Home
News

జియో, ఎయిర్‌టెల్‌, BSNL అందించని.. కేవలం వోడాఫోన్ ఐడియాలో మాత్రమే ఉన్న రీఛార్జ్‌ ప్లాన్‌ గురించి తెలుసా?

ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌ కంటే వోడాఫోన్‌ ఐడియా (VI) ప్రత్యేకమైన ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ను కలిగి ఉంటుంది. మరే ఇతర సంస్థ ఈ తరహా ప్లాన్‌ను కలిగి లేదు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL సహా ఎయిర్‌టెల్‌, జియో సంస్థలు గరిష్ఠంగా రోజువారీ 3G డేటా ప్లాన్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా గరిష్ఠంగా రోజువారీ 4GB డేటా ప్లాన్‌ను (Vodafone idea 4GB Data Recharge Plans) అందిస్తోంది.

ఈ VI 4GB రోజువారీ డేటా ప్లాన్‌ గతంలో రూ.475 గా ఉండేది. జులై 4 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ధర రూ.539 గా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లతోపాటు రోజువారీ 4GB డేటాను వినియోగించుకోవచ్చు.

Vodafone idea offers RS539 Prepaid Recharge plan benefits

దీంతోపాటు బింగ్‌ ఆల్‌ నైట్‌ ఆఫర్‌లో భాగంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. మరియు వీకెండ్‌ డేటా రోలోవర్‌ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ప్రతినెల 2GB డేటాను బ్యాకప్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

భారత్‌లో ప్రస్తుతం ఉన్న టెలికాం సర్వీసుల్లో కేవలం వోడాఫోన్ ఐడియా మాత్రమే 4GB డేటా అందించే ప్లాన్‌ను అందిస్తోంది. ఈ VI 4GB రోజువారీ డేటా ప్లాన్‌ ధర రూ.539 ఉండగా.. రోజువారీ ప్రాతిపదికన ఖర్చు రూ.19.25 గా ఉంది. రోజువారీ అధికంగా డేటా వినియోగించే యూజర్లకు ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. మరికొన్ని వోడాఫోన్‌ ఐడియా ప్లాన్‌ల వివరాలు.

*VI రూ.579 ప్లాన్‌ ద్వారా 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ 1,5GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజుకు 100 SMS లను పొందవచ్చు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

VI రూ.649 ప్లాన్‌ ద్వారా 56 రోజుల వ్యాలిడిటీను పొందవచ్చు. మరియు 2GB రోజువారీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజుకు 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

VI రూ.859 రీఛార్జ్‌ ప్లాన్‌తో అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ సహా రోజువారీ 1.5GB డేటా, 100 SMSలను వినియోగించుకోవచ్చు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.

VI రూ.979 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 2GB డేటా, 100 SMS లను పొందవచ్చు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone idea offers RS539 Prepaid Recharge plan offers 4GB Data per day details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X