వోడాఫోన్ ఐడియా యూజర్లకు బంపర్ ఆఫర్!! తక్కువ ధరకే SonyLIV సబ్‌స్క్రిప్షన్

|

భారతదేశంలోని టెలికాం రంగంలో మూడవ అతి పెద్ద టెలికాం సంస్థ అయిన వోడాఫోన్ ఐడియా(Vi) తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలను చేస్తున్నది. అందులో భాగంగానే ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్ పతి(KBC 2022) షోని చూడడానికి అనుమతిని అందిస్తున్నది. KBC కి ఇండియాలో ఒక ప్రత్యేక ఆదరణను కలిగి ఉంది. అత్యంత సరసమైన ధర వద్ద KBC 2022ని చూడాలనుకునే వారికి వోడాఫోన్ ఐడియా(Vi) ఉత్తమ ఎంపికగా ఉంది.

 

SonyLIV సబ్‌స్క్రిప్షన్‌

Vi వినియోగదారులు కేవలం రూ.82 ధర వద్దనే నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో KBC 2022 యొక్క అన్ని ఎపిసోడ్‌లను చూడటం ప్రారంభించవచ్చు. వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.82 ధర వద్ద ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలానికి SonyLIV సబ్‌స్క్రిప్షన్‌కు ఉచిత యాక్సెస్ ను అందిస్తుంది. Vi టెల్కో అందించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

KBC 2022 వీక్షణ కోసం వోడాఫోన్ ఐడియా ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్

KBC 2022 వీక్షణ కోసం వోడాఫోన్ ఐడియా ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) వినియోగదారులు KBC 2022 టీవీ షో యొక్క అన్ని ఎపిసోడ్ లను స్మార్ట్‌ఫోన్‌లలో చూడాలనుకుంటే కనుక Vi అందించే రూ.82 ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం మంచిది. ఇది డేటా-ఓన్లీ వోచర్ కావున రూ.82 ప్లాన్ పని చేయడానికి మీకు ఎటువంటి బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 14 రోజుల చెల్లుబాటు కాలానికి 4GB డేటాను పొందుతారు. కానీ SonyLIV సబ్‌స్క్రిప్షన్ 28 రోజులు చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం నామమాత్రపు ధరతో KBC 2022ని చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అని గుర్తుంచుకోండి. కావున మీరు TV లేదా ల్యాప్‌టాప్‌లలో SonyLIV ద్వారా కంటెంట్‌ను ప్రసారం చేయలేరు.

SonyLIV
 

వోడాఫోన్ ఐడియా(Vi) వినియోగదారులు SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ను ఒకసారి యాక్టివేట్ చేసిన తర్వాత ఈ సబ్‌స్క్రిప్షన్ పాజ్ చేయబడదు లేదా డియాక్టివేట్ చేయబడదు. అంటే మీరు SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేసిన వెంటనే మీరు దాన్ని 28 రోజుల పాటు పొందుతారని అర్థం. దీని యొక్క ప్రయోజనం విషయానికి వస్తే మీరు కేవలం KBCని చూడటానికే పరిమితం చేయబడదు. అంటే మీరు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారమయ్యే అనేక ఇతర షోలు మరియు సినిమాలను కూడా చూడడానికి అనుమతిని ఇస్తుంది. SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ను పొందిన వారు అందులోని అనేక ఒరిజినల్‌ టీవీ షోలు, సినిమాలు మరియు ప్రాచుర్యం పొందిన సీరియల్స్ లను చూడడానికి అనుమతిని ఇస్తుంది.

SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ పొందే విధానం

SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ పొందే విధానం

SonyLIV సబ్‌స్క్రిప్షన్‌ని పొందడానికి మరొక మార్గం దానిని స్వతంత్ర పద్ధతిలో కొనుగోలు చేయడం. ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి SonyLIV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం మీకు రూ.999 ఖర్చు అయితే అదే ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి మొబైల్ ఓన్లీ ప్లాన్ కోసం మీకు రూ. 599 ఖర్చు అవుతుంది. కానీ మీరు KBC 2022 సీజన్‌ని చూడాలనుకుంటే కనుక వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో అందించే వోచర్ మీకు మంచి ఎంపికగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా సరసమైనదిగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea Rs.82 Data-Only Voucher Plan Offers SonyLIV Mobile Subscription

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X