వొడాఫోన్ ఐడియా(Vi) నెట్‌వర్క్ కెపాసిటీ గతంతో పోలిస్తే 2.9 రెట్లు ఎక్కువగా ఉంది!!

|

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలు తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ డేటా వినియోగం కోసం డిమాండ్ గణనీయంగా పెరగడంతో వారి అవసరాల దృష్ట్యా వారికి భారీ మొత్తంలో డేటాను అందిస్తూ వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల ముందు వరకు కేవలం ఫోన్ కాల్స్ కోసం మాత్రమే మొబైల్ లను ఉపయోగించే వారు. తరువాత చాలా మంది వ్యక్తులు వినోదంతో పాటుగా ఇతర విషయాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో మొబైల్ నెట్‌వర్క్‌లు తరచుగా రద్దీగా మారుతూ వచ్చాయి. అయితే ప్రైవేట్ టెల్కోలు అన్ని కూడా 2G నుండి 3G కి తరువాత 4G కి తమని తాము అప్ డేట్ చేసుకుంటూ నెట్‌వర్క్‌ సామర్ధ్య పరిమితిని పెంచుకుంటూ వస్తున్నాయి.

 

Vi

దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వోడాఫోన్ ఐడియా (Vi) సెప్టెంబర్ 2018 సమయంలో ఉన్న తన యొక్క నెట్‌వర్క్ సామర్ధ్యంతో పోలిస్తే ప్రస్తుత సామర్థ్యాన్ని 2.9 రెట్లు పెంచుకున్నట్లు పేర్కొంది. Vi నెట్‌వర్క్‌లతో రద్దీ తక్కువగా ఉండడంతో 4G కోసం 3G స్పెక్ట్రమ్‌ను రీఫార్మ్ చేయడానికి టెల్కో చాలా పెద్ద ఆపరేషన్‌ను నిర్వహించింది. ఇది టెల్కో వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో సహాయపడింది. అయితే ఇప్పుడు 4G కోసం పునర్మించబడిన సబ్-GHz స్పెక్ట్రమ్‌తో 4G నెట్‌వర్క్ సేవలను అందించడానికి కూడా వీలు కల్పించింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నెట్‌వర్క్ పనితీరు

వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క మెరుగైన నెట్‌వర్క్ పనితీరును గత సంవత్సరంలో వివిధ ప్రపంచ మరియు భారతీయ నెట్‌వర్క్ టెస్టింగ్ ఏజెన్సీలచే స్థిరంగా ఆమోదించబడింది. Vi తన పాన్-ఇండియా 4G నెట్‌వర్క్‌లో అత్యంత వేగవంతమైన 4G డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ స్పీడ్‌లను అందించడంతో పాటుగా నేటికి అదే విధానాన్ని కొనసాగిస్తుంది. ఇది వినియోగదారులు పని చేయడానికి, అధ్యయనం చేయడానికి, సాంఘికీకరించడానికి, వినోదం, ఇ-కామర్స్ మరియు ఇతర డిజిటల్ సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. నవంబర్ 2020 మరియు జూన్ 2022 మధ్య 20 నెలలలో 17 నెలలకు TRAI యొక్క "MyCall" యాప్ డేటా ప్రకారం ఇది దేశంలోనే వాయిస్ కాల్ నాణ్యతలో అత్యధికంగా రేట్ చేయబడింది.

Vi చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్
 

వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ పనితీరుపై కంపెనీ యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ ఇలా అన్నారు "వివిధ థర్డ్ పార్టీ టెస్టింగ్ ఏజెన్సీలచే అత్యుత్తమ డేటా మరియు వాయిస్ క్వాలిటీ నెట్‌వర్క్‌ల విషయంలో Vi నిలకడగా ర్యాంక్ ను కలిగి ఉంది. ఇది మా వినియోగదారులకు ముఖ్యంగా హైబ్రిడ్ వాతావరణంలో పనిచేసే వారికి అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడానికి మా నెట్‌వర్క్ ఇంజనీర్‌లు మరియు మా టెక్నాలజీ జోక్యాల ధృవీకరణ మెరుగ్గా ఉంది. మేము మా 4G జనాభా కవరేజీని పెంచాము, మా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాము మరియు దేశంలోని అనేక మార్కెట్‌లలో ఇండోర్ 4G కవరేజీని మెరుగుపరచడానికి వివిధ కార్యక్రమాలను రూపొందించాము. జీవితంలో మరింత ముందుకు సాగడానికి, అభివృద్ధి చెందడానికి మరియు మెరుగైన రేపటిని నిర్మించుకోవడానికి మా కస్టమర్‌లకు ప్రపంచ స్థాయి డిజిటల్ అనుభవాలను అందించడానికి Vi కట్టుబడి ఉంది."

Vi 5G నెట్‌వర్క్‌

Vi 5G నెట్‌వర్క్‌

5G నెట్‌వర్క్‌ను తన యొక్క వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొనిరావడం కోసం Vi సంస్థ ఇటీవల ముఖ్యమైన 17 సర్కిల్‌లలో మిడ్-బ్యాండ్ 5G స్పెక్ట్రమ్ (3300 MHz బ్యాండ్) మరియు 16 సర్కిల్‌లలో mmWave 5G స్పెక్ట్రమ్ (26 GHz బ్యాండ్)ని కొనుగోలు చేసింది. ఇది Vi కస్టమర్‌లకు అత్యుత్తమ 5G నెట్‌వర్క్‌ అనుభవాన్ని అందించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఎంటర్‌ప్రైజ్ ఆఫర్‌లను బలోపేతం చేయడంతోపాటు అభివృద్ధి చెందుతున్న 5G యుగంలో వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలను అందిస్తుంది.

Vi టారిఫ్ పెంపు అమలు

Vi టారిఫ్ పెంపు అమలు

ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల యొక్క పెట్టుబడిదారులకు లేదా వినియోగదారులకు టారిఫ్ పెంపు అనేది ఆశ్చర్యం కలిగించకూడదు ఎందుకంటే ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) రెండూ చాలా కాలంగా తమ యొక్క మనుగడను కాపాడుకోవడం కోసం టారిఫ్ పెంపు గురించి చెబుతున్నాయి. ముఖ్యంగా 5G స్పెక్ట్రమ్ వేలం సమయంలో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి 5G ఎయిర్ వేలను కొనుగోలు చేయడంతో ఇప్పుడు టారిఫ్ ధరల పెంపు అనేది అనివార్యమైంది. వోడాఫోన్ ఐడియా (Vi) ముందునుంచి కూడా నష్టాలను చవిచూస్తూనే ఉండడంతో దాని యొక్క పెట్టుబడిదారులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోతున్నది. ఆదాయాన్ని పెంచుకోవడానికి టెల్కోకు టారిఫ్‌ల పెంపు అవసరం. ప్రస్తుతం Vi 4G సబ్‌స్క్రైబర్‌లను జోడిస్తోంది మరియు టారిఫ్ పెంపుతో రాబోయే త్రైమాసికాల్లో దాని మొత్తం ఆదాయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో యొక్క ప్రతి వినియోగదారుల సగటు ఆదాయం (ARPU) సంఖ్య ఇప్పటికీ ఎయిర్టెల్ మరియు జియో సంస్థలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. టారిఫ్‌ల పెంపుతో పాటు భారత్‌లో 5G రాకతో డేటా వినియోగం పెరుగుతుందని టక్కర్ తెలిపారు. జియో మరియు ఎయిర్టెల్ సంస్థలు రెండూ కూడా 5G యొక్క వేగవంతమైన రోల్ అవుట్ గురించి ఇప్పటికే కొన్ని ప్రకటనలను చేసినప్పటికీ Vi మాత్రం ఇప్పటి వరకు అటువంటి ప్రకటనలను ఏవి కూడా చేయలేదు.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Network Capacity is 2.9 Times Higher Than Previous September 2018

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X