Home
News

వోడాఫోన్‌ ఐడియా సూపర్ రీఛార్జ్‌ ప్లాన్‌లు.. ప్రతిరోజు 12 గంటలపాటు హైస్పీడ్‌ అన్‌లిమిటెడ్‌ డేటా..!

ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్‌ ఐడియా (Vi) ప్రస్తుతం దేశంలో మూడో అతి పెద్ద టెలికాం నెట్‌వర్క్‌ గా ఉంది. అయితే ఇతర సంస్థల కంటే భిన్నంగా కొన్ని రీఛార్జ్‌ ప్లాన్‌ లను కలిగి ఉంది. Vi అందిస్తున్న కొన్ని రీఛార్జ్‌ ప్లాన్‌ లు రాత్రి సమయాల్లో అన్‌లిమిటెడ్‌ డేటాను అందిస్తాయి. డేటా అవసరాలు ఎక్కువగా ఉండే యూజర్ల కోసం తాజాగా సూపర్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌ పూర్తి ప్రయోజనాల వివరాలు.

వోడాఫోన్ ఐడియా నుంచి ఇటీవల Rs365 రీఛార్జ్ ప్లాన్ (Vodafone idea Rs365 Prepaid Recharge Plan) అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటాపరంగా ప్రతి రోజు 2GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. దీంతోపాటు ప్రతి రోజు 12AM - 12PM వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు.

Vodafone idea RS365 prepaid recharge plan

ప్రతిరోజు 12 గంటలపాటు అన్‌లిమిటెడ్‌ డేటా :
ప్రస్తుతం వోడాఫోన్‌ ఐడియా అనేక ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ లు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను అందిస్తున్నాయి. అయితే రూ.365 రీఛార్జ్‌ ప్లాన్‌ లో మాత్రం ఏకంగా రోజులో 12 గంటలపాటు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

మరిన్ని ప్రయోజనాలు :
ఈ ప్లాన్‌ లో అదనంగా నైట్‌ డేటా, డైలీ డేటా, వీకెండ్‌ డేటా రోల్‌ ఓవర్‌, డేటా డిలైట్స్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. జియో, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను అందిస్తుండగా.. Vi మాత్రం ఈ తరహాలో డేటా ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ యూజర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది.

ఏయే రాష్ట్రాల్లో ఈ ప్లాన్‌ అందుబాటులో ఉంది : వోడాఫోన్‌ ఐడియా రూ.365 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉంది. ఇతర ప్రాంతాల్లో ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు. అయితే వివిధ రాష్ట్రాల్లో ప్రయోజనాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

ప్రతిరోజు 3GB డేటాతోపాటు :
దీంతోపాటు రూ.449 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ లో (Vodafone idea Rs449 Prepaid Recharge Plan) భాగంగా రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌ లో భాగంగా 12AM - 12PM వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ లో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వినియోగించుకోవచ్చు. అయితే నెలకు 2GB వరకు ఇలా డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు వివిధ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ లను పొందవచ్చు. Zee5, SonyLIV సహా సుమారు 400 టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone idea RS365 prepaid recharge plan offers unlimited data in between 12AM to 12PM everyday
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X