ప్రీపెయిడ్ రీఛార్జ్ లపై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు
దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి. ఇందులో భాగంగా ఐడియా వొడాఫోన్తో జత కట్టిన విషయం తెలిసిందే.
దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి. ఇందులో భాగంగా ఐడియా వొడాఫోన్తో జత కట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు దిగ్గజాలకు ధీటుగా ఆపర్లను ప్రకటించి కస్టమర్లను కాపాడుకోవాల్సిన బాధ్యతను విలీనబాట పట్టిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా వోడాఫోన్ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. రీచార్జ్‌లపై క్యాష్‌బ్యాక్ మరియు ఫ్రీ వోచర్లు అందిస్తున్నట్టు ప్రకటించింది. దీనికోసం పేటిఎంతో జతకట్టింది.దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకున్న వోడాఫోన్, ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది.

ముఖ‍్యంగా రూ .149 కనీస రీఛార్జికి 25 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అలాగే దీనికి అదనంగా రూ.375 విలువ వోచర్లును అందిస్తుంది. వీటిని పేటీఎంమాల్ లో షాపింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు.ఈ నేపథ్యం వోడాఫోన్ ఐడియా 6 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. అవేంటో తెలుసుకోండి...

రూ.25 ప్లాన్...
ఈ రూ.25 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.18 టాక్ టైం లభిస్తుంది. అలాగే 10MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.35 ప్లాన్...
ఈ రూ.35 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.26 టాక్ టైం లభిస్తుంది. అలాగే 100MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.65 ప్లాన్...
ఈ రూ.65 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.65 టాక్ టైం లభిస్తుంది. అలాగే 200MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.95 ప్లాన్...
ఈ రూ.95 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.95 టాక్ టైం లభిస్తుంది. అలాగే 500MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.145 ప్లాన్...
ఈ రూ.145 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.145 టాక్ టైం లభిస్తుంది. అలాగే 1GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 42 రోజులు మాత్రమే .

రూ.245 ప్లాన్...
ఈ రూ.245 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.245 టాక్ టైం లభిస్తుంది. అలాగే 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే .


Click it and Unblock the Notifications








