వోడాఫోన్ ఐడియాలోనూ కాలింగ్ కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లు.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏకంగా 365 రోజులు..!
వోడాఫోన్ ఐడియా (Vodafone idea) సంస్థ యూజర్ల పరంగా మూడో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఇందులో కాలింగ్, డేటా, SMS, ఓటీటీ ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా కాలింగ్, SMS ప్రయోజనాలతో ప్రత్యేకంగా వాయిస్ ప్లాన్‌లు తీసుకొచ్చింది. అన్ని టెలికాం సంస్థలు కూడా ఈ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చాయి.
వోడాఫోన్ ఐడియా (VI) సంస్థ ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే తన రీఛార్జ్ ప్లాన్‌లలో కాస్త భిన్నమైన ప్రయోజనాలను అందిస్తుంది. రాత్రి సమయాల్లో అన్‌లిమిటెడ్ డేటాను అందించడం, వారంతాల్లో డేటా వినియోగం సహా అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.

వోడాఫోన్ ఐడియా రూ.470 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vodafone idea Rs470 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతోపాటు మొత్తంగా 900 SMS లను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా సహా ఇతర ప్రయోజనాలను అందించడం లేదు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. కేవలం కాలింగ్ కోసమే మొబైల్ వినియోగించే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. లేదా డేటా కోసం వేరే సిమ్ కార్డు లేదా వైఫై వంటి సదుపాయాలు ఉన్న యూజర్లకు ఈ ప్లాన్ సౌకర్యంగా ఉంటుంది.
Vi రూ.1849 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 3600 SMS లను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా సహా ఇతర ప్రయోజనాలను అందించడం లేదు.
ఈ ప్లాన్ (Vodafone idea Rs1849 Recharge Plan) వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. కేవలం కాలింగ్ కోసం ఫోన్ ఉపయోగిస్తున్న యూజర్లకు ఈ ప్లాన్ సౌకర్యంగా ఉంటుంది. దీంతోపాటు డేటా కోసం వైఫై లేదా ఇతర సిమ్ కార్డులు వినియోగిస్తున్న వారికి ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
* జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు కూడా కేవలం వాయిస్ కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. జియో వెబ్‌సైట్ వివరాల ఆధారంగా రూ.448 రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 1000 SMS లను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. వీటితోపాటు జియోటీవీ, జియోఏఐక్లౌడ్ వంటి యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.
జియో వెబ్‌సైట్ వివరాల ఆధారంగా రూ.1748 రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 3600 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియోఏఐక్లౌడ్ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు.
* ఎయిర్‌టెల్ కూడా వాయిస్ కోసం ప్రత్యేక ప్లాన్‌లను అందిస్తోంది. రూ.469 రీఛార్జ్ ప్లాన్‌లో కాలింగ్ సహా 900 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. హలోట్యూన్స్, పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
ఎయిట్‌టెల్ రూ.489 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, 600 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 6GB డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 77 రోజులుగా ఉంటుంది. హలోట్యూన్స్, పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.548 రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మొత్తంగా 900 SMS లను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 7GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. హలోట్యూన్స్, పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications