతారు. ఈ డేటాను వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే. అంటే అర్ధరాత్రి 12 గంటలకు ప్లాన్ గడువు ముగుస్తుంది.
రూ.48 ప్లాన్ :
ఈ ప్లాన్ లో ( Vodafone Idea Rs48 Data Pack ) భాగంగా మొత్తంగా 6GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 3 రోజులుగా ఉంది. డేటా మినహా ఈ ప్లాన్ లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు.
రూ.33 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో ( Vodafone Idea Rs33 Data Pack ) భాగంగా యూజర్లు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 2 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో డేటా మినహా ఎటువంటి ప్రయోజనాలను అందించడం లేదు.

రూ.49 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో ( Vodafone Idea Rs49 Data Pack ) భాగంగా 20GB డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే వ్యాలిడిటీ కేవలం ఒక్కరోజు మాత్రమే. ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు.
రూ.69 ప్లాన్ :
ఈ ప్లాన్ లో ( Vodafone Idea Rs69 Data Pack ) భాగంగా యూజర్లు 3GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. అయితే ఇంకా ఎటువంటి కాలింగ్, SMS, OTT ప్రయోజనాలను పొందలేరు.
రూ.89 రీఛార్జ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా యూజర్లు ఈ ప్లాన్ లో ( Vodafone Idea Rs89 Data Pack ) భాగంగా 6GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంటుంది. ఇంకా ఎటువంటి అదనపు ప్రయోజనాలను పొందలేరు.
రూ.100 రీఛార్జ్ ప్లాన్ :
ఈ డేటా ప్యాక్‌లో ( Vodafone Idea Rs100 Data Pack ) 5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీని వ్యాలడిటీ 30 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications








