Just In
- 1 hr ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 3 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 8 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 20 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
INDvsAUS : కోహ్లీపై కన్నేయండి.. అదే జరిగితే ఇండియాదే విజయం: మాజీ కోచ్
- News
YS Jagan : వైఎస్ జగన్ ను తిట్టిన కానిస్టేబుల్ కు జగ్గయ్యపేట కోర్టు బెయిల్..
- Movies
Vani Jayaram: రక్తపు మడుగులో వాణీ జయరాం.. లెజండరీ సింగర్ మృతిపై అనుమానాలు!
- Finance
Multibagger Stock: అప్పర్ సర్క్యూట్లు కొడుతున్న మల్టీబ్యాగర్ స్టాక్..
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
4G కొత్త ఫోన్‌ల కొనుగోలుపై రూ.2400 క్యాష్‌బ్యాక్ కూపన్‌లను అందిస్తున్న Vi.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే
ప్రపంచం మొత్తంగా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రస్తుత 2022 సంవత్సరంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఐదవ తరం నెట్‌వర్క్ లేదా 5G టెక్నాలజీకి మారడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే భారతదేశంలో 2G వినియోగదారులకు తమ యొక్క సేవలను అందించడంపై టెల్కోలు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నాయి. భారతదేశంలో ఇప్పటికి అధిక మంది 2G నెట్‌వర్క్ ను ఉపయోగిస్తున్నారు.

అయితే ఈ 2G వినియోగదారులను 4G వినియోగదారులుగా మార్చడాన్ని ప్రభావితం చేసే మరో అంశం సరసమైన ధరలో 4G స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం. అంతేకాకుండా 2G నుండి 4Gకి మారడానికి వినియోగదారులకు పెద్దగా ప్రోత్సాహకాలు కూడా లేవు. అయితే వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులను 4G ఫోన్‌లను కొనుగోలు చేసేలా ప్రేరేపించడానికి తన యొక్క వినియోగదారులకు నెలకు రూ.100 ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

2G కస్టమర్లకు వోడాఫోన్ ఐడియా(Vi) 4G స్మార్ట్‌ఫోన్ ఆఫర్
4G స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు నెలకు లభించే రూ.100 ఆఫర్ జూన్ 30, 2022 వరకు చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ ఆఫర్ కింద తెలిపే విధంగా పని చేస్తుంది.
స్టెప్ 1: మీరు Vi యొక్క 2G హ్యాండ్‌సెట్ వినియోగదారు అయితే కనుక మీరు 4G ఫోన్‌కి అప్‌గ్రేడ్ చేయాలి.
స్టెప్ 2: మీరు అర్హత కలిగిన కస్టమర్ అయితే కనుక మీరు Vi నుండి ఒక మెసేజ్ ని అందుకుంటారు.
స్టెప్ 3: రూ.299 ప్లాన్‌తో లేదా అంతకంటే ఎక్కువ ధరతో లభించే అపరిమిత ప్యాక్‌లతో రీఛార్జ్ చేయడం ద్వారా 24 నెలల పాటు ప్రతి నెలా రూ.100 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
స్టెప్ 4: Vi యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో మై కూపన్‌ల విభాగంలో రూ.100 x 24 నెలవారీ క్యాష్‌బ్యాక్ కూపన్‌లను వీక్షించవచ్చు.
స్టెప్ 5: రూ.299 మరియు అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే అపరిమిత ప్లాన్‌లతో తదుపరి 24 రీఛార్జ్‌ల కోసం రూ.100 నెలవారీ క్యాష్‌బ్యాక్ కూపన్‌లను ఉపయోగించవచ్చు.

వోడాఫోన్ ఐడియా(Vi) 4G ఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం సంస్థ తన యొక్క వినియోగదారులకు కొత్తగా అందిస్తున్న 4G ఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ యొక్క షరతులలో మొదటిది ఈ ఆఫర్ ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి మీరు కంపెనీ నుండి రూ.100 క్యాష్‌బ్యాక్‌లను పొందాలనుకుంటే ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారకండి. అంతేకాకుండా తర్వాత రాబోయే 24 నెలల వరకు మీరు రూ.299 మరియు అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే అపరిమిత ప్రయోజనాల ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేయాలి. లేదంటే ఈ ఆఫర్ రద్దుచేయబడుతుంది.

వోడాఫోన్ ఐడియా(Vi) 4G ఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ 2G నుండి 4G కొత్త ఫోన్ ని కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో మరొక విషయం ఏమిటంటే Vi యాప్‌లో మీరు పొందే రూ.100 క్యాష్‌బ్యాక్ కూపన్ కేవలం 30 రోజుల చెల్లుబాటును మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్ట మీరు ప్రతి 30 రోజులకు ఏదో ఒక రీఛార్జ్ కోసం ఈ వోచర్‌లను ఉపయోగించడం కొనసాగించాలి లేదంటే మీరు ఆఫర్‌ను పొందలేరు.

వోడాఫోన్ ఐడియా టెల్కో అందించే ఈ ఆఫర్ గొప్ప ఆఫర్ అని Vi ఎందుకు అనుకుంటుందో అర్థం చేసుకోవడం నిజంగా కష్టమే. ఇందులో పొందే ప్రతి క్యాష్‌బ్యాక్ కూపన్ ను ప్రతి రీఛార్జ్‌లో ఒక వోచర్‌ను మాత్రమే ఉపయోగించగలరు. అంటే దీని నుండి మీరు ఒకసారి పొందే గరిష్ట ప్రయోజనం కేవలం రూ.100 మాత్రమే. నిజం చెప్పాలంటే రూ.100 క్యాష్‌బ్యాక్ వోచర్ పొందడానికి ఇది చాలా ఇబ్బంది.

Vi రూ.299 ప్లాన్
వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.299 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ కాలానికి అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా వీకెండ్ డేటా రోల్‌ఓవర్, బింగే ఆల్ నైట్ మరియు డేటా డిలైట్ వంటి Vi హీరో యొక్క అన్‌లిమిటెడ్ ప్రయోజనాలకు కూడా వినియోగదారులు అదనంగా యాక్సెస్ ను పొందుతారు. ఈ ప్లాన్‌తో అదనంగా Vi మూవీస్ & TV క్లాసిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Vi సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్
వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ.599 ధర వద్ద అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలను 70 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తోంది. అదే ప్లాన్‌ను 70 రోజులు, 77 రోజులు మరియు 84 రోజులకు అందిస్తున్నందున కంపెనీ వ్యూహం కొంచెం అస్పష్టంగా ఉంది. అయితే మీరు ప్రతి నెల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడకపోతే కనుక మరియు సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్‌పై ఆసక్తి ఉంటే కనుక Vi రూ.2899 ధర వద్ద అందించే సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్‌కు వెళ్లవచ్చు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 365 రోజుల చెల్లుబాటు కాలానికి 1.5GB రోజువారీ డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470