జియో ప్రతిపాదనలను వ్యతిరేకించిన వోడాఫోన్ ఐడియా... అసలు ఎవరి ప్లాన్ ఏంటి?
భారత్‌లో ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ సంస్థలు దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే అత్యధిక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. మరిన్ని ప్రాంతాలకు 5G నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ రెండు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో ఆరు నెలల్లో వోడాఫోన్ ఐడియా సంస్థ భారత్‌లో 5G సేవలను ప్రారంభించాలని భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ BSNL కొద్ది నెలల్లో 4G సేవలను ప్రారంభించాలని భావిస్తోంది.
అసలు జియో ప్రతిపాదనలు ఏంటి? : అయితే కొద్ది రోజుల క్రితం జియో.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి (TRAI) కీలక ప్రతిపాదనలు పంపింది. 2G, 3G సేవలను దేశంలో నిలిపేయాలని కోరింది. వినియోగదారులు 4G మరియు 5G సేవలకు మారుతున్నందున 2G, 3G సేవలను నిలిపేయాలని కోరింది. ఈ ప్రతిపాదనను వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) తీవ్రంగా వ్యతిరేకించింది.

2G, 3G సేవలను నిలిపేస్తే గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు అవస్థలు పడతారని వోడాఫోన్ ఐడియా ఆందోళన వ్యక్తంచేసింది. POS మెషిన్, ATM సేవలు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం అవుతాయని పేర్కొంది. జియో 4G హై స్పీడ్ డేటా సేవలలో టెలికాం మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు వరకు కేవలం 2G, 3G నెట్‌వర్క్‌లు మాత్రమే ఉండేవి. అయితే జియో నెట్‌వర్క్ 2G, 3G సేవలు అందించడం లేదు.
ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి సంస్థలకు ఇప్పటికీ 2G, 3G నెట్‌వర్క్ వినియోగదారులున్నారు. ఈ రెండు సంస్థలు 2G, 3G వినియోగదారులను కోల్పోయేందుకు ఇష్టపడడం లేదు. అయితే ఈ రెండు సర్వీసులను ముగించడం ద్వారా వారందరినీ 4G, 5G నెట్‌వర్క్‌కు తీసుకురావాలని జియో భావిస్తోంది. అయితే ఇప్పటికీ కేవలం 2G, 3G సేవలను అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ BSNL మాత్రం.. జియో ప్రతిపాదనలపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా - TRAI నిర్ణయం తీసుకోలేదు : అయితె జియో ప్రతిపాదనను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరికొన్ని నెలల్లో 5G సేవలను ప్రారంభించాలని భావిస్తున్న వోడాఫోన్ ఐడియా ఢిల్లీ, ముంబై, పూణే వంటి నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను టెస్టింగ్ చేస్తోంది.
నగదు కొరతను ఎదుర్కొంటోన్న వోడాఫోన్ ఐడియా గత కొంత కాలంగా నిధులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సుమారు 6 -7 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. అప్పటికి మానిటైజేషన్ ఇప్పటి కంటే స్పష్టంగా ఉంటుందని, తమ ప్రణాళికలు కూడా దానిపై ఆధారపడి ఉంటాయని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications