శాటిలైట్ ఇంటర్నెట్ కోసం మరో సంస్థ కీలక ఒప్పందం.. నేరుగా స్మార్ట్‌ఫోన్‌లకే...!
ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) కీలక ప్రకటన చేసింది. ఇటీవలే భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం (Satellite internet Services in india) ఎలాన్ మస్క్‌కు స్టార్‌లింక్ సంస్థకు టెలికాం విభాగం ఇటీవలే లెసెన్స్ మంజూరు చేసింది. అయితే సర్వీసుల ప్రారంభానికి మరిన్ని అనుమతులు, ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో Vi చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం :
అమెరికా సంస్థ AST స్పేస్ మొబైల్స్‌తో (AST Spacemobile) శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వోడాఫోన్ ఐడియా బుధవారం ప్రకటన చేసింది. అంతరిక్ష ఆధారిత సెల్యూలర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను అందిస్తున్న సంస్థగా AST స్పేస్ మొబైల్స్ గుర్తింపు పొందింది. ఈ సంస్థ అంతరిక్షం నుంచి నేరుగా స్మార్ట్‌ఫోన్‌కే సర్వీసులు అందిస్తుంది.

జియో, ఎయిర్‌టెల్ సంస్థలు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం స్పేస్‌ఎక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే స్పేస్‌ఎక్స్‌కు చెందిన అనుబంధ సంస్థ స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. అయితే ఈ సర్వీసులు పొందేందుకు యూజర్లు ప్రత్యేక హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్‌కే నేరుగా సర్వీసులు :
అదే వోడాఫోన్ ఐడియా (Vodafone idea) ఒప్పందం కదుర్చుకున్న AST స్పేస్ మొబైల్స్ సంస్థ స్మార్ట్‌ఫోన్‌కే నేరుగా సర్వీసులు అందిస్తుంది. కమర్షియల్, ప్రభుత్వ అప్లికేషన్ల కోసం ఈ నెట్‌వర్క్‌ను డిజైన్ చేసినట్లు Vi వెల్లడించింది. మరియు మొబైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేని ప్రాంతాల్లో కనెక్టివిటీని విస్తరించేందుకు ఈ రెండు సంస్థలు తమ ముందుకొచ్చాయి.
అంతరిక్షం నుంచే 4G, 5G సేవలు :
అమెరికా సంస్థ AST స్పేస్ మొబైల్స్.. అంతరిక్షం నుంచి నేరుగా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వాయిస్, వీడియో కాల్ సేవలు అందించడం ద్వారా చరిత్ర సృష్టించిందని Vi వెల్లడించింది. అంతరిక్షం నుంచే 4G, 5G సేవలు అందిస్తామని AST స్పేస్‌మొబైల్స్ సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రిస్ ఐవరీ వెల్లడించారు.
సరైన సమయంలో సమాచారం అందిస్తామన్న సంస్థలు :
వోడాఫోన్ ఐడియా, AST సంస్థల భాగస్వామ్యంలో సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయనే కచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు. సరైన సమయంలో సమాచారం అందిస్తామని ఈ రెండు సంస్థలు వెల్లడించాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
స్టార్‌లింక్ సంస్థకు టెలికాం విభాగం ఇటీవలే లైసెన్స్ మంజూరు చేసింది. ట్రాయ్ కూడా కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. ఇవి ఆమోదం పొందాల్సి ఉంటుంది. సేవలు ప్రారంభం అయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టార్‌లింక్ సుమారు 100 పైగా దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది.
స్టార్‌లింక్ లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉన్న 6 వేలకు పైగా ఉపగ్రహాలతో శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. భూమికి సుమారు 550 కిమీ ఎత్తులో పరిభ్రమిస్తూ హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కాస్త తక్కువ ధరకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications