వోడాఫోన్ ఐడియా (Vi) ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా 2GB డేటాను అందిస్తోంది

|

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా ప్రకటించిన హీరో అన్‌లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్‌లలో డేటా డిలైట్ ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్‌లో భాగంగా Vi వినియోగదారులు ప్రతి నెలా 2GB వరకు అదనపు డేటాను పొందగలరు. ఈ అదనపు డేటా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రోజువారీ డేటా పరిమితిపై అందించబడుతుంది. ఈ ఆఫర్ ఆటొమ్యాటిక్ గా యాక్టీవేట్ చేయబడదు. Vi వినియోగదారులు వారి మొబైల్ నంబర్ నుండి 121249కి డయల్ చేసి లేదా Vi యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. ఈ హీరో అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Vi అన్‌లిమిటెడ్ హీరో ప్లాన్‌లు

Vi అన్‌లిమిటెడ్ హీరో ప్లాన్‌లు రూ.299 ధర వద్ద నుండి ప్రారంభమవుతాయి. వీటిలో రూ.359, రూ.409, మరియు రూ.475 దరల వద్ద లభించే ప్లాన్‌లు అన్ని కూడా రోజువారీ డేటా పరిమితితో లభిస్తాయి. ఈ ప్లాన్లు అన్ని కూడా డేటా డిలైట్ ఆఫర్ విభాగంలో రోజువారీ డేటా పరిమితితో సంబంధం లేకుండా ప్రతి నెలా 2GB అదనపు డేటాను అందిస్థాయి. ఇంకా అన్‌లిమిటెడ్ హీరో ప్లాన్‌లలో బింగే ఆల్ నైట్ ప్రయోజనం ఉంటుంది. ఇది ప్రీపెయిడ్ కస్టమర్‌లకు రాత్రి 12am మరియు 6am మధ్య హై-స్పీడ్ డేటా యాక్సెస్‌ను అందిస్తుంది. దీనితో పాటుగా వీక్ ఎండ్ డేటా రోల్‌ఓవర్ ప్రయోజనం కూడా ఉంది. ఇది వారంలో ఉపయోగించని డేటాను వారాంతంలో శని మరియు ఆదివారాల్లో ఉపయోగించుకోవచ్చు.

Vi

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో ఇటీవల రూ. 82 యాడ్-ఆన్ ప్యాక్ ప్రీపెయిడ్ వినియోగదారులకు 28 రోజుల పాటు SonyLIV ప్రీమియం మొబైల్-మాత్రమే సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ UEFA ఛాంపియన్స్ లీగ్, బుండెస్లిగా మరియు UFC వంటి వివిధ స్పోర్ట్స్ స్ట్రీమ్‌లను వీక్షించడానికి Vi వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లో అనేక అంతర్జాతీయ మరియు అసలైన ప్రదర్శనలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాడ్-ఆన్ ప్యాక్‌లో 14 రోజుల చెల్లుబాటుతో 4GB హై-స్పీడ్ డేటా కూడా ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా(Vi) అమెజాన్ ప్రైమ్‌ వాలిడిటీ ఆఫర్
 

వోడాఫోన్ ఐడియా(Vi) అమెజాన్ ప్రైమ్‌ వాలిడిటీ ఆఫర్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో వినియోగదారులు ఎంచుకునే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఇకపై 1-సంవత్సరం చెల్లుబాటుతో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ని పొందలేరు. అయితే దీనికి బదులుగా వారు ఇప్పుడు ఆరు నెలల వాలిడిటీతో సబ్‌స్క్రిప్షన్ ను పొందుతారు. ఈ మార్పు ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని టెల్కో వెబ్‌సైట్ చెబుతోంది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు అందించే ఇతర ప్రయోజనాల యొక్క వాలిడిటీని కంపెనీ మార్చలేదు. Vi యొక్క వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు, ఫ్యామిలీ ప్లాన్‌లు లేదా REDX ప్లాన్‌లు అన్ని కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ యొక్క చెల్లుబాటును ఆరు నెలలకు తగ్గించబడింది.

వోడాఫోన్ ఐడియా(Vi) డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు చౌకైన ధరలో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనాన్ని ఉచితంగా అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రూ.601 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 3GB రోజువారీ డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్ 28 రోజుల స్వల్ప వ్యాలిడిటీని మాత్రమే కలిగి ఉంటుంది. ఇంకా వినియోగదారులు ఈ ప్లాన్‌తో Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలలో బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో పాటు వినియోగదారులు Vi మూవీస్ & TV VIPకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ మరియు 16GB బోనస్ డేటా వంటి అధిక ప్రయోజనాలు కూడా పొందుతారు. వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ.901 ధర వద్ద అందించే మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌తో కూడా తన యొక్క వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా 3GB రోజువారీ డేటా ప్రయోజనంతో లభిస్తుంది. ఈ ప్లాన్‌ 70 రోజుల సర్వీస్ వాలిడిటీతో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. అదనంగా ఈ ప్లాన్ కు టెల్కో యొక్క అన్ని Vi హీరో ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఈ ప్లాన్ 48GB బోనస్ డేటాతో పాటు Vi Movies & TV VIP యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Offers 2GB Free Data on Select Unlimited Prepaid Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X