వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ టారిఫ్ లు మరోసారి పెరగనున్నాయి!!

|

ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో తమ యొక్క ప్రీపెయిడ్ టారిఫ్ పెంపులను ప్రవేశపెట్టి వినియోగదారులకు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. అయితే వోడాఫోన్ ఐడియా(Vi) సంస్థ 2022 లేదా 2023లో మరో రౌండ్ ప్రీపెయిడ్ టారిఫ్ పెంపుదలకు వెళ్లాలని యోచిస్తోందని కంపెనీ CEO రవీందర్ టక్కర్ ఎర్నింగ్ కాల్ సందర్భంగా తెలిపారు. ఈ కంపెనీ తమ యొక్క యూజర్లకు రూ.99 ధర వద్ద నుండి ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్నది. అయితే ఇది 4G వినియోగదారులకు ఖరీదైన ఎంపిక కాదని కంపెనీ అభిప్రాయపడింది. మార్కెట్ స్పందన ప్రకారమే కొత్త ధరలు ఎంతమేర పొందుపరచబడుతున్నాయి అనే దానిపై ఆధారపడి 4G ప్లాన్‌ల కోసం మరో ప్రీపెయిడ్ టారిఫ్ పెంపు 2022 లేదా 2023లో వస్తుందా అనే దానిపై టెల్కో తమ అభిప్రాయం తీసుకోనున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వోడాఫోన్ ఐడియా (Vi) సబ్‌స్క్రైబర్ చర్న్ రేట్

వోడాఫోన్ ఐడియా (Vi) సబ్‌స్క్రైబర్ చర్న్ రేట్

వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క సబ్‌స్క్రైబర్ చర్న్ రేట్ ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. Q3 FY22 కోసం టెల్కో విడుదల చేసిన నివేదిక ప్రకారం Q2 FY22లో 2.9%తో పోలిస్తే సబ్‌స్క్రైబర్ చర్న్ రేటు 3.4%గా ఉంది. 4G నెట్‌వర్క్‌లు మరియు సేవల కోసం రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ యొక్క కాపెక్స్ స్థాయిలను సరిపోల్చడానికి వోడాఫోన్ ఐడియాకి అవసరమైన మార్గాలు లేనందున Q4 FY22లో ఈ సంఖ్య సమానంగా ఉండాలి. టారిఫ్ పెంపుదల కంపెనీకి సగటు ఆదాయాన్ని (ARPU) Q2 FY22లో రూ.109 నుండి Q3 FY22లో రూ.115కి పెంచడంలో సహాయపడనున్నది. అయితే చందాదారులు టెల్కో నెట్‌వర్క్‌ల నుండి ఇతర నెట్‌వర్క్‌లకు చాలా వేగంగా మారుతున్నారు.

ARPU
 

వోడాఫోన్ ఐడియా (Vi)కి దాని నెట్‌వర్క్‌లలో పెట్టుబడి పెట్టడానికి నిధులు కావాలి. దాని కోసం టెల్కో ఇప్పటికే సంభావ్య పెట్టుబడిదారులతో మాట్లాడుతోంది మరియు ప్రమోటర్లు కూడా భవిష్యత్తులో కొంత డబ్బును పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. PTI నివేదిక ప్రకారం ప్రీపెయిడ్ టారిఫ్ పెంపుల మధ్య రెండేళ్ల గ్యాప్ ఉంది. అయితే ఇది చాలా పొడవుగా ఉందని టక్కర్ చెప్పారు. కానీ ఈసారి కంపెనీ 2022 లేదా 2023లో ఏది సరైనదనిపిస్తే అది ప్రీపెయిడ్ టారిఫ్‌ల పెంపుతో ముందుకు సాగడానికి సరైన సమయాన్ని ఇప్పటికే గమనిస్తోంది. ARPUని 1.9x పెంచడం కోసం వోడాఫోన్ ఐడియాకి మరో రౌండ్ టారిఫ్ పెంపుదల అవసరమని మోతీలాల్ ఓస్వాల్ ఇప్పటికే చెప్పారు. ముందు ముందు ఎటువంటి పెరుగుదలను అందుకోనున్నదో చూడాలి.

Vi REDX ప్లాన్‌లు

Vi REDX ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో దాని REDX ప్లాన్‌ల విభాగంలో వినియోగదారులకు మూడు విభిన్న రకాల ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో మొదటి ప్లాన్ వ్యక్తిగత వినియోగదారులకు అందుబాటులో ఉండి నెలకు రూ.1,099 ధర ట్యాగ్‌తో లభిస్తుంది. అలాగే Vi అందించే రెండవ REDX ప్లాన్ ముగ్గురు కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలను ముగ్గురు కుటుంబ సభ్యులు ఒకే ధర ట్యాగ్ కింద ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ధర నెలకు రూ.1,699. జాబితాలో చివరిది రూ.2,299 ధర వద్ద లభించే REDX ప్లాన్. ఇది ఐదుగురు కుటుంబ సభ్యులను ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో కనెక్ట్ చేయడానికి కొనుగోలు చేయవచ్చు. వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో యొక్క REDX ప్లాన్‌లలో అత్యంత ఆకర్షణీయమైన అంశం అయిన వాటి ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్‌లు నిజంగా అపరిమిత హై-స్పీడ్ డేటాతో వస్తాయి. అంతేకాకుండా REDX ప్లాన్ యాక్టివేట్ అయ్యే వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబడవు. అంతేకాకుండా REDX ప్లాన్ యాక్టివేట్ చేయబడిన కాలంలో ప్లాన్‌లు అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తాయి. REDX తన వినియోగదారులకు US & కెనడా @50p/min, చైనా & HK @Rs.2/min, UK & బంగ్లాదేశ్ @ రూ.3/నిమి, ఆస్ట్రేలియా/ భూటాన్/ జర్మనీ/ కువైట్//పాకిస్తాన్/సింగపూర్/థాయిలాండ్ @ రూ.5/నిమి మరియు మలేషియాతో సహా 14 దేశాలకు ప్రత్యేక కాలింగ్ రేట్లను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea (Vi) CEO Says Prepaid Tariffs Will Go Up Again in 2022 or 2023

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X