కేవలం కాలింగ్ కోసమే రీఛార్జ్ ప్లాన్‌లు కావాలా.. అయితే ఇదిగో పూర్తి లిస్ట్!
వోడాఫోన్ ఐడియా (Vodafone idea) సంస్థ యూజర్ల పరంగా భారత టెలికాం రంగంలో మూడో స్థానంలో ఉంది. టెలికాం రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నెట్‌వర్క్ ప్రొవైడర్లు కాలింగ్ కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. కేవలం కాలింగ్ కోసం మాత్రమే ఫోన్ ఉపయోగిస్తున్న వారికి మరియు రెండు సిమ్ కార్డులు ఉపయోగిస్తున్న వారికి ఈ ప్లాన్‌లు అనుకూలంగా ఉంటాయి.
ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా (Vi) కేవలం కాలింగ్ కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇందులో రూ.155, రూ.189, రూ.199, రూ.209, రూ.218, రూ.239, రూ.289 వంటి రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కావాల్సిన వారు ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.

రూ.155 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vi Rs155 Recharge Plan) భాగంగా వోడాఫోన్ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు మొత్తంగా 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 20 రోజులుగా ఉంటుంది.
రూ.189 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vi Rs189 Recharge Plan) భాగంగా Vi యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు మొత్తంగా 300SMS లను ఉపయోగించుకోవచ్చు. మరియు డేటా పరంగా మొత్తంగా 1GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 26 రోజులుగా ఉంటుంది.
రూ.199 రీఛార్జ్ ప్లాన్ :
Vi యూజర్లు ఈ ప్లాన్‌లో (Vi Rs199 Recharge Plan) అన్‌లిమిటెడ్ కాల్స్ పొందుతారు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.
రూ.209 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vi Rs209 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు డేటా పరంగా 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 300 SMS లను పొందవచ్చు. దీంతోపాటు కాలర్ ట్యూన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.
రూ.218 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vi Rs218 Recharge Plan) భాగంగా వోడాఫోన్ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 3GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంటుంది.
రూ.239 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vi Rs239 Recharge Plan) భాగంగా Vi యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు మొత్తంగా 300 SMS లను అందిస్తోంది. డేటా పరంగా 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.
రూ.289 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vi Rs289 Recharge Plan) భాగంగా వోడాఫోన్ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. మొత్తంగా 600 SMS లను పొందవచ్చు. డేటాపరంగా 4GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 40 రోజులుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








