వోడాఫోన్ 28 రోజుల ప్లాన్, కేవలం 24 రూపాయలకే..
దేశీయ టెలికాం దిగ్గజ టెలికాం సంస్థ వోడాఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
దేశీయ టెలికాం దిగ్గజ టెలికాం సంస్థ వోడాఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇతర టెలికాం సంస్థలతో పోటీగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.టెలికాం కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం వోడాఫోన్ రూ.24 అనే ఓ స్పెషల్ వాయిస్ ప్యాక్‌ను లాంచ్ చేసింది.

రూ.24తో రీచార్జి చేసుకుంటే..
వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.24తో రీచార్జి చేసుకుంటే వారికి 100 నిమిషాల కాల్స్, 100 ఎంబీ 3జీ/4జీ డేటా లభిస్తుంది. ఇతర నెట్వర్క్స్ కి అవుట్ గోయింగ్ కాల్స్ చేసినప్పుడు సెకండ్ కి 2.5 పైసా పడుతుంది అలాగే లోకల్ మెసేజులకు రూ.1 ఛార్జ్ అవుతుంది.

వాలిడిటీ 28 రోజులు
ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించారు. ఈ ప్యాక్‌ను రిటెయిల్ ఔట్‌లెట్స్ ద్వారా పొందవచ్చని లేదంటే మై వొడాఫోన్ యాప్, వొడాఫోన్ వెబ్‌సైట్ లేదా ఇతర వాలెట్లు, రీచార్జి సైట్లలోనూ రీచార్జి చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఎయిర్‌టెల్ రూ.23 vs వొడాఫోన్ రూ.24
ఎయిర్‌టెల్ రూ.23 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్న యూజర్ కి అవుట్ గోయింగ్ కాల్స్ కి సెకండ్ కి 2.5 పైసా పడుతుంది అలాగే లోకల్ మెసేజులకు రూ.1 ఛార్జ్ అవుతుంది అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోని వేరే నెట్వర్క్లకు రూ.1.5 ఛార్జ్ అవుతుంది. అయితే ఇందులో ఎటువంటి డేటా బెనిఫిట్లు ఉండవు.

వోడాఫోన్ ఇతర మినిమమ్ రీఛార్జ్ ప్లాన్స్
రూ.25 ప్లాన్...
ఈ రూ.25 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.18 టాక్ టైం లభిస్తుంది. అలాగే 10MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.35 ప్లాన్...
ఈ రూ.35 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.26 టాక్ టైం లభిస్తుంది. అలాగే 100MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.65 ప్లాన్...
ఈ రూ.65 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.65 టాక్ టైం లభిస్తుంది. అలాగే 200MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.95 ప్లాన్...
ఈ రూ.95 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.95 టాక్ టైం లభిస్తుంది. అలాగే 500MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .


Click it and Unblock the Notifications








