Home
News

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి....

భారతదేశంలో ప్రైవేట్ టెలికాం సంస్థలలో ఒకటైన మరియు మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వోడాఫోన్ ఐడియా(Vi) టారిఫ్ల పెంపు తరువాత కొద్దీగా యూజర్ బేస్ ని కోల్పోయింది. ఇప్పుడు ఉన్న యూజర్ల కోసం మరియు కొత్త వారిని ఆకట్టుకోవడానికి ప్రస్తుతం ఉన్న గొప్ప ప్లాన్ లకు జోడింపుగా కొత్తగా ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. Vi టెల్కో మరింత సరసమైన తక్కువ ధరలో ఎంచుకోవడానికి ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ప్లాన్‌లను విడుదల చేసాయి. టెల్కో అధికంగా దృష్టి సారించిన ఆఫర్‌ల జోడింపులో కొత్త ప్లాన్‌లు రూ.29, రూ.39, రూ.98, రూ.195 మరియు రూ.319 ధరల లభిస్తున్నాయి. ఈ ప్లాన్‌లు వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తున్నదో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా రూ. 29 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ. 29 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో కొత్తగా రూ.29 ధర వద్ద అందించే ప్లాన్ FUP డేటా అయిపోయినప్పుడు ఉపయోగించబడే 4G డేటా వోచర్. రూ.29 ధర వద్ద లభించే ఈ ప్లాన్‌తో వినియోగదారులు 2 రోజుల చెల్లుబాటుతో 2GB FUP డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌తో వినియోగదారులు దీనికి మించి ఎటువంటి ప్రయోజనాలను పొందలేరు.

వోడాఫోన్ ఐడియా రూ.39 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ.39 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో కొత్తగా రూ.39 ధర వద్ద 4G డేటా వోచర్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 7 రోజుల చెల్లుబాటుతో 3GB FUP డేటాను మాత్రమే పొందుతారు.

ఈ రెండు డేటా వోచర్‌లు అన్ని సర్కిల్‌లలో అందుబాటులో లేవని గుర్తుంచుకోండి. కంపెనీ వెబ్‌సైట్‌లో గుజరాత్ సర్కిల్‌లోని యూజర్లు ఇప్పటికి ఈ ప్లాన్‌లను గమనించవచ్చు. ఈ రెండు డేటా వోచర్‌లు (రూ. 29 మరియు రూ. 39) అన్ని సర్కిల్‌లలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అన్న దానిపై సరైన వివరణ లేదు.

 

వోడాఫోన్ ఐడియా రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ.98 ధర వద్ద ప్రవేశపెట్టిన ప్లాన్‌ ఆసక్తికరంగా రెండు వేర్వేరు సర్కిల్‌లలో విభిన్న ప్రయోజనాలతో లభిస్తుంది. గుజరాత్‌ సర్కిల్‌లో ఈ కొత్త 4G డేటా వోచర్ ప్లాన్ 21 రోజుల చెల్లుబాటు కాలానికి 9GB డేటాను అందిస్తుంది. కానీ మహారాష్ట్ర మరియు గోవా సర్కిల్‌లలో ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 200MB డేటా ప్రయోజనాలతో 15 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది.

వోడాఫోన్ ఐడియా రూ. 195 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ. 195 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల జోడింపులో రూ.195 ధర వద్ద లభించే ప్లాన్‌తో వినియోగదారులు 2GB FUP డేటా, 300 SMSలు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను 31 రోజుల చెల్లుబాటుతో పొందుతారు. ఈ ప్లాన్ అదనంగా Vi మూవీస్ & TV Basic యొక్క అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా రూ. 319 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ. 319 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల జోడింపులో చివరిది రూ.319 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌ 31 రోజుల చెల్లుబాటుతో అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు 2GB రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా ఇది Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటిలో ముఖ్యంగా బింగే అల్ నైట్, డేటా రోల్ ఓవర్ మరియు డేటా డిలైట్ ఆఫర్‌ను కూడా అందిస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Introduced Five New Prepaid Plans: Here are The Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X