4GB రోజువారీ డేటా ప్రయోజనాలు మళ్ళి అందుబాటులోకి తెచ్చిన వొడాఫోన్ ఐడియా (Vi)

|

ఇండియాలోని మూడవ అతిపెద్ద టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ కంటే తక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది. వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం Vi టెల్కో అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నది. కరోనా సమయంలో అధిక మంది యూజర్లను ఆకట్టుకోవడం కోసం కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ లతో డబుల్ డేటా ప్రయోజనాలను అందించింది. దీనితో యూజర్లు రోజుకు 4GB డేటా ప్రయోజనాన్ని అందుకునేవారు. తరువాత ఈ డేటా ప్రయోజనాన్ని విరమించుకున్నది. అయితే ఇప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం 4GB రోజువారీ డేటా ప్లాన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకుముందు కంపెనీ డబుల్ డేటా ఆఫర్ తో దాన్ని అమలు చేసేది. ఇది నవంబర్ 2021లో టారిఫ్ పెంపు సమయంలో నిలిపివేయబడింది. కానీ ఇప్పుడు కంపెనీ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 4GB రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది.

 

Vi

వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో ఇప్పుడు కొత్తగా డేటా ప్రయోజనాలను పెంచిన రెండు ప్లాన్‌లు రూ.409 మరియు రూ.475 ధరల వద్ద లభిస్తాయి. పైన పేర్కొన్న విధంగా ఈ ప్లాన్‌ల డేటా ప్రయోజనాలను వోడాఫోన్ ఐడియా పెంచింది. ఈ రెండు ప్లాన్‌లు ఇప్పటి వరకు కూడా తన యొక్క వినియోగదారులకు అధిక మొత్తంలో డేటా ప్రయోజనాలను అందించాయి. కానీ కొత్తగా డేటా ప్రయోజనాలను సవరించిన తర్వాత ఈ ప్లాన్‌ల రోజువారీ డేటా ప్రయోజనాలు1GB వరకు పెరిగింది. ఈ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వొడాఫోన్ ఐడియా (Vi) రూ.409 ప్రీపెయిడ్ ప్లాన్ కొత్త ప్రయోజనాలు
 

వొడాఫోన్ ఐడియా (Vi) రూ.409 ప్రీపెయిడ్ ప్లాన్ కొత్త ప్రయోజనాలు

వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో రూ.409 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ అధిక మొత్తంలో డేటా అవసరాలు ఉన్న వ్యక్తులకు సరిపోయేలా కంపెనీ కొత్తగా మార్పులను చేసింది. ఈ ప్లాన్ 28 రోజుల తక్కువ వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. కానీ వినియోగదారులకు అవసరమైన అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. ఆ తర్వాత బింగే ఆల్ నైట్, వారాంతపు డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్ వంటి హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలతో పాటుగా Vi మూవీస్ & TV VIPకి కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ పాత ప్రయోజనాలు అలాగే కొనసాగుతున్నాయి. మారినది డేటా ప్రయోజనం మాత్రమే. ఇంతకుముందు ఈ ప్లాన్ రోజువారీ 2.5GB డేటాతో వచ్చేది. కానీ ఇప్పుడు డేటా ప్రయోజనం రోజుకు 1GB పెరిగి 3.5GB అందిస్తున్నది. కాబట్టి ప్రాథమికంగా వినియోగదారులు ఈ ప్లాన్‌తో మునుపటి కంటే 28GB ఎక్కువ డేటాను పొందుతున్నారు.

వొడాఫోన్ ఐడియా (Vi) రూ.475 ప్రీపెయిడ్ ప్లాన్ కొత్త ప్రయోజనాలు

వొడాఫోన్ ఐడియా (Vi) రూ.475 ప్రీపెయిడ్ ప్లాన్ కొత్త ప్రయోజనాలు

వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో రూ.475 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క సరికొత్త మార్పుల తరువాత అధిక మొత్తంలో డేటా అవసరాలున్న వినియోగదారులకు ఇది గొప్ప ఆఫర్ గా ఉంది. ముఖ్యంగా ఈ ప్లాన్‌కి డేటా బంప్ అయిన తర్వాత ఇది వినియోగదారులకు సూపర్ ట్రీట్ అవుతుంది. వోడాఫోన్ ఐడియా యొక్క ఈ ప్లాన్‌తో వినియోగదారులకు Vi మూవీస్ & TV VIP లకు ఉచిత యాక్సెస్‌తో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అయితే ముందు అందిస్తున్న 3GB రోజువారి డేటా ప్రయోజనం ఇప్పుడు 4GB కి పెరిగింది. అంటే ఈ రెండు ప్లాన్‌లతో అందించే మొత్తం డేటా 28GB పెరిగింది. ఇది ప్లాన్ డేటా ధరను గణనీయంగా తగ్గిస్తుంది.

