Home
News

Vodafone Idea(Vi) ఉపయోగకరమైన లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ డొమైన్‌లో వినియోగదారులకు అనేక రకాల ప్లాన్‌లను అందిస్తోంది. యూజర్లు డేటా కోసం ప్రత్యేకంగా లభించే డేటా ప్లాన్ లు మరియు వాయిస్-ఓన్లీ ప్లాన్‌లకు అదనంగా వివిధ రకాల ప్రయోజనాలతో లభించే అపరిమిత వాయిస్ మరియు డేటా ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. Vi టెల్కో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ప్రతి నెల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడని వారికి అందుబాటులో లాంగ్ టర్న్ ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇవి అపరిమిత డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు కొన్ని ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలతో లభిస్తాయి. రూ.1,197, రూ.1,499, రూ.2,399, మరియు రూ.2,595 ధరల వద్ద లభించే దీర్ఘకాలిక ప్లాన్‌లు వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తున్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఉత్తమమైనది రూ.1,197 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 180 రోజులు అంటే 6 నెలల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్ మరియు Vi మూవీస్ & టీవీ యొక్క OTT ప్రయోజనంతో వస్తుంది. అయితే రెండవ ఉత్తమమైన ప్లాన్ రూ.1,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 365 రోజులు (1-సంవత్సరం) చెల్లుబాటుతో వస్తుంది. ఇది Vi మూవీస్ & టీవీకి ఉచిత చందాతో పాటు 24GB డేటాను మాత్రమే అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ నుండి లభించే ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2,399 ధర వద్ద లభిస్తుంది. ఇది రీఛార్జ్ చేసిన తేదీ నుండి 365 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దానితో పాటు మీరు ప్రతిరోజూ 1.5GB డేటా ప్రయోజనంను కూడా పొందుతారు. ఇది అర్ధరాత్రి రీసెట్ అవుతుంది. ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది మీకు 499 రూపాయల విలువ గల వోడాఫోన్ ప్లే మరియు 999 రూపాయల విలువైన ZEE5 చందాను ఉచితంగా అందిస్తుంది.

లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా యొక్క ఉత్తమమైన లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో చివరిది రూ.2,595 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను 365 రోజులు (1-సంవత్సరం) చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఈ ప్లాన్ ZEE5 ప్రీమియం యొక్క OTT ప్రయోజనంతో 1 సంవత్సరానికి Vi మూవీస్ & టీవీ అనువర్తనానికి ఉచిత యాక్సిస్ తో వస్తుంది. ఇది ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్‌ను కూడా ప్యాక్ చేస్తుంది.

వాయిస్ కాలింగ్

పైన తెలిపిన అన్ని ప్లాన్‌లు వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తున్నాయి. అయితే రూ.1499 ప్లాన్ వినియోగదారులకు మొత్తం చెల్లుబాటులో 3,600 SMS‌లను అందిస్తుంది. ఇంకా రూ.1,499 ప్లాన్ మాత్రమే Vi నుండి ‘బింగే ఆల్ నైట్' ప్రయోజనం పొందదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Long Term Prepaid Plans: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X