ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేలా సైలెంట్‌గా ఆ రీఛార్జ్ ప్లాన్ ను తిరిగి తీసుకొచ్చిన వోడాఫోన్ ఐడియా..!
ప్రైవేటు టెలికాం సంస్థలు జియో. ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఈ సంవత్సరం జులై తొలివారంలో రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచాయి. కనీసం 15 శాతం ధరలు పెరిగాయి. దీంతో అనేక మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కు పోర్టింగ్ అవుతున్నారు. అదే సమయంలో వోడాఫోన్ ఐడియా (VI), ఎయిర్‌టెల్, ఐడియా వంటి సంస్థలు భారీగా యూజర్లను కోల్పోతున్నాయి. దీంతో ఈ సంస్థలు పాత రీఛార్జ్ ప్లాన్‌లను తిరిగి తీసుకురావడం సహా యూజర్లకు అవసరమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) యూజర్లను ఆకట్టుకొనేందుకు పాత ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కొన్ని మార్పులు చేసింది. జులై కంటే ముందు VI రూ.719 రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉండేది. ధరల పెంపు అనంతరం ఈ ప్లాన్ రూ.859 గా మారింది. తాజాగా మరోసారి VI యూజర్లకు రూ.719 ప్లాన్ అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుత రూ.719 రీఛార్జ్ ప్లాన్ 72 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 1GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. అంటే ప్లాన్ వ్యాలిడిటీలో మొత్తంగా 72GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS ను వినియోగించుకోవచ్చు.
ప్రస్తుత రూ.859 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. మరియు 12AM - 6AM అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. మరియు సోమవారం నుంచి శక్రవారం వరకు మిగిలిన డేటాను వారాంతానికి వినియోగించుకోవచ్చు. అయితే నెలకు 2GB వరకు మాత్రమే వినియోగించుకొనే వీలుంది.
దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. అయితే ఈ రెండు ప్లాన్‌ల మధ్య రూ.140 వ్యత్యాసం ఉంది. అయితే రూ.719 రీఛార్జ్ ప్లాన్ కంటే.. రూ.859 ప్లాన్ 12 రోజుల ఎక్కువ వ్యాలిడిటీని అందిస్తుంది. మరియు అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
దీంతోపాటు కొందరికి ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ.979 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజువారీ 2GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. మరియు 12 AM నుంచి 6AM వరకు అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు సోమవారం నుంచి శుక్రవారం మధ్య మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వినియోగించుకోవచ్చు. నెలవారీ 2GB వరకు ఈ డేటాను స్టోర్ చేసుకోవచ్చు.
ఈ వోడాఫోన్ ఐడియా రూ.979 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు ఈ ప్లాన్‌లో భాగంగా 15 OTT లను వినియోగించుకోవచ్చు. ViMTV ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
Vi రూ.994 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 3 నెలలపాటు డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు 12 AM నుంచి 6AM వరకు అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు సోమవారం నుంచి శుక్రవారం మధ్య మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వినియోగించుకోవచ్చు. నెలవారీ 2GB వరకు ఈ డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS సదుపాయాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








