Wi-Fi కాలింగ్ సర్వీసును ప్రారంభించిన వోడాఫోన్ ఐడియా (Vi)
ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలు జియో మరియు ఎయిర్‌టెల్ ఇప్పటికే Wi-Fi కాలింగ్ సర్వీసును ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు ఈ సర్వీస్ అందుబాటులో లేదు. చాలా కాలం నుంచి Wi-Fi కాలింగ్ సర్వీస్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఒక సంవత్సరం ఆలస్యం తరువాత ఎట్టకేలకు నేడు శుభవార్తను అందించింది. అయితే Vi యొక్క Wi-Fi కాలింగ్ సర్వీస్ ప్రస్తుతానికి మహారాష్ట్ర & గోవా మరియు కోల్‌కతా రెండు సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉండనున్నది. ఈ సర్వీసును ఇతర సర్కిల్‌లలో దశలవారీగా ప్రారంబించనున్నట్లు సంస్థ తెలిపింది. వైర్‌లెస్ కనెక్షన్ ద్వారా వాయిస్ కాల్స్ చేయడానికి మరియు స్వీకరించడానికి వినియోగదారులను అనుమతించే Wi-Fi కాలింగ్ సర్వీస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi Wi-Fi కాలింగ్ సర్వీస్ ప్రారంభం
వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క Wi-Fi కాలింగ్ సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్‌లో Vi కంపెనీ కస్టమర్ సపోర్ట్ బృందం ధృవీకరించింది. వై-ఫై కాలింగ్ అనేది మీ ఇంటి బ్రాడ్‌బ్యాండ్, ఆఫీస్ బ్రాడ్‌బ్యాండ్ లేదా పబ్లిక్ వై-ఫై వంటి వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా వాయిస్ కాల్స్ చేయడానికి మరియు స్వీకరించడానికి మిమ్మల్ని అనుమతించే గొప్ప సర్వీస్. తక్కువ నెట్‌వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో కూడా వాయిస్ కాల్స్ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఇది ప్రస్తుతానికి మహారాష్ట్ర & గోవా, కోల్‌కతా సర్కిల్‌లలో మాత్రమే డిసెంబర్ 15, 2020 నుండి అందుబాటులో ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో కొంతకాలంగా వై-ఫై కాలింగ్ సర్వీసును ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నందున ఈ వార్తలో ఆశ్చర్యం కలిగించవలసిన విషయం ఏమి లేదు. వాస్తవానికి ఈ సర్వీస్ ముందుగా అందుబాటులోకి వచ్చి ఉండవలసినది అని భావిస్తున్నారు. 2019 ప్రారంభంలో Vi వై-ఫై కాలింగ్ ఫీచర్‌ను ఇతర టెల్కోలు ప్రారంభించాయి.


Click it and Unblock the Notifications








