Home
News

వోడాఫోన్ ఐడియా(Vi) 180 రోజుల వాలిడిటీ ప్లాన్‌లో అద్బుతమైన ప్రయోజనాలు ఎన్నో!!

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సర్వీస్ బ్రాండ్ లలో వోడాఫోన్ ఐడియా ఒకటి. ఎయిర్‌టెల్, జియో ప్రైవేట్ టెల్కోలతో పోలిస్తే Vi కి వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉంది. మీరు Vi యొక్క సిమ్ ను ఉపయోగిస్తుంటే కనుక మిగిలిన టెల్కోలతో పోలిస్తే ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి. అయితే మీరు ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఆరు నెలలు లేదా 180 రోజుల సర్వీస్ చెల్లుబాటుతో లభించే ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేయడం కోసం చూస్తున్నట్లయితే Vi టెల్కో మీ కోసం అద్భుతమైన ప్రతిపాదనను కలిగి ఉంది.

Vi

Vi యొక్క ఈ ప్లాన్‌తో మీ యొక్క అన్ని డేటా అవసరాలు కవర్ చేయబడతాయి మరియు మీరు 4G ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రాథమిక ప్రయోజనాలను కూడా పొందుతారు. అన్నింటికంటే ముఖ్యమైనది మీరు చాలా వేగవంతమైన 4G నెట్‌వర్క్ యొక్క మద్దతును పొందుతారు. భారతీయ టెలికాం ఆపరేటర్ Vi నుండి రూ.1,197 ధర వద్ద లభించే ఈ ప్లాన్ 180 రోజులు లేదా ఆరు నెలల వాలిడిటీతో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లలో అత్యుత్తమంగా ఉంది. ఈ ప్లాన్‌తో లభించే ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా రూ.1197 ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా రూ.1197 ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ.1,197 ధర వద్ద అందించే ప్లాన్‌ 180 రోజుల సర్వీస్ వాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 1.5GB రోజువారీ డేటాను పొందుతారు. అంటే వినియోగదారులు మొత్తం వాలిడిటీ కాలంలో 270GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో వోడాఫోన్ ఐడియా(Vi) వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలు వంటి ప్రాథమిక ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా Vi Movies & TV క్లాసిక్ యొక్క అదనపు ఓవర్-ది-టాప్ (OTT) లకు ఉచిత యాక్సిస్ ప్రయోజనం కూడా ఉంది. ఇది లైవ్ టీవీ, మూవీస్, టీవీ కార్యక్రమాలు మరియు మరిన్నింటిని ప్రసారం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. Vi వినియోగదారులు కంపెనీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నేరుగా Vi Movies & TVని యాక్సెస్ చేయవచ్చు.

Binge All Night ఆఫర్‌

వోడాఫోన్ ఐడియా ఈ ప్లాన్‌తో వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు Binge All Night ఆఫర్‌లను కూడా అందిస్తుంది. ఈ రెండు ఆఫర్‌లు కంపెనీ అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల డైనమిక్‌ను మారుస్తాయి. రెండు ఆఫర్‌లు వినియోగదారుల డేటా అనుభవాన్ని పెంచే లక్ష్యంతో ఉన్నాయి. దేశంలో తన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అటువంటి ఆఫర్‌లను అందించిన ఏకైక టెలికాం ఆపరేటర్ Vi. వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఆఫర్‌తో వీకెండ్‌లలో వారాంతపు రోజుల నుండి మిగిలిపోయిన ఫెయిర్-యూసేజ్-పాలీసీ (FUP) డేటా మొత్తాన్ని ఉపయోగించుకోవడానికి Vi వినియోగదారులను అనుమతిస్తుంది. దేశంలో చాలా మంది వినియోగదారులు పని చేస్తున్నందున వారం రోజులలో 4G FUP డేటాను ఎగ్జాస్ట్ చేయరు. కానీ వారాంతాల్లో అధిక నాణ్యతతో OTT కంటెంట్‌ని ప్రసారం చేయడానికి 1.5GB రోజువారీ డేటా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారపు రోజులలో ఉపయోగించని FUP డేటాను వారాంతాల్లో ఉపయోగించుకోవచ్చు.

FUP డేటా

వోడాఫోన్ ఐడియా అందించే బింగే ఆల్ నైట్ ఆఫర్ విషయానికి వస్తే Binge All Night ఆఫర్‌తో వినియోగదారులు 12 AM మరియు 6 AM మధ్య తమకు కావలసినంత ఎక్కువ వేగవంతమైన డేటాను వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇది ప్లాన్ అందించే రోజువారీ FUP డేటాపై ఎలాంటి ప్రభావం చూపదు. కాబట్టి మీరు చేయాలనుకుంటున్న భారీ ఫైల్ డౌన్‌లోడ్ ఉంటే మీరు దానిని రాత్రి సమయంలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి వదిలివేయవచ్చు.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) 180 Days Half-Yearly Long Term Prepaid Plan Offers Amazing Benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X