Home
News

యూజర్లకు వరుస షాక్‌లు ఇచ్చిన టెలికాం సంస్థలు.. వోడాఫోన్‌ ఐడియా రీఛార్జీ ప్లాన్‌ల ధరలు పెంపు..!

గత రెండు రోజులుగా టెలికాం సంస్థలు వినియోగదారులకు గట్టి షాక్‌ ఇచ్చాయి. మొన్న జియో తన ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ రీఛార్జీ ఛార్జీలను పెంచగా.. నిన్న ఎయిర్‌టెల్‌ టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై 3 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపాయి. మరో సంస్థ వోడాఫోన్‌- ఐడియా (Vodafone idea Revised Tariffs 2024) సైతం ఇదే బాటలో నడిచింది. ఛార్జీలు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటన చేసింది. కొత్త ఛార్జీలు జులై 4 నుంచి నుంచి అమల్లోకి రానున్నాయి.

వోడాఫోన్‌- ఐడియా ( VI ) 5G నెట్‌వర్క్‌ లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపింది. 4G అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు మరియు 5G సేవల ప్రారంభం సహా రానున్న రోజుల్లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు VI తెలిపింది.

Vodafone idea hiked tariffs of prepaid and postpaid recharge plans 2024

వోడాఫోన్ - ఐడియా తాజా నిర్ణయంతో ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ రూ.179 ధర.. రూ.199 గా మారింది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా మొత్తంగా 2GB హైస్పీడ్‌ డేటా సహా 300 SMS లను పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

VI రూ.459 ప్లాన్‌.. రూ.509 గా మారింది. ఇందులో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా 300 SMSలను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 6GB హైస్పీడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు ప్లాన్‌ వ్యాలిడిటీ 84గా ఉంది. అదేవిధంగా రూ.1799 ప్లాన్‌.. రూ.1999 గా మారింది. 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అల్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 300 SMS, 24GB డేటాను మాత్రమే పొందుతుంది.

VI ( వోడాఫోన్ - ఐడియా ) రూ.269 ప్లాన్‌.. రూ.299 గా మారింది. ఇందులో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ సహా రోజుకు 1GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు.

రూ.299 ప్లాన్‌.. రూ.349 గా మారింది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS, 1.5GB డేటాను కలిగి ఉంటుంది. దీంతోపాటు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. మరియు వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీను కలిగి ఉంది.

వోడాఫోన్ ఐడియా రూ.319 ప్లాన్‌.. రూ.379 ప్లాన్‌గా మారింది. నెలరోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

VI రూ.479 ప్లాన్‌.. రూ.579 గా మారింది. 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ 1,5GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజుకు 100 SMS లను పొందవచ్చు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

రూ.539 ప్లాన్‌.. రూ.649 గా మారింది. 2GB రోజువారీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజుకు 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వ్యాలిడిటీ 56 రోజులు.

VI రూ.719 ప్లాన్‌.. రూ.859 గా మారింది. రోజువారీ 1.5GB డేటా, 100 SMSలను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ సహా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.

వోడాఫోన్‌ ఐడియా రూ.839 ప్లాన్‌.. రూ.979 గా మారింది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 2GB డేటా, 100 SMS లను పొందవచ్చు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

VI రూ.2899 ప్లాన్‌.. రూ.3499 గా ఉంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 1.5GB రోజువారీ డేటా మరియు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. వీకెండ్‌ రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

డేటా యాన్‌ ఆన్‌ ప్లాన్‌ల విషయానికి వస్తే రూ.19 ప్లాన్.. రూ.22 గా మారింది. ఒక్కరోజు వ్యాలిడిటితో 1GB ను పొందవచ్చు. అదే విధంగా రూ.39 ప్లాన్‌.. 48 గా మారింది. మూడు రోజుల వ్యాలిడిటీతో 6GB డేటాను వినియోగించుకోవచ్చు.

పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లలోనూ మార్పులు చేశారు. 401 ప్లాన్‌.. రూ.451 గా మారింది. అదే విధంగా రూ.501 ప్లాన్‌.. రూ.551 గా మారింది. దీంతోపాటు రూ.601 ఫ్యామిలీ ప్లాన్‌... రూ.701 గా మారింది. ఫ్యామిలీ ప్లాన్ రూ.1001... రూ.1201 గా మారింది. పెరిగిన ధరలు జులై 4 నుంచి అమల్లోకి రానున్నాయి.

Best Mobiles in India

English summary
Vodafone idea revised prepaid and postpaid recharge plans 2024 full list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X