Home
News

Vodafone Idea Vi కాలర్‌ట్యూన్ యాప్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు!!!

వోడాఫోన్ ఐడియా టెలికాం ఆపరేటర్‌ను కొనసాగిస్తూన్నట్లు తెలియజేయడానికి రీబ్రాండింగ్ స్ప్రీ 'Vi కాలర్‌ట్యూన్స్' అనే అప్‌డేటెడ్ కాలర్ ట్యూన్ యాప్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారుల కోసం ఈ కొత్త అప్లికేషన్ ప్రారంభించబడింది. మొదట Vi యాప్ ఆపిల్ యాప్ స్టోర్ లో ప్రారంభించింది. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో కూడా ప్రారంభించబడింది. దీని యొక్క పేరు సూచించినట్లుగా వోడాఫోన్ ఐడియా చందాదారులు కాలర్ ట్యూన్ ను సెట్ చేయడానికి అనుమతిస్తుంది. హోమ్ స్క్రీన్‌లో నాలుగు ట్యాబ్‌లతో అప్లికేషన్ చాలా చక్కగా ఇంటర్‌ఫేస్ ను కలిగి ఉంటుంది. వోడాఫోన్ ఐడియా నుండి కాలర్ ట్యూన్ ప్లాన్ కేవలం 49 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi కాలర్‌ట్యూన్ యాప్ ఫీచర్స్

Vi కాలర్‌ట్యూన్ యాప్ ఫీచర్స్

Vi కాలర్‌ట్యూన్ యాప్ తక్కువ డేటా స్పీడ్ వద్ద కూడా ఉపయోగించడానికి సులభమైన ఇంటర్ఫేస్ ను కలిగి ఉంది. మీరు యాప్ ను డౌన్‌లోడ్ చేసి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్‌లో హోమ్, స్టోర్, యాక్టివిటీ మరియు ప్రొఫైల్‌ వంటి నాలుగు ఎంపికలు అందించబడతాయి. హోమ్ విభాగంలో ట్రెండింగ్, ప్రొఫైల్ ట్యూన్స్, నేమ్ ట్యూన్స్ వంటి మరిన్ని విభాగాలు ఉన్నాయి.

Vi కాలర్‌ట్యూన్ యాప్ ప్రత్యేకతలు

Vi కాలర్‌ట్యూన్ యాప్ ప్రత్యేకతలు

స్టోర్ విభాగంలో అన్ని రకాల కాలర్ ట్యూన్లను కలిగి ఉంటాయి. ఇవి రోజుకు మీ ట్యూన్స్ వంటి విభాగాలను ఉపయోగించి సులభంగా బ్రౌజ్ చేయవచ్చు. యాక్టివిటీ  విభాగంలో మీరు ప్రస్తుతం మరియు గతంలో సెట్ చేసిన కాలర్ ట్యూన్‌లను చూడవచ్చు. ప్రొఫైల్ విభాగంలో ప్లాన్ యొక్క  ప్రాప్తిని తెలుసుకోవచ్చు మరియు ఇందులో ఎంచుకోవడానికి నాలుగు ఎంపికలు ఉన్నాయి.

Vi కాలర్‌ట్యూన్ నెలవారి ప్లాన్ ల వివరాలు

Vi కాలర్‌ట్యూన్ నెలవారి ప్లాన్ ల వివరాలు

Vi కాలర్‌ట్యూన్ యొక్క ప్లాన్ ల విషయానికి వస్తే దీని యొక్క ప్లాన్లు రూ .49 నుండి ప్రారంభమై రూ.249 వరకు ఉంటాయి. రూ.49, రూ .69, రూ .99 మరియు రూ .249 ధరల వద్ద దీని యొక్క ప్లాన్లు లభిస్తాయి. రూ.49 ధర వద్ద లభించే కాలర్ ట్యూన్ ప్లాన్ 50 కాలర్ ట్యూన్లను ప్రీపెయిడ్ యూజర్లకు నాలుగు వారాల పాటు మరియు పోస్ట్ పెయిడ్ యూజర్లకు 30 రోజుల పాటు ఉచితంగా అందిస్తుంది.

Vi కాలర్‌ట్యూన్ లాంగ్ టర్మ్ ప్లాన్ ల వివరాలు

Vi కాలర్‌ట్యూన్ లాంగ్ టర్మ్ ప్లాన్ ల వివరాలు

రూ.69 ప్లాన్ వినియోగదారులకు అపరిమిత కాలర్ ట్యూన్‌లను అందిస్తుంది. అయితే ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు పైన పేర్కొన్న విధంగానే చెల్లుబాటు ఉంటుంది. రూ.99 ధర వద్ద లభించే Vi కాలర్‌ట్యూన్ 100 కాలర్ ట్యూన్‌లను మూడు నెలల చెల్లుబాటు కాలానికి ఉచితంగా అందిస్తుంది. చివరగా రూ.249 ధర వద్ద లభించే Vi కాలర్‌ట్యూన్ ప్యాక్ చందాదారులకు 250 కాలర్ ట్యూన్లను ఒక సంవత్సరం చెల్లుబాటుతో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea Vi Callertunes New App Features and Plans Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X