వోడాఫోన్ ఐడియా 2022 బెస్ట్ సెల్లర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు!! వాటి వివరాలు

|

వోడాఫోన్ ఐడియా టెలికాం సంస్థ తన యొక్క వినియోగదారుల కోసం బెస్ట్ సెల్లర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాను విడుదల చేసింది. మీరు వోడాఫోన్ ఐడియా యొక్క సిమ్ ని ఉపయోగిస్తుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటూ మెరుగైన ప్రయోజనాలను అందిస్తూ ఉండే మరియు అధికంగా సబ్‌స్క్రయిబ్ చేయాలనుకునే ప్లాన్‌ల వివరాలను కంపెనీ తన వెబ్‌సైట్‌లో పూర్తిగా బహిర్గతం చేసింది. బెస్ట్ సెల్లర్ ప్లాన్‌ల పేరుతో జాబితా చేయబడింది. అయితే వీటిని ఎంచుకునే వ్యక్తుల సంఖ్యను కంపెనీ పేర్కొనలేదు. అందువల్ల ఇది కంపెనీ మార్కెటింగ్ జిమ్మిక్ కూడా కావచ్చు. అయితే ఈ ప్లాన్‌ల ప్రయోజనాలు ఎలా ఉన్నాయి మరియు ఇవి కొనుగోలు చేయడానికి విలువైనదేనా వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వోడాఫోన్ ఐడియా బెస్ట్ సెల్లర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు

వోడాఫోన్ ఐడియా బెస్ట్ సెల్లర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు

వోడాఫోన్ ఐడియా(Vi) కంపెనీ తన యొక్క వెబ్‌సైట్‌లో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను బెస్ట్ సెల్లర్‌గా జాబితా చేసింది. ఈ మూడు ప్లాన్‌లు వరసగా రూ.299, రూ.479 మరియు రూ.719 ధరల వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు కావడం విశేషం. ఈ ప్లాన్‌లన్నీ Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలతో లభిస్తాయి. Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలలో వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్స్ మరియు బింగే ఆల్ నైట్ వంటి మరెన్నో ఆఫర్‌లు ఉన్నాయి.

 Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు
 

Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు

వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఆఫర్‌తో వినియోగదారులు సోమవారం నుండి శుక్రవారం వరకు మిగిలిపోయిన డేటాను వీక్ ఎండ్ లో ఉపయోగించడానికి వీలును కల్పిస్తుంది. వారు కొనుగోలు చేస్తున్న డేటా కోసం ప్రీమియం చెల్లించడం ద్వారా దాని ప్రయోజనాలను పొందగలరని ఇది నిర్ధారిస్తుంది. కాబట్టి డేటా వృధా కాకుండా ఉంటుంది. అలాగే బింగే ఆల్ నైట్ ఆఫర్‌తో వినియోగదారులు ప్రతి రోజు రాత్రి 12 AM మరియు 6 AM మధ్య అపరిమిత డేటాను ఉచితంగా పొందుతారు. ఈ సమయంలో వినియోగించే డేటా మిగిలిన రోజులో కస్టమర్ కోసం FUP డేటాను ప్రభావితం చేయదు. చివరగా డేటా డిలైట్స్ ఆఫర్‌తో కస్టమర్‌లు ప్రతి నెలా 2GB అత్యవసర డేటాను అదనంగా పొందుతారు. ఈ ఎమర్జెన్సీ డేటాను రోజుకు 1GB డేటాగా రీడీమ్ చేసుకోవచ్చు.

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.299 ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.299 ప్లాన్

వోడాఫోన్ ఐడియా సంస్థ యొక్క బెస్ట్ సెల్లర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మొదటిది రూ.299 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల సర్వీస్ వాలిడిటీతో లభిస్తుంది. ఈ చెల్లుబాటు కాలంలో 1.5GB రోజువారీ డేటా, 100 SMS/రోజు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. Vi Movies & TV క్లాసిక్‌ యొక్క సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.479 ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.479 ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క బెస్ట్ సెల్లర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రెండవది రూ.479 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ లాగానే ఉంటుంది కానీ సర్వీస్ వాలిడిటీలో మార్పులు ఉంటాయి. Vi యొక్క రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా, 100 SMS/రోజు, అపరిమిత వాయిస్ కాలింగ్‌ మరియు Vi Movies & TV క్లాసిక్‌ ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా Vi Hero అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.719 ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.719 ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క బెస్ట్ సెల్లర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మూడవది రూ.719 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల సర్వీస్ వాలిడిటీతో అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలతో వస్తుంది. Vi Movies & TV క్లాసిక్ మరియు Hero అన్‌లిమిటెడ్ ప్రయోజనాలకు కూడా వినియోగదారులు ఉచిత యాక్సెస్ ను పొందుతారు.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) 2022 Best Seller Unlimited Prepaid Plans: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X