Vodafone Idea(Vi) డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లలో మార్పులు గమనించారా!!!
ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి తన వినియోగదారులకు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 'డబుల్ డేటా ఆఫర్' ను అందిస్తుంది. అయితే భారతీయ టెలికాం స్థలంలో మరే ఇతర ఆపరేటర్ తమ వినియోగదారులకు అలాంటి ఆఫర్‌ను అందించలేదు. డబుల్ డేటా ఆఫర్ కింద వినియోగదారుడు ప్రస్తుతం వారి రోజువారీ డేటా మొత్తంలో రెట్టింపు డేటాను అందిస్తుంది. ఉదాహరణకు వినియోగదారులు ఎవరైనా తమ ప్లాన్‌తో 1.5GB రోజువారీ డేటాను అందుకుంటూ ఉంటే కనుక ఈ డబుల్ డేటా ఆఫర్‌లో భాగంగా 1.5GB రోజువారీ డేటాకు బదులుగా వినియోగదారులు 3GB రోజువారీ డేటాను అందుకుంటారు. ఈ ఆఫర్ అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్‌లతో మాత్రమే ఉంటుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లు
వోడాఫోన్ ఐడియా (Vi) టెలికాం సంస్థ రూ.299, రూ.449, రూ.699 ధర వద్ద గల మూడు ప్లాన్‌లతో కంపెనీ ఇప్పుడు డబుల్ డేటాను అందిస్తోంది. ఇంతకు ముందు ఐదు ప్లాన్‌లతో ఈ డబుల్ డేటా ఆఫర్ ను అందించేది. రూ.299 ధర వద్ద లభించే ఈ ప్లాన్ వినియోగదారులకు అందించే 2GB రోజువారి బేస్ డేటాకు అదనంగా మరొక 2GB అదనపు డేటాను అందిస్తుంది. వీటితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది వొడాఫోన్ ప్లే మరియు Zee5 లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

Vi రూ.449 డబుల్ డేటా ఆఫర్ ప్లాన్
వోడాఫోన్ ఐడియా(Vi) సంస్థ వినియోగదారులకు డబుల్ డేటా ఆఫర్ కింద రూ.449 ధర వద్ద లభించే ప్లాన్‌లో కూడా అందిస్తున్నది. ఈ ప్లాన్ కూడా ముందు అందిస్తున్న 2GB డేటాకు అదనంగా మరొక 2GB అదనపు హైస్పీడ్ డేటాను అందిస్తున్నది. అంటే ఈ ప్లాన్‌పై వినియోగదారులు ఒక రోజుకు 4GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 56రోజులు. ఈ ప్లాన్ కూడా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలతో పాటుగా వినియోగదారులు Vi మూవీస్ & టీవీ యొక్క OTT సభ్యత్వాన్ని ఉచితంగా పొందుతారు.

Vi రూ.699 డబుల్ డేటా ఆఫర్ ప్లాన్
వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో డబుల్ డేటా ఆఫర్ ను అందిస్తున్న చివరి ప్లాన్ రూ.699 ధర వద్ద లభించే ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వినియోగదారులకు ‘డబుల్ డేటా ఆఫర్'ను ఇస్తుంది. ఇది పైన పేర్కొన్న ఇతర ప్లాన్‌ల మాదిరిగానే 4GB రోజువారీ డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటితో పాటు Vi మూవీస్ & టీవీ ప్లాట్‌ఫాం యొక్క చందాకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఏదేమైనా ఈ ప్లాన్ 84 రోజుల పొడవైన యాక్సిస్ ను కలిగి ఉంది.

Vi వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాలు
‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ప్రయోజనం వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రస్తుతం అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రయోజనం రూ.249 మరియు అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్‌తో రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది అని గమనించాలి. ఉదాహరణకు వినియోగదారుడు అతను / ఆమె ఎవరైనా 2GB రోజువారీ డేటాను అందించే ప్లాన్‌తో రీఛార్జ్ చేసినప్పుడు సోమవారం 2GB లో 1GB మాత్రమే ఉపయోగించారు అనుకోండి. తరువాతి రోజులలో కూడా అదే మొత్తంలో డేటాను వినియోగించినప్పుడు వీకెండ్ లో వినియోగదారుడు రోజువారీ కోటా కంటే అధికంగా 5GB అదనపు డేటాను డౌన్‌లోడ్ చేయడానికి మరియు ప్రసారం చేయడానికి పొందవచ్చు.

Vi డబుల్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లలో వీకెండ్ డేటా రోల్‌ఓవర్
VI(వోడాఫోన్ ఐడియా) యొక్క డబుల్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లకు సభ్యత్వం పొందిన వినియోగదారులు వారంలో సేకరించిన డేటా ప్రయోజనాన్ని కూడా వీకెండ్ లో పొందుతారు. ఒకవేళ వినియోగదారుడి ప్లాన్ గడువు ముగియబోతున్నట్లయితే వినియోగదారుడి అకౌంటులో పేరుకుపోయిన డేటాను అలాగే ఉంచడానికి ఎటువంటి ఆలస్యం లేకుండా మళ్ళీ రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. అర్హత గల కొత్త ప్లాన్ రీఛార్జికి మరియు పాత ప్లాన్ గడువుకు మధ్య అంతరం ఉంటే సేకరించిన డేటా పూర్తిగా తొలగించబడుతుంది అని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications








