భారీ నష్టాలను చవిచూసిన వొడాఫోన్ ఐడియా

By Gizbot Bureau
|

దేశీయ టెలింక రంగంలో అగ్రభాగాన దూసుకుపోతున్న వొడాఫోన్ ఐడియాకు నష్టాలు తప్పడం లేదు. డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను నమోదు చేసింది. 2019-20 మూడవ త్రైమాసికంలో వోడా ఐడియా నష్టాలు రూ .6,439 కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 50,922లు. పెరిగిన ఆర్థిక ఖర్చులు, ఆస్తుల విలువ క్షీణత ప్రభావం చూపినట్టు కంపెనీ తెలిపింది. గురువారం ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో వోడాఫోన్‌ ఐడియా మొత్తం ఆదాయం 5 శాతం తగ్గి రూ .11,381 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో ఇది రూ. 11,983 కోట్లుగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. కంపెనీ ఆర్థిక ఖర్చులు దాదాపు 30 శాతం పెరిగి రూ.3,722 కోట్లకు చేరుకోగా, తరుగుదల 23 శాతం పెరిగి రూ.5,877 కోట్లకు చేరుకుంది .వినియోగదారుల సంఖ్య గత క్వార్టర్‌లో 31.1 కోట్లతో పోలిస్తే క్యూ 3 లో 30.4 కోట్లకు తగ్గింది.

14 త్రైమాసికాల తరువాత 

14 త్రైమాసికాల తరువాత 

వొడాఫోన్ ఐడియా సీఎండీ రవీందర్ తక్కర్ మాట్లాడుతూ గత క్వార్టర్‌తో పోలిస్తే ఆదాయం 2.3 శాతం పుంజుకుందన్నారు. 14 త్రైమాసికాల తరువాత సగటు రోజువారీ రాబడి (ఎడిఆర్) వృద్ధి తిరిగి వచ్చిందని కంపెనీ పేర్కొంది. వేగవంతమైన నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్‌తో పాటు 4జీ కవరేజ్, కీలక మార్కెట్లలో సామర్థ్యం విస్తరణపై దృష్టి సారించినట్టు చెప్పారు. ఏజీఆర్‌ ఇతర విషయాలపై ఉపశమనం కోరుతూ ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు చెప్పారు.

బకాయిల విలువ రూ. 53,000కోట్లు

బకాయిల విలువ రూ. 53,000కోట్లు

జనవరి 24 నాటికి కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సి సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విలువ రూ. 53,000కోట్లు. అయితే 24 అక్టోబర్ నాటి ఉత్తర్వులను సవరించడానికి పిటిషన్ వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించిన మూడు వారాల తరువాత వోడాఫోన్ ఐడియా ఫలితాలు వచ్చాయి. మరోవైపు ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై ఉపశమనం కల్పించకపోతే కంపెనీ మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిన సంగతి విదితమే.

30 శాతం పెరిగిన వడ్డీ వ్యయాలు...

30 శాతం పెరిగిన వడ్డీ వ్యయాలు...

గత క్యూ3లో రూ.11,983 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 5 శాతం పతనమై రూ.11,381 కోట్లకు తగ్గింది. వడ్డీ వ్యయాలు 30 శాతం ఎగసి రూ.3,722 కోట్లకు, తరుగుదల వ్యయాలు 23 శాతం వృద్ధితో రూ.5,877 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ కంపెనీ నష్టాలు తగ్గాయి. గత క్యూ2లో రూ.50,922 కోట్ల నికర నష్టాలను కంపెనీ ప్రకటించింది. ఏజీఆర్‌ బకాయిల కేటాయింపుల కారణంగా ఈ కంపెనీకి ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. 

మెరుగుపడుతున్న ఆదాయం.

మెరుగుపడుతున్న ఆదాయం.

ఏజీఆర్‌కు సంబంధించిన ఊరటనివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని రవీందర్‌ టక్కర్‌ పేర్కొన్నారు. కీలక మార్కెట్లలో కెపాసిటీ విస్తరణ, 4జీ కవరేజ్, నెట్‌వర్క్‌ ఇంటిగ్రేషన్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఇటీవల టారిఫ్‌లను పెంచడం వల్ల సెప్టెంబర్‌ నుంచి ఆదాయం పుంజుకుంటోందని పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో టారిఫ్‌లను మరింతగా పెంచడం వల్ల ఆదాయం మరింతగా మెరుగుపడగలదని వివరించారు. 

Best Mobiles in India

English summary
Vodafone Idea reports consolidated loss of Rs 6,438.8 cr in Dec quarter

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X