Vodafone-Idea: తక్కువ ధరలో రోజుకు 3GB డేటాతో మిగిలిన వారికి పోటీ

|

భారతీయ టెలికాం మార్కెట్లో ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా సంస్థ యొక్క కొనసాగింపు మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలకు చాలా వరకు కారణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.57,000 కోట్ల AGR బకాయిలతో వోడాఫోన్ ఐడియా మూసివేతకు అంచున ఉన్నపటికీ ఇది తన వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లను ప్రారంభిస్తూనే ఉన్నది.

వోడాఫోన్ ఐడియా

చందాదారుల యొక్క భారీ బేస్ డిప్‌ను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా వోడాఫోన్ ఐడియా కొన్ని ఎంచుకున్న ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌లపై 1.5GB రోజువారీ అదనపు డేటాను అందించడం ప్రారంభిస్తున్నది. వోడాఫోన్ ఐడియా యొక్క రూ.249, రూ.399 మరియు రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇప్పుడు రోజుకు 3GB డేటాను వరుసగా 28 రోజులు, 56 రోజులు మరియు 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నాయి.

 

 

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని చూస్తున్నారా? కొంచెం వెయిట్ చేయండి!!!బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని చూస్తున్నారా? కొంచెం వెయిట్ చేయండి!!!

ప్రీపెయిడ్

వోడాఫోన్ మరియు ఐడియా ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ కొత్త ఆఫర్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ ఆఫర్‌లోని మూడు ప్లాన్‌లు 22 టెలికాం సర్కిల్‌లలో ఓపెన్ మార్కెట్ ద్వారా అందుబాటులో ఉన్నది. ఈ ఆఫర్‌ను మై వోడాఫోన్, మై ఐడియా మరియు టెల్కోస్ రెండింటి యొక్క సంబంధిత వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు.

 

 

HD Video క్వాలిటీతో నెట్‌ఫ్లిక్స్ మొబైల్, బేస్ ప్లాన్‌లుHD Video క్వాలిటీతో నెట్‌ఫ్లిక్స్ మొబైల్, బేస్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల వివరాలు

వోడాఫోన్ ఐడియా మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల వివరాలు

వొడాఫోన్ ఐడియా యొక్క అదనపు డేటా ఆఫర్‌లో భాగమైన మూడు రీఛార్జీలు రూ .249, రూ. 399 మరియు రూ. 599. మొత్తం మూడు ప్లాన్‌లు ముందు తమ మొత్తం చెల్లుబాటు కాలంలో 1.5 జీబీ రోజువారీ డేటాను అందించేవి. అయితే ఈ కొత్త ఆఫర్‌లో భాగంగా కంపెనీ ఈ మూడు ప్లాన్‌ల మీద తమ మొత్తం చెల్లుబాటు కాలానికి ప్రస్తుతం ఉన్న దానికి అదనంగా 1.5GB డేటాను కలుపుకొని మొత్తంగా 3GB రోజువారీ డేటాను అందిస్తోంది. దీనితో రూ.599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు 84 రోజుల చెల్లుబాటు కాలానికి 252GB డేటాను అందిస్తుంది. రూ.249 ప్లాన్‌ 28 రోజుల చెల్లుబాటు కాలానికి 84GB డేటాను మరియు రూ.399 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు కాలానికి 168GB డేటాను అందిస్తుంది.

 

 

వాట్సాప్ మెసేజ్ లను రహస్యంగా చదవడం ఎలా?వాట్సాప్ మెసేజ్ లను రహస్యంగా చదవడం ఎలా?

అదనపు ప్రయోజనాలు

అదనపు ప్రయోజనాలు

మూడు రీఛార్జీ ప్లాన్‌ల యొక్క అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇవి భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు మరియు సంబంధిత టెల్కో యొక్క OTT యాప్ చందాను అందిస్తాయి. వొడాఫోన్ వినియోగదారులు వోడాఫోన్ ప్లే యాప్ కి ఉచిత యాక్సిస్ ను పొందుతారు. ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఐడియా మూవీస్ & టివి మొబైల్ యాప్ లో అదనపు ఖర్చు లేకుండా కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.

 

 

ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

వోడాఫోన్ ఐడియా సెల్ఫ్- కేర్

వోడాఫోన్ ఐడియా సెల్ఫ్- కేర్

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు టెల్కోస్ యొక్క సెల్ఫ్- కేర్ మరియు వెబ్‌సైట్లలో అదనపు డేటా ఆఫర్‌ను పొందవచ్చు. గతంలో కూడా వోడాఫోన్ ఎంచుకున్న ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై అదనపు డేటాను అందించింది. అయితే ఇది మై వోడాఫోన్ మొబైల్ యాప్ ద్వారా చేసిన రీఛార్జ్‌ల కోసం మాత్రమే.

 

 

PF బ్యాలెన్స్ ను SMS ద్వారా తెలుసుకోవడం ఎలా?PF బ్యాలెన్స్ ను SMS ద్వారా తెలుసుకోవడం ఎలా?

వోడాఫోన్ ఐడియా లక్ష్యం

వోడాఫోన్ ఐడియా లక్ష్యం

భారతీయ టెలికం రంగంలో వోడాఫోన్ ఐడియా యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. AGR బకాయిల విషయంలో టెల్కోకు ప్రభుత్వం ఎటువంటి ఉపశమనం ఇవ్వకపోవడంతో వోడాఫోన్ ఐడియా ఈ దశలో ఎలా బయటపడుతుందో అని చూడటం చాలా ఆసక్తికరంగా ఉంది. AGR టెల్కోకు పెద్ద ఆందోళన కలిగిస్తే మరొక పెద్ద విషయం చందాదారుల భారీ బేస్ డ్రాప్. విలీనం సమయంలో సుమారు 440 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్న వోడాఫోన్ ఐడియా ఇప్పుడు కేవలం 300 మిలియన్ల వినియోగదారులను మాత్రమే కలిగి ఉంది. నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్ కారణంగా వోడాఫోన్ ఐడియా వినియోగదారులు కాల్స్ మరియు డేటా వంటి సాధారణ సేవలకు సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 

 

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను తాత్కాలికంగా డిసేబుల్ చేయడం ఎలా?ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను తాత్కాలికంగా డిసేబుల్ చేయడం ఎలా?

వోడాఫోన్ ఐడియా యూసర్ బేస్

వోడాఫోన్ ఐడియా యూసర్ బేస్

డిసెంబర్ 2019 లో వోడాఫోన్ ఐడియా 3.5 మిలియన్లకు పైగా వినియోగదారులను కోల్పోయింది. అలాగే జనవరి 2020 లో కూడా అదే సంఖ్యలో చందాదారులను కోల్పోయింది. ఈ కొత్త అదనపు డేటా ఆఫర్‌తో వోడాఫోన్ ఐడియా రోజుకు 3 జిబి డేటాను రూ.250 లోపు అందించడం ద్వారా రిలయన్స్ జియోను ఓడించగలిగింది. రాబోయే రోజుల్లో రిలయన్స్ జియో తన సొంత పరిమిత కాల ఆఫర్‌తో వోడాఫోన్ ఐడియాకు పోటీగా రావచ్చు.

Best Mobiles in India

English summary
Vodafone-Idea Provide Extra 1.5GB Daily Data on Select Three Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X