వొడాఫోన్ ఐడియా (Vi)

వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో ఇండియాలోని టెలికాం పరిశ్రమలో వినియోగదారులకు 4GB రోజువారీ డేటాను అందించే ఏకైక ఆపరేటర్‌గా అవతరించింది. అయితే 4GB రోజువారీ డేటా ప్రయోజనంతో లభించే ఈ రెండు ప్లాన్‌లు 28 రోజుల స్వల్ప వ్యాలిడిటీతో మాత్రమే వస్తాయి. కాబట్టి తమ బడ్జెట్‌లపై అవగాహన ఉన్న వినియోగదారులకు ఇవి ఖచ్చితంగా సరైన ప్లాన్‌లు కావు. ఇప్పటికీ ఇంటి వద్ద నుండి పనిచేసే వారు ఇంటర్నెట్ కోసం బ్రాడ్‌బ్యాండ్ ని వినియోగించడం ఉత్తమం. బ్రాడ్‌బ్యాండ్ వినియోగించే వారికి మొబైల్ డేటాతో అసలు పనేలేదు. అటువంటి వారు బయట సమయంలో ఇంటర్నెట్ ని తమ మొబైల్ ఫోన్ లో వినియోగించడానికి 1GB లేదా 1.5GB రోజువారి డేటా ప్లాన్లు సరిపోతాయి. దీనితో వినియోగదారులు బడ్జెట్ ప్లాన్ లను ఎంచుకుంటే సరిపోతుంది.

Vi 1.5GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

Vi 1.5GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.299 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ కాలానికి అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా వీకెండ్ డేటా రోల్‌ఓవర్, బింగే ఆల్ నైట్ మరియు డేటా డిలైట్ వంటి Vi హీరో యొక్క అన్‌లిమిటెడ్ ప్రయోజనాలకు కూడా వినియోగదారులు అదనంగా యాక్సెస్ ను పొందుతారు. ఈ ప్లాన్‌తో అదనంగా Vi మూవీస్ & TV క్లాసిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ. 299 ప్లాన్‌కు సమానంగా అందించే మరొక ప్లాన్ రూ.479 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు కాలానికి అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. రెండు ప్లాన్‌ల మధ్య అదనపు ప్రయోజనాలు పూర్తిగా ఒకేలా ఉంటాయి. అలాగే రూ.666 ధర వద్ద లభించే ప్లాన్ అదే ప్రయోజనాలతో 77 రోజుల చెల్లుబాటు కాలానికి అందుబాటులో ఉంటుంది. జియో టెల్కో తన 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌ను 84 రోజుల పాటు అందిస్తుంది. మీరు Vi నుండి 1.5GB రోజువారీ డేటాతో 84 రోజుల ప్లాన్‌ను పొందాలనుకుంటే మీరు రూ.719 చెల్లించాలి. అన్ని ప్లాన్‌ల మాదిరిగానే Vi యొక్క రూ. 666 మరియు రూ.719 ప్లాన్‌లు కూడా రూ.219 ప్లాన్ అందించే అదే అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.

అగ్నివీర్ కోర్సు మెటీరియల్‌ వోడాఫోన్ ఐడియా(Vi) యాప్‌లో

అగ్నివీర్ కోర్సు మెటీరియల్‌ వోడాఫోన్ ఐడియా(Vi) యాప్‌లో

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో తన మొబైల్ యాప్‌లో కొన్ని నెలల క్రితం కొత్తగా జాబ్ పోర్టల్‌ను ప్రకటించింది. Vi యాప్‌లోని Vi జాబ్స్ & ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్ విభాగం అనేది భారతదేశంలో ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు సహాయపడటానికి రూపొందించబడింది. ఇప్పుడు ఈ యాప్‌లోని జాబ్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారుల కోసం అగ్నివీర్ కోర్సు మెటీరియల్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అగ్నివీర్ టెస్ట్ సిరీస్‌ను నిర్వహించడానికి డెహ్రాడూన్‌కు చెందిన క్యాడెట్స్ డిఫెన్స్ అకాడమీ నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. వోడాఫోన్ ఐడియా (Vi) యాప్‌లో గల మెటీరియల్‌ విషయానికి వస్తే అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ X గ్రూప్, అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ Y గ్రూప్, అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ X & Y గ్రూప్, అగ్నివీర్ నేవీ MR మరియు అగ్నివీర్ నేవీ SSR కోసం ఒక్కొక్కటి 15 టెస్ట్‌లతో కూడిన మొత్తం ఐదు టెస్ట్ సిరీస్‌లు ఉన్నాయి. ఆర్మీ టెస్టు సిరీస్‌ను ఈ నెలాఖరులోగా చేర్చనున్నట్లు కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Bring Back 4GB Daily Data Benefits Prepaid Plan: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X