Home
News

ఒకే ప్లాన్‌లో కాల్స్‌, డేటా, OTT సబ్‌స్క్రిప్షన్‌.. రూ.500 కంటే తక్కువ ధరలో బెస్ట్‌ రీఛార్జ్ ప్లాన్‌లు..!

భారత్‌ టెలికాం రంగంలో యూజర్ల పరంగా వోడాఫోన్ ఐడియా (Vi) మూడో స్థానంలో ఉంది. ఇటీవలే దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఇతర టెలికాం నెట్‌వర్క్‌లతో పోలిస్తే Vi తన యూజర్ల కోసం అనేక ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో అన్‌లిమిటెడ్‌ డేటా, వీకెండ్‌ డేటా రోల్‌ఓవర్‌ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తోంది.

వోడాఫోన్‌ ఐడియా (Vodafone idea) యూజర్ల కోసం కాలింగ్‌, డేటా ప్యాక్స్‌తోపాటు ఓటీటీ ప్లాన్‌లను కూడా కలిగి ఉంది. అంటే కాలింగ్‌, డేటా ప్లాన్‌లలోనే ఓటీటీ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ప్రస్తుతం రూ.500 కంటే తక్కువ ధరలో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు మీకోసం.

vi ott recharge plans

రూ.239 Vi రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 300 SMS లను అందిస్తోంది. మరియు మొత్తంగా 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌లో (Vi Rs239 Recharge Plan) భాగంగా జియోహాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. నెల రోజుల వరకు వినియోగించుకోవచ్చు.

రూ.399 Vi రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. మరియు అర్ధ రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను ఉపయోగించుకోవచ్చు.

దీంతోపాటు (Vi Rs399 Recharge Plan) వీకెండ్‌ రోల్ ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. నెల రోజులపాటు ఉపయోగించుకోవచ్చు.

vi ott recharge plans

రూ.408 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా Vi యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. మరియు అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను ఉపయోగించుకోవచ్చు.

దీంతోపాటు (Vi Rs408 Recharge Plan) వీకెండ్‌ రోల్ ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 28 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు.

Take a Poll

రూ.469 Vi రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా వోడాఫోన్‌ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ 2.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు.

దీంతోపాటు అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. మరియు వీకెండ్‌ రోల్‌ ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌లో (Vi Rs469 Recharge Plan) భాగంగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. మూడు నెలల వరకు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. డేటా డిలైట్ వంటి ప్రయోజనాలను వోడాఫోన్‌ ఐడియా యాప్‌ ద్వారా క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone idea prepaid recharge Plans with OTT Benefits under Rs500 here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X