రైల్వే గ్రూప్ D6 రాస్తున్నవారికి ఉచితంగా మెటీరియల్‌లను అందిస్తున్న Vi..

|

భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వోడాఫోన్ ఐడియా(Vi) కొత్త వారిని ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలను చేస్తున్నది. అందులో భాగంగానే Vi Mobile యాప్ ద్వారా తన యొక్క వినియోగదారులకు గవర్నమెంట్ జాబ్స్ పొందడానికి ప్రయత్నిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తోంది. Vi వినియోగదారులు Vi యాప్ ద్వారా రైల్వే గ్రూప్ D పరీక్షలకు కావలసిన మెటీరియల్స్ ని పొందవచ్చు అని ఇటీవలి ప్రకటనలో తెలిపింది. జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో పరీక్షలకు సంబందించిన మెటీరియల్ Vi మొబైల్ యాప్‌లోని Vi's Jobs & Education ప్లాట్‌ఫారమ్ ద్వారా నావిగేట్ చేయడానికి వీలును కల్పిస్తోంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రైల్వే D టెస్ట్ సిరీస్ మెటీరియల్‌

రైల్వే D టెస్ట్ సిరీస్ మెటీరియల్‌

Vi టెలికాం ఆపరేటర్ పరీక్ష వారితో భాగస్వామ్యం కలిగి ఉండడంతో ఆగస్ట్ 17, 2022 నుండి ప్రారంభమయ్యే ఆల్ ఇండియా రైల్వే D పరీక్షల కోసం ప్రిపరేటరీ టెస్ట్ సిరీస్ మెటీరియల్‌కు యాక్సెస్‌ను అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయడంతో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే Vi వినియోగదారులకి Vi జాబ్స్ & ఎడ్యుకేషన్స్ విభాగంలోని ‘పరీక్ష పాస్' యొక్క ఒక నెల సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తుంది. ఇది స్టేట్ సెలక్షన్ కమీషన్, బ్యాంకింగ్, టీచింగ్, డిఫెన్స్, రైల్వేస్ మొదలైన వివిధ విభాగాలలో 150+ పరీక్షల్లో అపరిమిత మాక్ టెస్ట్‌లను కూడా కలిగి ఉంటుంది. ట్రయల్ పీరియడ్ ముగింపులో వినియోగదారులు రూ.249/సంవత్సరం నామమాత్రపు చందా రుసుముతో ప్లాట్‌ఫారమ్‌లో నేర్చుకోవడం కొనసాగించవచ్చు.

 

Instagram DMలను ఆటోమేటిక్‌గా మాతృభాషలోకి ట్రాన్సలేట్ చేయడం ఎలా?Instagram DMలను ఆటోమేటిక్‌గా మాతృభాషలోకి ట్రాన్సలేట్ చేయడం ఎలా?

 

 

Vi App
 

Vi Appలోని రైల్వే గ్రూప్ D టెస్ట్ సిరీస్ భారతీయ రైల్వేలో ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్-IV, హెల్పర్/అసిస్టెంట్, అసిస్టెంట్ పాయింట్స్‌మన్ మరియు లెవెల్-I స్థానాల్లో 1 లక్షకు పైగా ఓపెనింగ్‌లకు సిద్ధమయ్యే అవకాశాన్ని భారత్ యువతకు అందిస్తుంది. Vi కస్టమర్‌లు ఎక్కడైనా, ఎప్పుడైనా Vi యాప్‌లోని Vi జాబ్స్ & ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బాగా పరిశోధించిన పరీక్ష మెటీరియల్‌ని యాక్సెస్ చేయవచ్చు.

జియో యూజర్లకు స్వాతంత్ర్య దినోత్సవ బంపర్ ఆఫర్!! ఉచితంగా 75GB డేటా...జియో యూజర్లకు స్వాతంత్ర్య దినోత్సవ బంపర్ ఆఫర్!! ఉచితంగా 75GB డేటా...

Vi యాప్‌లో RRB గ్రూప్ D పరీక్ష మెటీరియల్‌ని పొందే విధానం

Vi యాప్‌లో RRB గ్రూప్ D పరీక్ష మెటీరియల్‌ని పొందే విధానం

స్టెప్ 1: మీ Vi నంబర్ ద్వారా Vi యాప్‌లోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: తరువాత 'Vi జాబ్స్ & ఎడ్యుకేషన్' ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఆ తరువాత ‘సర్కారీ నౌక్రి' ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4: మీ ప్రొఫైల్ యొక్క వివరాలను పూరించండి మరియు 'రైల్వేస్' విభాగాన్ని ఎంచుకోండి.

స్టెప్ 5: రైల్వే కోర్సుల నుండి ఎంచుకోండి.


Vi యాప్‌లోని Vi జాబ్స్ & ఎడ్యుకేషన్ భారతదేశంలోని అతిపెద్ద జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫారమ్ ‘అప్నా', ప్రముఖ ఇంగ్లీష్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు 'ఎంగురు' మరియు 'పరీక్ష' ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల తయారీలో ప్రత్యేకత కలిగిన ప్లాట్‌ఫారమ్‌లను కూడా అనుసంధానిస్తుంది.

 

Best Mobiles in India

English summary
Vodafone Idea Offers Railways Group D Exams Test Material Free Access on Vi App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X