iPhone 13 ప్రీ-బుకింగ్ పై ఊహించని Vi క్యాష్‌బ్యాక్ ఆఫర్!! మిస్ అవ్వకండి
ఐఫోన్ 13 సిరీస్ ఇప్పుడు భారతదేశంలో myvi.com, Vi యాప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవడానికి ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. అయితే వోడాఫోన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి ఐఫోన్ 13 సిరీస్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన కొనుగోలుదారులకు మాత్రం ఊహించని ప్రత్యేకమైన డీల్ పొందే అవకాశం ఉంది. వీటిలో క్యాష్‌బ్యాక్ మరియు టెలికాం యొక్క ఇతర సర్వీసులు కూడా పొందే అవకాశం ఉన్నట్లు వోడాఫోన్-ఐడియా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్ 13 క్యాష్‌బ్యాక్ ఆఫర్ వొడాఫోన్-ఐడియా యొక్క పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. Vi యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా iPhone 13 ని ఆర్డర్ చేసిన తర్వాత మీరు మొదటి రోజునే డెలివరీ యాక్సెస్‌ను పొందుతారు. అంటే సెప్టెంబర్ 25న మీరు ఎంతగానో ఇష్టపడే ఐఫోన్ 13 మీ యొక్క చేతులలో పొందవచ్చు. "Vi తో ఐఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన యూజర్లు ఎంచుకున్న మార్కెట్లలో భారతదేశంలో ఉత్పత్తి లభ్యమైన మొదటి రోజున ఉత్పత్తిని పొందడానికి అర్హులు అవుతారు" అని ఈ టెలికాం ఆపరేటర్ అధికారిక ప్రకటనలో తెలిపారు.

Vi - iPhone 13 క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్ ఆఫర్
ఐఫోన్ 13 సిరీస్ ను Vi యొక్క వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ముందుగా బుక్ చేసుకున్నవారికి Vi టెల్కో రూ.1099 Redx ప్యాక్, రూ.1,699 Redx ఫ్యామిలీ ప్యాక్ మరియు రూ.2,299 Redx ఫ్యామిలీ ప్లాన్‌తో సహా కొన్ని REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను ప్రకటించింది. ఈ Redx ప్లాన్‌లను ఎంచుకునే కస్టమర్‌లు మొదటి నెల అద్దె మొత్తంలో "100 శాతం క్యాష్‌బ్యాక్" పొందవచ్చు. ఈ Vi క్యాష్‌బ్యాక్ ఆరు నెలల వ్యవధిలో ప్రతిబింబిస్తుందని Vi టెలికాం ఆపరేటర్ మాట్లాడుతూ వివరించారు.

ఐఫోన్ 13- సిరీస్ ధరల వివరాలు
ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 13 మినీ ఒక్కొక్కటి మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఇందులో ఐఫోన్ 13 మినీ యొక్క 128GB స్టోరేజ్ వేరియంట్ ధర భారతదేశంలో రూ.69,900 కాగా 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900 చివరిగా 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 99,900. అలాగే ఐఫోన్ 13 యొక్క 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,900 మరియు 12GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,900. ఐఫోన్13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్ రెండూ 1TB వరకు స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 13 ప్రో యొక్క 128GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.1,19,900, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,29,900, 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,49,900 మరియు చివరిగా 1TB మోడల్ ధర రూ.1,69,900. టాప్-ఆఫ్-లైన్ ఐఫోన్ 13 ప్రో మాక్స్ యొక్క స్టోరేజ్ వేరియంట్ ధరలు వరుసగా రూ.1,29,900, రూ.1,39,900. రూ.1,59,900 మరియు రూ.1,79,900. ఇది ఆపిల్ సంస్థ యొక్క అత్యంత ఖరీదైన ఐఫోన్ కావడం విశేషం.

"నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ రోమింగ్ మరియు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ప్రీమియం కస్టమర్ సర్వీస్ మరియు మరెన్నో వాటితో ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా REDX లో కస్టమర్‌లు అదనంగా అనేక ప్రయోజనాలను పొందవచ్చు" అని టెలికాం ఆపరేటర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. అదనంగా రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్‌పై ఐఫోన్ 13 కొనుగోలుదారులకు డబుల్ డేటా ప్రయోజనాలను అందిస్తున్నట్లు కూడా Vi ప్రకటించింది. అర్హత కలిగిన కస్టమర్ కూడా ఈ ఆఫర్‌తో వారాంతపు రోల్‌ఓవర్ ప్రయోజనాన్ని పొందుతారు.

ఐఫోన్ 13- సిరీస్ స్పెసిఫికేషన్స్
ఆపిల్ సంస్థ యొక్క నాలుగు కొత్త ఐఫోన్ మోడల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇవి ఆపిల్ యొక్క కొత్త అంతర్గత A15 బయోనిక్ SoC చేత నిర్మించబడ్డాయి. ఇందులో 6 కోర్ CPU రెండు హై-పెర్ఫార్మెన్స్ మరియు నాలుగు సమర్థవంతమైన కోర్లతో పాటు 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి. ఇవి ముందుతరం వాటితో పోలిస్తే పోటీలో పనితీరు 50 శాతం వరకు మెరుగ్గా ఉందని చెప్పబడింది. ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 13 మినీ నాలుగు కోర్ GPU తో A15 బయోనిక్ ఫీచర్ కలిగి ఉండగా, iPhone 13 Pro మరియు iPhone 13 Pro Max ఐదు ఫైర్ కోర్ ఇంటిగ్రేటెడ్ GPU ని పొందుతాయి. ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్ 2.5 గంటల మెరుగైన బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉండగా, ఆపిల్ వారి ముందుతరం వాటితో పోలిస్తే ఐఫోన్ 13 మినీ మరియు ఐఫోన్ 13 ప్రోలలో 1.5 గంటల మెరుగైన బ్యాటరీ లైఫ్ ను వాగ్దానం చేస్తుంది. ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 13 మినీ 256GB కంటే ఎక్కువ స్టోరేజ్‌తో లభ్యమవుతున్న మొట్టమొదటి నాన్-ప్రో ఐఫోన్‌లు కాగా, ఐఫోన్ 13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లు 1TB వరకు స్టోరేజ్ ఉన్న మొట్టమొదటి ఐఫోన్‌లు.


Click it and Unblock the Notifications