సరికొత్త ప్లాన్‌తో Vi అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.209కే అన్‌లిమిటెడ్ కాలర్‌ట్యూన్స్!
వొడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.209 మాత్రమే. ఇదివరకే ఉన్న రూ.199 ప్లాన్‌ను పోలి ఉన్నా, ఈ కొత్త ప్లాన్‌లో ఒక అదిరిపోయే ఎక్స్‌ట్రా ఫీచర్ ఉంది, అదే అన్‌లిమిటెడ్ కాలర్‌ట్యూన్స్.
రూ.199 ప్లాన్‌లో ఉన్న అన్ని ప్రయోజనాలు ఇందులోనూ ఉండగా, అదనంగా మీకు నచ్చిన పాటను ఎన్నిసార్లైనా మార్చుకునే వెసులుబాటు లభిస్తుంది. తరచూ కాలర్‌ట్యూన్స్ మార్చుకోవాలనుకునేవారికి ఇది నిజంగా బెస్ట్ ఛాయిస్.

* రూ.209 వర్సెస్ రూ.199 ప్లాన్
రూ.209 ప్లాన్ ఫీచర్లు చూస్తే అపరిమిత వాయిస్ కాల్స్ (Unlimited voice calls), మొత్తం 2GB డేటా, 300 SMSలు, 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలర్‌ట్యూన్స్ ఎక్సట్రాగా లభిస్తాయి.
* రూ.199 ప్లాన్ బెనిఫిట్స్
రూ.209 ప్లాన్‌లో ఉన్న అన్ని ప్రయోజనాలు ఉంటాయి. కానీ, ఇందులో కాలర్‌ట్యూన్స్ సౌకర్యం ఉండదు.
ఖర్చు విషయంలో చూస్తే, రూ.209 ప్లాన్ రోజుకు రూ.7.46 అవుతుంది, అదే రూ.199 ప్లాన్ అయితే రోజుకు రూ.7.11 మాత్రమే. కేవలం రూ.10 ఎక్స్‌ట్రా చెల్లించి, అన్‌లిమిటెడ్ కాలర్‌ట్యూన్స్ పొందవచ్చు. మీకు కాలర్‌ట్యూన్స్ అంతగా అవసరం లేదనుకుంటే, రూ.199 ప్లాన్ మరింత చీప్ ఆప్షన్ అవుతుంది.
* ఇతర ప్రీపెయిడ్ ప్లాన్స్
రూ.218 ప్లాన్ నెల రోజుల వ్యాలిడిటీ (వచ్చిన తేదీనే వచ్చే నెలలో కూడా వర్తిస్తుంది)తో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తీసుకుంటే 3GB డేటా, అపరిమిత కాల్స్ మరియు 300 SMSలు లభిస్తాయి.
రూ.289 ప్లాన్ 40 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 3GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMSలు పొందవచ్చు. దీని రోజువారీ ఖర్చు కేవలం రూ.7.23 మాత్రమే (రూ.209 ప్లాన్ కంటే తక్కువ).
* నాన్‌స్టాప్ హీరో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్లు
Vi వినియోగదారుల కోసం మరో సంచలన ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. అదే నాన్‌స్టాప్ హీరో ప్లాన్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి నిజమైన అన్‌లిమిటెడ్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్. దీని ప్రత్యేకతలు చూస్తే, అన్‌లిమిటెడ్ 4G డేటా. అంటే డేటా అయిపోయిందనే టెన్షన్ ఉండదు.
అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, SMSలు. ఎవరితోనైనా ఎంతసేపైనా మాట్లాడొచ్చు. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్స్‌కు ఉచిత యాక్సెస్. ఈ ప్లాన్ కేవలం వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ ప్లాన్ ధరలు రూ.365 నుంచి ప్రారంభమై రూ.1,198 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే అందుబాటులో ఉంది.
రూ.407 నాన్‌స్టాప్ హీరో డేటా ప్లాన్ తీసుకుంటే 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 4G డేటా, వాయిస్, రోజుకు 100 SMSలు, SunNxt సబ్‌స్క్రిప్షన్ అందుకోవచ్చు.
రూ.469 ప్లాన్ తీసుకుంటే 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 4G డేటా, వాయిస్, రోజుకు 100 SMSలు, 3 నెలలు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








